Home /News /astrology /

Horoscope: నవంబరు 18 దిన ఫలాలు.. ఈ రాశుల వారికి బాగుంది.. చేతి నిండా డబ్బు

Horoscope: నవంబరు 18 దిన ఫలాలు.. ఈ రాశుల వారికి బాగుంది.. చేతి నిండా డబ్బు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Horoscope Today: నేడు గురువారం. ఇవాళ ఏ రాశి వారికి ఎలా ఉంది? ఎవరికి బాగా లేదు? జ్యోతిష పండితులు ఏం సూచిస్తున్నారు? ఎలాంటి జాగ్రత్తలు చెబుతున్నారు? మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలను ఇక్కడ చూద్దాం.

    కాలజ్ఞానం

    నవంబరు 18, 2021

    దిన ఫలాలు

    మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
    ఉద్యోగంలో బాగా శ్రమ పెరుగుతుంది. ఓర్పుతో వ్యవహరిస్తే మంచే జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఎవరినీ పూర్తిగా నమ్మవద్దు. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యుల సలహాలు కూడా పాటించండి. పరిచయస్తులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యానికి ఢోకా లేదు.

    వృషభం (కృత్తిక 2,3,4,రోహిణి, మృగశిర 1,2)
    ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. మిత్రుల సహకారంతో ఒక ముఖ్యమైన పని పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ధన లాభం ఉన్నా ఖర్చులు కూడా పెరుగుతాయి. ప్రస్తుతం మంచి కాలం నడుస్తోంది. సద్వినియోగం చేసుకోండి. కుటుంబం ద్వారా ప్రయోజనం పొందుతారు.

    మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
    పట్టుదలగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో కూడా సంప్రదించండి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తోంది. ఉద్యోగంలో శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం పరవాలేదు. ఆదాయం నిలకడగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.

    vastu: మీ ఇంటికి నెగిటివ్‌ ఎనర్జీ రావడానికి.. ఇది కూడా కారణం!

    కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
    ఉద్యోగంలో మంచి అధికార యోగం కనిపిస్తోంది. మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. కుటుంబ పెద్దల సహకారం ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. వాదనలకు దూరంగా ఉండండి. శ్రమ మీద కొంతవరకు పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం పరవాలేదు. విశ్రాంతి అవసరం.

    సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
    ఉద్యోగపరంగా అంతా మంచే జరుగుతుంది. వ్యాపారం అన్ని విధాలా అనుకూలిస్తుంది. ఆర్థికంగా లాభదాయకంగా ఉంది. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. కోర్టు కేసులో నెగ్గుతారు.

    కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1, 2)
    ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో ఆశించిన లాభాలుంటాయి. కొత్త నిర్ణయాలు, ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. తల పెట్టిన పనులు పూర్తవుతాయి.

    మీ బ్యాంక్‌ బ్యాలన్స్‌ పెరగాలంటే.. ఈ ఒక్క పని చాలు!

    తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
    ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. శ్రమ ఫలించి పనులు కొన్ని పూర్తవుతాయి. సన్నిహితులతో సహకారంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు గడించే అవకాశం ఉంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవసరాలకు సరిపడ డబ్బు అందుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

    వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
    అనుకోకుండా కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో శ్రమ పెరిగినా ఫలితం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. వివాహ ప్రయత్నాలకు అనుకూల సమయం. ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం పరవాలేదు.

    ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
    ఉద్యోగంలో అధికారుల వేధింపులుంటాయి. లక్ష్యాలు పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. ఇతరుల మీద ఆధారపడకుండా వృత్తి వ్యాపారాల్లో నిర్ణయాలు తీసుకోండి. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు అదుపు చేసుకోవాలి. కొందరికి మీ ద్వారా మేలు జరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

    Palmistry: అరచేతుల్లో ఈ రేఖ ఉంటే.. ప్రేమరేఖకు..!

    మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
    ముఖ్యమైన పనుల్లో విజయం వరిస్తుంది. ఆశించిన స్థాయిలో వ్యాపారంలో లాభాలుంటాయి. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. కీలకమైన కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. అవసరాలకు తగ్గట్టు డబ్బు అందుతుంది.

    కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
    ఉద్యోగపరంగా శుభ యోగం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. ఆర్థికంగా కోలుకుంటారు. అప్పుల బాధకు పరిష్కారం దొరుకుతుంది. ఇబ్బందుల్లో ఉన్న మిత్రుల్ని ఆదుకుంటారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. శ్రమ మీద కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు.

    మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
    తలచిన పనులు త్వరగానే పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికంగా కలిసి వస్తుంది. వాహన సౌఖ్యం ఉంది. బంధుమిత్రుల వల్ల లాభపడతారు. ఇప్పుడు మంచి పనులు తల పెడితే సత్ఫలితాలు ఇస్తాయి. ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండొద్దు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Astrology, Horoscope, Horoscope Today, Rashi fal, Rasi phalalu, Zodiac signs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు