Home /News /astrology /

HOROSCOPE TODAY ON 25TH DECEMBER 2021 HERE IS TELUGU ASTROLOGY RASHIFAL RASI PHALALU FOR ALL 12 ZODIAC SIGNS SK

Horoscope Today: డిసెంబరు 25 రాశి ఫలాలు.. క్రిస్మస్ రోజున ఈ రాశుల వారికి అన్నీ శుభాలే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Today Horoscope: నేడు శనివారం. క్రిస్మస్ పర్వ దినాన పలు రాశుల వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అనుకున్నవన్నీ జరుగుతాయి. రోజంత సంతోషంగా ఉంటారు. కానీ కొందరికి మాత్రం ఇబ్బందుు తప్పవు. మరి మేషం నుంచి మీన రాశి వరకు.. ఇవాళ ఎవరికి ఎలా ఉందో తెలసుకుందాం.

ఇంకా చదవండి ...
    కాలజ్ఞానం

    డిసెంబరు 25, 2021

    దిన ఫలాలు

    మేషం (Aries)(అశ్విని, భరణి, కృత్తిక 1) మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. అధికారం చేపట్టే అవకాశం ఉంది. ఆదాయం, ఆరోగ్యం పరవాలేదు అనిపిస్తాయి. ఆదాయ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధు మిత్రుల నుంచి అదనపు సహకారం లభిస్తుంది. ఎవరికీ హామీలు ఉండొద్దు.

    వృషభం (Taurus)(కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఉద్యోగావకాశాలు మీ ముందుకు వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. వివాహానికి శుభ సమయం ఇది. సమాజంలో గౌరవ పురస్కారాలు లభిస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. శుభవార్తలు వింటారు. విద్యార్థులు శ్రమ పడక తప్పదు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

    మిథునం (Gemini)(మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఉద్యోగంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఇల్లు గానీ, స్థలం గానీ కొనే ఆలోచన చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.

    Debt: అప్పులు పెరుగుతున్నాయా.. వెంటనే ఈ పూజ చేస్తే మంచి ఫలితాలు..

    కర్కాటకం (Cancer)(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఉద్యోగంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. శక్తికి మించి శ్రమ పడి మంచి గుర్తింపు తెచ్చు కుంటారు. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం ఉంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని అవాంతరాలున్నా అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. దగ్గరి బంధువులతో విభేదాలు తలెత్తవచ్చు.

    సింహం (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1) అన్నివిధాలా సమయం బాగుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలకు ఆస్కారముంది. కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

    కన్య (Virgo)(ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ప్రయత్నాలు ఒక్కటొక్కటిగా ఫలిస్తాయి. సరైన ఆలోచనా విధానంతో ముందడుగు వేయండి. చాలావరకు రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సమాజానికి పనికి వచ్చే పనులు చేపడతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త.

    తుల (Libra)(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఉద్యోగ, వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. ధన లాభానికి అవకాశం ఉంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇంటి సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. వివాహ ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. ఇతరులకు సహాయపడతారు. ఆరోగ్యం విష యంలో జాగ్రత్త.

    Zodiac sign: 2022లో ఈ 5 రాశులవారికి వీరితో పెళ్లిముడి పడనుంది..

    వృశ్చికం (Scorpio)(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) ఉద్యోగంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆదాయపరంగా శుభవార్త వింటారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. వృత్తికి సంబంధించి కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో అనుకోకుండా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుద్యోగులకు అనుకూలంగా ఉంది.

    ధనస్సు (Sagittarius)(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. తలచిన పనులు చాలావరకు నెరవేరుతాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. గృహ, వాహన యోగాల మీద దృష్టి పెడతారు. వ్యాపారులు లాభాల బాటలో పడతారు.

    మకరం (Capricorn)(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. కొద్దిగా ధనలాభం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. మిత్రులు, ఆప్తుల సలహాలు, సూచనలు తీసుకోండి. ఇరుగు పొరుగువారితో వివాదాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడుతుంది.

    ఎంత కష్టపడినా జాబ్, ప్రమోషన్ రావట్లేదా? అయితే, దోష నివారణకు ఇలా చేయండి

    కుంభం (Aquarius)(ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) మంచి ఉద్యోగం వస్తుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. ప్రతిదీ ఆలోచించి చేయండి. ప్రణాళికా బద్ధంగా పనిచేస్తే లక్ష్యాన్ని చేరుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఎదురవుతాయి. సహోద్యోగుల సహకారం కూడా తీసుకోండి. బంధువులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం విష యంలో జాగ్రత్త.

    మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4) ఆర్థికంగా కొన్ని ప్రయోజనాలు చోటు చేసుకుంటాయి. ప్రస్తుతానికి సమయం అంత అనుకూలంగా లేదు. ఇంటా బయటా శ్రమ పెరుగుతుంది. సమస్యల పరిష్కారానికి విపరీతంగా ఆలోచించి మనశ్శాంతి పోగొట్టుకోవద్దు. అందరినీ కలుపుకుని వెళ్తే మంచిది. వివాదాలకు దూరంగా ఉండండి. హామీ లు ఉండొద్దు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Astrology, Horoscope, Horoscope Today, Rashifal, Rasi phalalu, Zodiac sign

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు