Home /News /astrology /

Horoscope Today: నవంబరు 26 రాశి ఫలాలు.. వీరు జాగ్రత్త.. అనవసర ఖర్చులతో ఇబ్బందులు

Horoscope Today: నవంబరు 26 రాశి ఫలాలు.. వీరు జాగ్రత్త.. అనవసర ఖర్చులతో ఇబ్బందులు

నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు

Today Horoscope: నేడు శుక్రవారం (నవంబర్ 26).. ఇవాళ కొన్ని రాశుల వారికి అంతా బాగుంది. మరికొన్ని రాశుల వారి విషయంలో ఈ రోజు అస్సలు బాలేదు. వ్యాపారులు, వృత్తి నిపుణుల వారు జాగ్రత్తగా ఉండాలి. మరి మేషం నుంచి మీనం వరకు.. ఈ రోజు ఎవరికి ఎలా ఉందో తెలుసుకుందాం..

ఇంకా చదవండి ...
  కాలజ్ఞానం

  నవంబరు 26, 2021

  దిన ఫలాలు

  మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారులకు సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీలు జరపవద్దు.

  వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఉద్యోగానికి మంచి ఆఫర్లు వస్తాయి. వ్యాపారంలో ఉన్నవారికి కలిసొస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు కొద్దిగా పరిష్కారం అవుతాయి. వ్యాపారులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. వృత్తి నిపుణులకు పరవాలేదు. ఎవరికీ హామీలు ఉండవద్దు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమలో విజయం సాధిస్తారు.

  మిథునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారులు, స్వయం ఉపాధివారు ఆర్థికంగా పుంజుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. స్నేహితురాలి మనసు గెలుచుకుంటారు.

  శనిదేవుడికి నీలంరంగు పుష్పాలతో అర్చిస్తే.. అదృష్టం!

  కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఉద్యోగంలో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఇతరుల బాధ్యతలు నెత్తికెత్తుకోవద్దు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. ప్రేమ వ్యవహారాలు పరవాలేదు. వ్యాపారులకు శ్రమ తప్పదు.

  సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1) ఉద్యోగంలో అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పరిచయస్తులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. అనుకున్న పనులు చాలావరకు పూర్తవుతాయి. బంధువులతో పేచీలు తలెత్తుతాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

  కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) అధికారుల వల్ల బాగా ఇబ్బందులకు గురవుతారు. వ్యాపారం నిలకడగా సాగిపోతుంది. మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది. పెళ్లి సంబంధం వాయిదా పడుతుంది. అనవసర ఖర్చులతో బాగా ఇబ్బంది పడతారు. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

  నీటితోపాటు పాలను తులసి మాతకు సమర్పిస్తే..!

  తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఉద్యోగంలో అనుకూల సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. రాజకీయంగా పలుకుబడి గల వారితో పరిచయాలు పెరుగుతాయి. పాత స్నేహితులు పలకరిస్తారు. సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు మందగిస్తాయి.

  వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) గతంలో జరిగిన వ్యాపార లావాదేవీలు మంచి ఫలితాలనిస్తాయి. ఐ.టి నిపుణులకు విదేశాల నుంచి ఆనుకూల సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో విందుల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

  ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు ఆశాజనకంగా ఉంటుంది. అన్నివిధాలా సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. చాలాకాలంగా చేస్తున్న పెళ్లి ప్రయత్నం ఫలిస్తుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. పిల్లల నుంచి శుభవార్త వింటారు.

  Dreams: మీకు అలాంటి కల వచ్చిందా ? అయితే ఏం జరుగుతుందో తెలుసా..

  మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో శ్రమ ఎక్కువ లాభం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యంలో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందంజ వేస్తారు.

  కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక, వ్యాపార లావాదేవీలు మంచి ఫలితాలనిస్తాయి. బంధువులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అదృష్ట యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

  మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర , రేవతి ) ఉద్యోగంలో గట్టి పట్టుదలతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. తల పెట్టిన పనులు చాలావరకు పూర్తి అవుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వ్యాపారుల లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్త.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Astrology, Horoscope, Horoscope Today, Rashifal, Rasi phalalu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు