Home /News /astrology /

Horoscope Today: నవంబరు 19 రాశి ఫలాలు.. వీరికి వారికి శుభవార్త.. కష్టాలన్నీ తీరుతాయి..

Horoscope Today: నవంబరు 19 రాశి ఫలాలు.. వీరికి వారికి శుభవార్త.. కష్టాలన్నీ తీరుతాయి..

నవంబర్ 19, 2021 దిన ఫలాలు

నవంబర్ 19, 2021 దిన ఫలాలు

Horoscope Today: నేడు శుక్రవారం. ఇవాళ ఏ రాశి వారికి ఎలా ఉంది? ఎవరికి బాగా లేదు? జ్యోతిష పండితులు ఏం సూచిస్తున్నారు? ఎలాంటి జాగ్రత్తలు చెబుతున్నారు? మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలను ఇక్కడ చూద్దాం.

    కాలజ్ఞానం

    నవంబరు 19, 2021

    దిన ఫలాలు

    మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
    పనులు పూర్తి కావడానికి ఎక్కువగా శ్రమపడాల్సి ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబంలో అనుకోని సమస్య ఒకటి ఎదురవుతుంది. ఉద్యోగ, వ్యాపారంలో శుభవార్త వింటారు. మిత్రులు సహాయపడతారు. సానుకూల దృక్పథంతో వ్యవహరించండి. ప్రమాదాల పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్త.

    వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
    అనుకోకుండా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనుల్లో పురోగతి ఉంటుంది. సమయానికి సాయం అందుతుంది. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆంతరంగిక విషయాలు ఎవరితోనూ చర్చించవద్దు. బంధువులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. భార్యాపిల్లలతో కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

    మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
    వృత్తి ఉద్యోగాల్లో కాస్తంత ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పలుకుబడిగల వారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యాల్లో పాల్గొంటారు. మిత్రులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ప్రయాణాలు కలసి వస్తాయి. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది.

    Lunar Eclipse 2021: పవిత్రపూర్ణిమ రోజే.. అతిపెద్ద చంద్రగ్రహణం.. ఈ సమయం నుంచే..!

    కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
    ఉద్యోగ, వ్యాపారాలు సాఫీగా ముందుకు సాగిపోతాయి. స్వయంకృషితో మంచి పేరు తెచ్చుకుంటారు. సంపద పెంచుకునే ఆలోచన చేస్తారు. ఇంటా బయటా ఒత్తిడిని తట్టుకుని సత్ఫలితాలు సాధిస్తారు. చాలాకాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త.

    సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
    వృత్తి ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి అధికంగా ఉంటాయి. ప్రతి విషయాన్నీ కుటుంబ సభ్యులతో చర్చించి సలహాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండండి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త.

    కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1, 2)
    ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. ఇంటా బయటా మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. ఆరోగ్య సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యమైన పనుల్లో ఎదురవుతున్న అవరోధాలు తొలగుతాయి. సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. ఎవరికీ హామీలు ఉండొద్దు.

    ఇంట్లో ఈ ఒక్క వస్తువు ఉంటే.. డబ్బు కొరత ఉండదు!

    తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
    శక్తి వంచన లేకుండా కృషి చేసి పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. బంధువులకు మీ వల్ల మేలు జరుగుతుంది. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. బంధువర్గంలో వివాహ సంబంధం కుదరవచ్చు.

    వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
    మంచి జీవితం కోసం మార్గాలు ఆలోచిస్తారు. అనుకున్న పనులు శ్రమ మీద పూర్తవుతాయి. ఇంటికి బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. ఆదాయం పరవాలేదు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. డబ్బు నష్టం జరగవచ్చు. ఆరోగ్యం జాగ్రత్త.

    ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
    ఉద్యోగ, వ్యాపారాల్లో మీ కృషి సత్ఫలితాలనిస్తుంది. ఎన్ని అవరోధాలు ఎదురైనా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఉన్నత పదవులకు అవకాశం ఉంది. ఖర్చు విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఆరోగ్యం బాగుంటుంది. గృహ ప్రయత్నం ఫలిస్తుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు.

    vastu: మీ ఇంటికి నెగిటివ్‌ ఎనర్జీ రావడానికి.. ఇది కూడా కారణం!

    మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం,ధనిష్ఠ 1,2)
    ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులకు ఉపాధ్యాయుల ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. వివాదాలకు దూరంగా ఉండండి.

    కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
    ఉద్యోగపరంగా మంచి సమయం. వ్యాపారంలో శ్రమ పెరిగినా చక్కని ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆదాయం పెంచుకునే మార్గాల గురించి ఆలోచిస్తారు. అప్పులు తీరుస్తారు. శుభవార్తలు వింటారు. మిత్రులకు మీ వల్ల ఎంతో మంచి జరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

    మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
    అన్ని విధాలా అనుకూల సమయం. శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. ఆరోగ్యానికి ఏమీ డోకా లేదు. కొద్దిగా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సహకారం ఉంటుంది. ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Astrology, Horoscope, Horoscope Today, Rashifal, Rasi phalalu, Zodiac signs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు