Home /News /astrology /

HOROSCOPE TODAY ON 21ST OCTOBER 2021 HERE IS TELUGU ASTROLOGY RASI PHALALU RASHIFAL THESE ZODIAC SIGNS WILL GET MONEY SK

Horoscope Today: అక్టోబరు 21 రాశి ఫలాలు.. వీరికి శుభవార్త.. ఆకస్మిక ధనలాభం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Horoscope Today: నేడు గురువారం.. ఇవాళ ఏయే రాశుల వారికి బాగుంది? ఏయే రాశుల వారికి బాగాలేదు.? జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారు? ఎలాంటి జాగ్రత్తలు సూచిస్తున్నారు? ఈ వారం రాశి ఫలాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

    కాలజ్ఞానం

    అక్టోబరు 21, 2021

    దినఫలాలు

    మేష రాశి (Aries):
    ఆర్థికంగా కొంత ప్రయోజనం జరుగుతుంది. ప్రస్తుతానికి మీకు అంతగా అనుకూలంగా లేదు. ఇంటా బయటా బాగా శ్రమ పెరుగుతుంది. సమన్యల పరిష్కారానికి అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంతత లోపిస్తుంది. అందరినీ కలుపుకుని వెడితే మంచిది. వివాదాలకు దూరంగా ఉండండి. ఎవరికీ హామీలు ఉండొద్దు.

    వృషభ రాశి (Taurus):
    వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. ఆదాయం, ఆరోగ్యం పరవాలేదనిపిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారం చేపట్టే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త అదాయ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల నుంచి సహకారం లఖిస్తుంది. ఎవరికీ హామీలు ఉండొద్దు.

    మిథున రాశి (Gemini):
    ఉద్యోగావకాశాలు మీ ముందుకు వస్తాయి. వివాహానికి శుభ సమయం ఇది. ఆర్థిక పరిస్థితి బాగామె రుగుపడుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. బంధువర్గంలో గౌరవ పురస్కారాలు లభిస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. శుభవార్తలు వింటారు. విద్యార్థులు శమ పడక తప్పదు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త.

    Feng Shui Tips: మీ ఇంట్లో అద్దం ఇక్కడ ఉంటే.. వెంటనే తీసేయండి!

    కర్కాటక రాశి (Cancer):
    ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పట్టదలగా కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. ఉద్యోగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇల్లు గానీ, స్థలం గానీ కొనే ఆలోచన చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.

    సింహ రాశి (Leo):
    ఉద్యోగం విషయంలో అనుకున్నది సాధిస్తారు. అధికారుల్ని ప్రతిభతో మెప్పిస్తారు. ఆకస్మిక ధన లాభం ఉంది. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. కొన్ని అవాంతరాలున్నా అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. దగ్గరి బంధువులతో విభేదాలకు అవకాశం ఉంది. శక్తికి మించి శమ వడి మంచి గుర్తింపు తెచ్చుకుంటారు.

    కన్య రాశి (Virgo):
    అన్నివిధాలా సమయం బాగుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలకు ఆస్కారముంది. కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

    బ్రహ్మముహూర్తంలో ఈ పని అస్సలు చేయకండి.. లేకుంటే..!

    తుల రాశి (Libra):
    ఉద్యోగపరంగా సమయం అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ఒక్కటొక్కటిగా ఫలిస్తాయి. సరైన ఆలోచనా విధానంతో ముందడుగు వేయండి. రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సమాజానికి పనికి వచ్చే వనులు చేపడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.

    వృశ్చిక రాశి (Scorpio):

    ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. సమాజంలో పలుకుబడిపెరుగుతుంది. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారమవుతుంది. వివాహ ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.

    లాఫింగ్‌ బుద్ధుడి ఈ రూపం.. మీ అదృష్టాన్ని మార్చగలదు!

    ధనస్సు రాశి (Sagittarius):
    ఆర్థికంగా శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి తప్పదు. ఆదాయానికి సంబంధించి కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్ధులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. తిప్పట ఎక్కువగా ఉంటుంది.

    మకర రాశి (Capricorn):
    సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. కొన్ని ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. గృహ, వాహన యోగాల మీద దృష్టి పెడతారు. విద్యార్ధులకు పరవాలేదు.

    'ఉత్తమ కౌగిలింత' ఏ రాశివారిదో తెలుసా?

    కుంభ రాశి (Aquarius):
    ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. కొద్దిగా ధనలాభం కూడా ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. థైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. మిత్రులు, అన్నల సలహా లు, సూచనలు తీసుకోండి. ఇరుగు పారుగుతో వివాదాలకు దిగవద్దు. ఆరోగ్యం పరవాలేదు. హామీలు ఉండవద్దు.

    మీన రాశి (Pisces):
    ఆశించిన విధంగా మంచి ఉద్యోగం వస్తుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. ప్రతిదీ ఆలోచించి చేయండి. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే లక్ష్యాన్ని చేరుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఎదురవుతాయి. సహోద్యోగుల సహకారం కూడా తీసుకోండి. బంధువులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి . ఆరోగ్యం జాగ్రత్త.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Astrology, Horoscope, Horoscope Today, Rashifal, Rasi phalalu, Zodiac signs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు