Home /News /astrology /

Horoscope Today: నవంబరు 20 దిన ఫలాలు.. ఈ రాశి వారు ఇల్లు లేదా స్థలం కొనే అవకాశం

Horoscope Today: నవంబరు 20 దిన ఫలాలు.. ఈ రాశి వారు ఇల్లు లేదా స్థలం కొనే అవకాశం

నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు

Horoscope today: గ్రహాలు, తిథి, నక్షత్రం వంటి అంశాల ఆధారంగా రాశి ఫలాలను నిర్దేశిస్తున్నారు జ్యోతిష పండితులు. ఇవి ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. గ్రహాలు ఏ రాశి క్షేత్రంలో తిరుగుతున్నాయో దాని ఆధారంగా... వారి రాశి ఫలాలపై మంచి, చెడు ఫలితాలు ప్రభావం చూపుతాయి.

ఇంకా చదవండి ...
  కాలజ్ఞానం

  నవంబరు 20, 2021

  దినఫలాలు

  మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
  ఆర్థికంగా కొన్ని ప్రయోజనాలు చోటు చేసుకుంటాయి. ప్రస్తుతానికి సమయం అంత అనుకూలంగా లేదు. ఇంటా బయటా శ్రమ పెరుగుతుంది. సమస్యల పరిష్కారానికి విపరీతంగా ఆలోచించి మనశ్శాంతి పోగొట్టుకోవద్దు. అందరినీ కలుపుకుని వెడితే మంచిది. వివాదాలకు దూరంగా ఉండండి. హామీలు ఉండొద్దు.

  వృషభం (కృత్తిక 2,3,4,రోహిణి, మృగశిర 1,2)
  వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. ఆదాయం, ఆరోగ్యం పరవాలేదనిపిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అధికారం చేపట్టే అవకాశం ఉంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. బంధుమిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. ఎవరికీ హామీలు ఉండొద్దు.

  Zodiac Sign: శీతాకాలంలో ఈ 5 రాశులవారు ఏం చేస్తారో తెలుసా?

  మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
  ఉద్యోగావకాశాలు మీ ముందుకు వస్తాయి. వివాహానికి శుభ సమయం ఇది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. సమాజంలో గౌరవ పురస్కారాలు లభిస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. శుభవార్తలు వింటారు. విద్యార్థులు శ్రమ పడక తప్పదు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త.

  కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
  ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. ఉద్యోగంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇల్లు గానీ, స్థలం గానీ కొనే ఆలోచన చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.

  సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
  ఉద్యోగంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. అధికారుల్ని ప్రతిభతో మెప్పిస్తారు. ఆకస్మిక ధన లాభం ఉంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని అవాంతరాలున్నా అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. దగ్గరి బంధువులతో విభేదాలకు అవకాశం ఉంది. శక్తికి మించి శ్రమ పడి మంచి గుర్తింపు తెచ్చుకుంటారు.

  Chanakya Niti : ఈ ఐదింటికి దూరంగా ఉండండి.. లేకపోతే మీరు ప్రమాదంలో  పడ్డట్లే

  కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
  అన్నివిధాలా సమయం బాగుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలకు ఆస్కారముంది. కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

  తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
  ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ప్రయత్నాలు ఒక్కటొక్కటిగా ఫలిస్తాయి. సరైన ఆలోచనా విధానంతో ముందడుగు వేయండి. చాలావరకు రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సమాజానికి పనికి వచ్చే పనులు చేపడతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త.

  వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
  ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇంటి సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. వివాహ ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. ఇతరులకు సహాయపడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.

  ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
  ఆదాయపరంగా శుభవార్త వింటారు. ఉద్యోగంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇంటాబయటా బాగా ఒత్తిడి ఉంటుంది. వృత్తికి సంబంధించి కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో అనుకోకుండా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుద్యోగులకు అనుకూలంగా ఉంది. తిప్పట ఎక్కువగా ఉంటుంది.

  పాత తరహా పద్ధతులను ఫాలో అయ్యే ఓల్డ్ స్కూల్ రొమాంటిక్స్.. ఏ రాశి వారు ఇలా ఉంటారంటే..

  మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
  సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. తలచిన పనులు చాలావరకు నెరవేరుతాయి. ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. గృహ, వాహన యోగాల మీద దృష్టి పెడతారు. వ్యాపారులు లాభాల బాటలో పడతారు.

  కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
  ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. కొద్దిగా ధనలాభం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. మిత్రులు, ఆప్తుల సలహాలు, సూచనలు తీసుకోండి. ఇరుగు పొరుగువారితో వివాదాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడుతుంది.

  మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
  మంచి ఉద్యోగం వస్తుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. ప్రతిదీ ఆలోచించి చేయండి. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే లక్ష్యాన్ని చేరుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఎదురవుతాయి. సహెూద్యోగుల సహకారం కూడా తీసుకోండి. బంధువులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Astrology, Horoscope, Horoscope Today, Rashi fal, Rasi phalalu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు