హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Horoscope Today: ఈ రాశుల వారు నేడు శుభవార్త వింటారు.. ఇతరుల మాటలకు పడిపోవద్దు.. మే1 రాశిఫలాలు

Horoscope Today: ఈ రాశుల వారు నేడు శుభవార్త వింటారు.. ఇతరుల మాటలకు పడిపోవద్దు.. మే1 రాశిఫలాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Today Horoscope: మే 1 దిన ఫలాలు. మేషం నుంచి మీనం వరకు నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో.. ఇవాళ్టి రాశి ఫలాల్లో తెలుసుకుందాం.

Horoscope Today: మే 1 రాశి ఫలాలు. ఓ రాశివారికి చెందిన వారు ఈ రోజు వేడుకలకు ఆహ్వానం అందుకుంటారు. మరో రాశికి చెందిన వారికి ఏది చేయాలో? ఏది వదులుకోవాలో? తెలియని పరిస్థితి ఎదురవుతుంది. కొందరు స్నేహితులతో ట్రిప్‌ ప్లాన్‌ చేయడానికి అనుకూల సమయం. నక్షత్రాల గమనం ఆధారంగా వీటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. మే 1వ తేదీ ఆదివారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.

* మేషం (Aries):

నిజాలు బయటపడుతున్నాయి పరిస్థితులను క్షుణ్నంగా అర్థం చేసుకోగలరు. ప్రస్తుతానికి వింతగా అనిపించే అవకాశం మీకు ఎదురవుతుంది.. మీరు స్థిరంగా ఉంటే, ఆ అవకాశం మీకు ఉపయోగపడుతుంది. గెట్‌ టుగెదర్‌ లేదా పనికి సంబంధించిన సమావేశానికి ఆహ్వానం అందుకొంటారు.

లక్కీ సైన్- మర్రిచెట్టు

* వృషభం (Taurus):

పెద్దల నుంచి వచ్చిన ఒక సలహా ప్రస్తుతానికి అర్థం కాకపోవచ్చు, కానీ దాని గురించి తరువాత ఆలోచించి దానికి కట్టుబడి ఉండటం మంచిది. సంక్లిష్టమైన పరిస్థితి రోజంతా మిమ్మల్ని మానసికంగా ఆక్రమిస్తుంది. ఒక వేడుక తాత్కాలికంగా ఆగిపోవచ్చు. రోజు చివరిలో ఒక శుభవార్త అందుకుంటారు. ఇంట్లోనే ఉండడం ఉత్తమం.

లక్కీ సైన్- క్యాండిల్స్‌

వాస్తు ప్రకారం చిటికెడు ఉప్పుతో ఇలా చేస్తే.. రెప్పపాటులో నెగిటివిటీ తొలగిపోతుందట..

* మిథునం (Gemini):

ఏది చేయాలి, దేన్ని వదులుకోవాలనే అనే అంశాలను తేల్చుకోవడం అంతర్గత యుద్ధంలా అనిపిస్తుంది. నిర్ణయం తీసుకునే క్రమంలో మీరు రెండుగా చీలిపోయినట్లు అనిపిస్తుంది. గందరగోళం నుంచి త్వరగా బయటపడేందుకు ప్రయత్నించాలి. మీ జీవిత భాగస్వామికి ఒక నిర్దిష్ట ఆరోగ్య సమస్య ఉండవచ్చు. కొత్త కెరీర్‌ మొదలయ్యే అవకాశం ఉంది.

లక్కీ సైన్- ట్రైన్‌

* కర్కాటకం (Cancer):

మీ ఉద్దేశ్యం ఎల్లప్పుడూ సరైనదే కావచ్చు, కానీ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కొంత సమయం పాటు తక్కువగా మాట్లాడుతూ పరిస్థితులను ఎక్కువగా గమనించాల్సిన అవసరం ఉంది. మీ పిల్లలతో కొంత మానసిక పరిస్థితి దెబ్బతినవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

లక్కీ సైన్- జాక్‌పాట్‌

* సింహం (Leo):

సంబంధాలు అమూల్యమైనవి, కానీ అవి కూడా సున్నితమైనవి. మీ చుట్టూ ఉన్న ఎవరికైనా వ్యతిరేకంగా తీర్పు చెప్పే ముందు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు స్నేహితులతో కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఇది అనువైన సమయం. డబ్బు వ్యవహారాలు పరిష్కారమవుతాయి.

లక్కీ సైన్- స్టార్స్‌

Astrology: శనిశ్చరి అమావాస్య రోజే సూర్యగ్రహణం.. ఈ రాశుల వారికి అస్సలు మంచిది కాదు..

* కన్య (Virgo):

ఇది భాగస్వాములతో కలవడానికి, కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి అనుకూల సమయం. ఏదైనా ఒకదానిపై మీకు అనుమానం ఉంటే, ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టడం మంచిది. గతంలో చేసిన అన్ని ప్రయత్నాలకు, ఇప్పుడు ఫలితాలు అందుకుంటారు. యాక్టివ్ బిజినెస్ కొంచెం నెమ్మదించవచ్చు, కానీ భవిష్యత్తు బాగుంటుంది. గృహ విషయాలు ప్రస్తావనకు వస్తాయి.

లక్కీ సైన్- గ్లాస్‌ టాప్‌

* తుల (Libra):

కొన్ని రకాల వేడుకలు జరిగే అవకాశం ఉంది. మీ డబ్బు సమస్యలు పరిష్కారమవుతాయి. పనిలో మీకు అనుకూలమైన మార్పులు జరుగుతాయి. కుటుంబం మద్దతిచ్చే అవకాశం ఉంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు అందుకుంటారు.

లక్కీ సైన్- గుర్రం

* వృశ్ఛికం (Scorpio):

పరిస్థితులు నెమ్మదిగా చక్కదిద్దుకొంటున్నాయి. ఈ వాతావరణాన్ని మీరు ఇష్టపడుతున్నారు. మీ విధానం లేదా మీ ఆలోచన ప్రక్రియలో మార్పు వచ్చింది. మీ పై అధికారుల స్థానాల్లో మార్సులు జరిగే అవకాశం ఉంది. ఇతరుల మాటలకు పడిపోవద్దు.

లక్కీ సైన్- వరుసలోని ఐదు పక్షులు

Bad Omen: అద్దం పగిలితే చెడు శకునమా? దాన్ని ఎలా నివారించాలో తెలుసా?

* ధనస్సు (Sagittarius):

మీ రిలేషన్‌లో చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మీ రొమాంటిక్ ఆసక్తులు, హృదయంలో ఉన్న కోరికలను వ్యక్తపరచలేని సందర్భాలు ఉన్నాయి. ఒక చిన్న వర్క్ ట్రిప్‌ చేపట్టే సూచనలు ఉన్నాయి. ఇది మీ ఇమేజ్‌ని మెరుగుపరుస్తుంది లేదా నెట్‌వర్క్‌లో మీ స్థానాన్ని బలోపేతం చేస్తుంది. ఎక్కువ పని, తక్కువ విశ్రాంతి ఉండవచ్చు, కృషికి విలువ ఉంటుంది.

లక్కీ సైన్- బుద్ధుడి విగ్రహం

* మకరం (Capricorn):

పపనులు జరిగేలా చేయడానికి మీరు అదనంగా కష్టపడాల్సి ఉంటుంది. కొంత ప్రతిఘటన ఉన్నట్లు కనిపిస్తోంది. మీరు ఒక పాయింట్‌ను నిరూపించడానికి మరింత కష్టపడాల్సి రావచ్చు. పని చేసే సహోద్యోగులతో సాధారణ సమావేశం కొత్త ఆచరణాత్మక ఆలోచనను తీసుకురావచ్చు. తల్లిదండ్రులకు సమయం కేటాయించాలి. ప్రస్తుతం ఎక్కువగా పని చేయాల్సి ఉన్నా, కొంచెం వెనక్కి తగ్గినట్లు, సోమరితనంగా భావిస్తారు.

లక్కీ సైన్- టోపాజ్‌

* కుంభం (Aquarius):

ఇటీవల మారిన పరిసరాలు, వాతావరణం నుంచి ప్రేరణ పొందుతారు. చుట్టూ ఉన్న వ్యక్తులతో స్నేహంగా మెలుగుతారు. కొన్నిసార్లు ఒంటరిగా ఉంటారు. మరికొంత కాలం జీవితం ఇలాగే ఉండే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధమైన ఒక శుభవార్త మిమ్మల్ని నవ్వించే అవకాశం ఉంది.

లక్కీ సైన్- వైట్‌ రోసెస్‌

* మీనం (Pisces):

మీరు ఏదైనా విషయంలో సీరియస్‌గా ఉన్నట్లయితే, అన్ని కోణాలను బాగా పరిశీలించారో లేదో నిర్ధారించుకోండి. మీకు తెలిసిన కొద్దిమంది నుంచి మీరు సలహా తీసుకోవాలనుకునే సమయం. కానీ మీకు సరైన సమాధానం రాకపోవచ్చు. అందువల్ల అన్నిటికన్నా ఎక్కువగా మీ మనస్సుపై ఆధారపడవచ్చు. అధికారిక విషయాలను ఇంటికి తీసుకు రాకుండా ఉండటం మంచిది.

లక్కీ సైన్- మ్యాగ్నెట్‌

First published:

Tags: Astrology, Horoscope, Rashifal, Zodiac signs

ఉత్తమ కథలు