Home /News /astrology /

Horoscope Today: నవంబరు 27 రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు.. జాగ్రత్తగా ఉండాలి

Horoscope Today: నవంబరు 27 రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు.. జాగ్రత్తగా ఉండాలి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Today Horoscope : నేడు శనివారం. ఇవాళ కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగ పరంగా అంతా మంచే జరుగుతుంది. అనుకున్న పనులు జరుగుతాయి. కానీ కొందరికి మాత్రం ఇబ్బందులు ఉన్నాయి. పని ఒత్తిడి పెరుగుతుంది. మరి మేషం నుంచి మీనం వరకు.. ఏ రాశి వారికి నేడు ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
    కాలజ్ఞానం

    నవంబరు 27, 2021

    దిన ఫలాలు

    మేష రాశి (Aries): చక్కని ఆర్థిక ప్రయోజనాలతో ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. తల పెట్టిన పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులకు బాగుంది.

    వృషభ రాశి (Taurus): ఆర్థిక, వ్యాపార రంగాల వారికి బాగుంది. భాగస్వాములతో విభేదాలు పరిష్కారమవుతాయి. రుణాలు తీరుస్తారు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ఆస్తి వివాదానికి సంబంధించిన కోర్టు కేసులో నెగ్గుతారు. ఆదాయం పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

    మిథున రాశి (Gemini): ఇప్పుడున్న ఊళోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఒకపట్టాన ముందుకు వెళ్లవు. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. పలుకుబడిగలవారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందంజ వేస్తారు.

    Forehead: మీ నుదురు ఈ షేప్‌లో ఉంటే.. ముందుచూపు చాలా..!

    కర్కాటక రాశి (Cancer): నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. దూరపు బంధువులు దగ్గరవుతారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

    సింహ రాశి (Leo): ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. పెళ్లి కుదిరే అవకాశం ఉంది. అనుకున్న పనులు చాలావరకు పూర్తవుతాయి. బంధుమిత్రుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. విద్యార్థులకు పరవాలేదు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

    Kubera Kunkum: ఆకుపచ్చ కుంకుమతో అదృష్టం కలిసొస్తుందా..? లక్ష్మీదేవి ఇంట్లో  తాండవిస్తుందా?

    కన్య రాశి (Virgo): ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకోవచ్చు. మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. స్థాన చలన సూచనలున్నాయి. బంధువులతో విభేదిస్తారు. కొత్త ఫ్లాట్ కొనడానికి ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.

    తుల రాశి (Libra): ఉద్యోగంలో అనుకూల సమాచారం అందుతుంది. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార, స్వయం ఉపాధి రంగాల వారికి బాగుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యాలలో పాల్గొంటారు. సంతానం నుంచి శుభ వార్త వింటారు. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు మందగిస్తాయి.

    Feng Shui: ఫెంగ్‌ షుయ్‌ వాస్తును అనుసరిస్తే.. ప్రేమను సులభంగా ఆకర్షించవచ్చు

    వృశ్చిక రాశి (Scorpio): శుభకార్యం తల పెడతారు. స్థాన చలనం సంభవం. సమయం అనుకూలంగా ఉంది. తలచిన పనులు నెరవేరుతాయి. ఒక పట్టాన పెళ్లి సంబంధం కుదరదు. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం వస్తుంది. రుణ బాధ తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

    ధనస్సు రాశి (Sagittarius): మంచి సంస్థలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అనుకోకుండా ఆస్తి కలిసి వస్తుంది. మంచి చోట వివాహ సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ మంచి ఫలితాలనిస్తాయి. ప్రేమ వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి. విద్యార్థులు ఎంతగానో కష్టపడాల్సి ఉంటుంది.

    మకర రాశి (Capricorn): ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభవార్త వింటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు మానసిక ఒత్తిడినిస్తాయి. స్పెక్యులేషన్ లాభించకపోవచ్చు.

    వంటగదిలో అన్నం పూర్తిగా అయిపోతే దానికి కారణం ఏంటో తెలుసా?

    కుంభ రాశి (Aquarius): ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా పుంజుకుంటారు. ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. అనుకున్న పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు పరవాలేదు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితురాలితో తిరుగుతారు.

    మీన రాశి (Pisces): ఉద్యోగానికి సంబంధించి దూర ప్రాంతం నుంచి మంచి ఆఫర్ వస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. స్నేహితురాలితో షికార్లు చేస్తారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Astrology, Horoscope, Horoscope Today, Rashifal, Rasi phalalu, Zodiac sign

    తదుపరి వార్తలు