Home /News /astrology /

Horoscope Today: నవంబరు 24 రాశి ఫలాలు..వీరికి చాలా బాగుంది..రాదనుకున్న డబ్బు వస్తుంది

Horoscope Today: నవంబరు 24 రాశి ఫలాలు..వీరికి చాలా బాగుంది..రాదనుకున్న డబ్బు వస్తుంది

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Horoscope Today: నేడు బుధవారం (నవంబర్ 24).. ఇవాళ పలు రాశుల వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని రాశుల వారికి ముఖ్యంగా ఆర్థికంగా లాభం చేకూరుతుంది. కానీ కొందరికి మాత్రం ఇబ్బందులు ఉన్నాయి. మరి మేషం నుంచి మీనం వరకు.. ఇవాళ ఏ రాశి వారికి ఎలా ఉందో తెలసుకుందాం.

ఇంకా చదవండి ...
  కాలజ్ఞానం

  నవంబరు 24, 2021

  దిన ఫలాలు

  మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1) అన్ని విధాలా అనుకూలమైన సమయం ఇది. అధికార యోగానికి అవకాశం ఉంది. తల పెట్టిన ప్రతి పనీ పూర్తి చేస్తారు. ఆటంకాలు, వ్యతిరేకతలను అధిగమిస్తారు. కుటుంబపరంగా ఎంతగానో కలిసి వస్తుంది. ఆశించినంతగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అదనపు ఆదాయం గడించేందుకు అవకాశం ఉంది.

  వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఉద్యోగంలో మీ శ్రమ ఫలిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. వ్యాపారపరంగా లాభపడతారు. ఆకస్మిక ధనయోగముంది. చాలాకాలంగా పట్టి పీడిస్తున్న కుటుంబ సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. శుభ వార్తలు ఉత్సాహాన్నిస్తాయి. ఆరోగ్యానికి డోకా లేదు. శత్రు దోషం పోతుంది. ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు, తీసుకోవద్దు.

  మిథునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మంచి ఆలోచనలు, నిర్ణయాలతో ఆదాయం పెంచుకుంటారు. ఇంట్లో శుభ కార్యానికి అవకాశముంది. వృత్తి, వ్యాపారాలకు సంబంధించి చేస్తున్న ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి. గృహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థికంగా పరవాలేదు.

  ఈ 4 రాశుల మగవారు మనస్సులో కొన్నిసార్లు విషం పెట్టుకుని.. బయట నటిస్తారట!

  కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) గ్రహ సంచారం అంతగా అనుకూలంగా లేదు. అయినప్పటికీ పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మిత్రుల సలహాలు ఉపయోగపడతాయి. ఉద్యోగంలో అధికారుల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది.

  సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1) మీ ప్రతిభాపాటవాలకు తగిన ఉద్యోగం లభించే సూచనలున్నాయి. చదువులో చక్కని విజయం సాధి స్తారు. పట్టుదలతో అనుకున్నవి చేజిక్కించుకుంటారు. రాదనుకున్న డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. ఆదాయానికి మించి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

  కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ పెంచడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో తగినంత కృషి అవసరం. గ్రహ సంచారం పూర్తిగా అనుకూలంగా లేనందువల్ల ఆర్థికంగా కొద్దిగా ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి బాగా పెరుగుతాయి. రుణ సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది.

  Mole Theory : శరీరంలో ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే.. శృంగారంలో రెచ్చిపోతారట

  తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అత్యుత్తమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. సమాజంలో పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఉన్నత స్థితికి అవకాశం ఉంది. అన్ని విధాలా సమయంఅనుకూలంగా ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

  వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి ఉంటాయి. సహోద్యోగులు ఇబ్బందులు కలిగిస్తారు. సమయానుకూలమైన నిర్ణయాలతో కుటుంబ సమస్యల్ని పరిష్కరించుకుంటారు. మిత్రుల సలహాలను పాటించండి. కలహాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఆదాయం నిలకడగా ఉంటుంది.

  Vastu Tips: ఇంట్లో ఈ 8 వస్తువులూ ఉంటే.. డబ్బు కొరత ఉండదు..!

  ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఆర్థిక సంబంధమైన విషయాలు చాలావరకు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తా రు. ఉద్యోగంలో సమస్యలు తొలగుతాయి. వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. మిత్రుల సలహాలను పాటించండి. కలహాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఆదాయం నిలకడగా ఉంటుంది. మనస్తత్వం చాలా మంచిది. ముఖ్యమైన నిర్ణయాల్లో కుటుంబ సభ్యులను సంప్రదించండి. బంధుమిత్రులతో అపోహలు తలెత్తే సూచనలున్నాయి.

  మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) ఆర్థికంగా మంచి కాలం నడుస్తోంది. మీ నిర్ణయాలు, ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో సుస్థిరత ఏర్పడుతుంది. కొత్త సంస్థ నుంచి ఆఫర్లు వస్తాయి. రావనుకున్న బాకీలు వసూలవుతాయి. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తోంది. కొద్దిగా ఆలస్యమైనా పనులు పూర్తవుతాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.

  ఇంట్లో ఇలాంటి అద్దం ఉంటే.. వెంటనే తీసేయండి!

  కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) సొంత పనులకు ప్రాధాన్యం ఇవ్వండి. మీ శక్తికి మించి ఇతరులకు సహాయపడతారు. ఉద్యోగపరంగా కష్టపడాల్సి ఉంటుంది. బంధుమిత్రుల సలహాలు కలిసి వస్తాయి. ధన యోగం ఉంది. శుభవార్తలు వింటారు. సమయోచిత నిర్ణయాలతో కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.

  మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4) ఆర్థికంగా బాగుంది. ఎన్ని అవరోధాలు, ఆటంకాలు ఎదురైనా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఓర్పు, సహనాలతో వ్యవహరించి కుటుంబ సమస్యలను కొంతవరకు పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీ శ్రమకు తగ్గ ఫలితాలు అనుభవానికి వస్తాయి. మిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Astrology, Horoscope, Horoscope Today, Rashifal, Rasi phalalu, Zodiac sign

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు