Horoscope 18-8-2021: రాశి ఫలాలు.. వాహన సౌఖ్యం, ఓర్పు ముఖ్యం

Horoscope 18-8-2021: రాశి ఫలాలు

Horoscope today: రాశిఫలాలు మన రోజువారీ జీవితాలను రకరకాలుగా ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఇవాళ ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • Share this:
    Horoscope 18-8-2021: ప్రపంచం పరిస్థితి బాగోలేదు. ముఖ్యంగా ఇండియాలో ఎన్నో సమస్యలు. ఇలాంటి సమయంలో మనం ధైర్యాన్ని కోల్పోకూడదు. ఎన్ని ఆర్థిక కష్టాలు వచ్చినా పోరాడాలి. అదే జీవితం. ఐతే... అలా పోరాడేందుకు రాశిఫలాలు ఒకింత సాయం చేస్తాయి. రాశిఫలాలు మన భవిష్యత్తును ముందే చెబుతాయి. కొన్ని హెచ్చరికలు చేస్తాయి. అప్రమత్తంగా ఉండమంటాయి. అలాంటి హెచ్చరికలతో మనం అలర్ట్ అయ్యి... రాబోయే విపత్తును ఎదుర్కోవచ్చు. ఇందుకు జ్యోతిష పండితులు చెప్పే అంశాలను లెక్కలోకి తీసుకోవచ్చు. మరి తిథి, నక్షత్రం, గ్రహాలు, పంచాంగం వంటి వాటి ఆధారంగా నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

    మేష రాశి (Aries)
    ఈ రాశి వారు తలపెట్టిన పనులు వెంటనే పూర్తి అవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. వాహన సౌఖ్యం ఉంది. బంధుమిత్రుల కారణంగా లాభపడతారు. ఇప్పుడు అనుకున్న మంచి పనులు తల పెడితే సత్పలి తాలు ఇస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండొద్దు.

    వృషభ రాశి (Taurus)
    ఈ రాశి వారికి ఉద్యోగంలో బాగా శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. ఓర్పుతో వ్యవహరిస్తే మంచే జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఎవరినీ పూర్తిగా నమ్మవద్దు. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యుల సలహాలు కూడా పాటించండి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది.

    మిథున రాశి (Gemini)
    ఈ రాశి వారికి ముఖ్యమైన పనుల్లో విజయం వరిస్తుంది. వ్యాపారంలో ఊహించని లాభాలుంటాయి. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదు. అదనపు బాధ్యతలు మీద పడతాయి. ఒక కీలకమైన కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. అవసరాలకు తగ్గట్టు డబ్బు అందుతుంది.

    ఇది కూడా చదవండి: Zodiac Sign: ఏ రాశి వారికి ఏ కలర్ డ్రెస్ మేలు? ఏ కలర్ వాడకూడదు?

    కర్కాటక రాశి (Cancer)
    ఈ రాశి వారికి ఉద్యోగపరంగా శుభ యోగం ఉంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఆర్థికంగా కోలుకుంటారు. అప్పుల బాధకు పరిష్కారం దొరుకుతుంది. ఇబ్బందుల్లో ఉన్న మిత్రుల్ని ఆదుకుంటారు. ఇంటా బయటా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు.

    సింహ రాశి (Leo)
    ఈ రాశి వారికి అనుకోకుండా కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో శ్రమ పెరిగినా ఫలితం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. వివాహ ప్రయత్నాలకు అనుకూల సమయం. ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం పరవాలేదు.

    కన్య రాశి (Virgo)
    ఈ రాశి వారు ఉద్యోగంలో అధికారుల నుంచి ఇబ్బందులెదురైనా అంతిమంగా విజయం మీదే అవుతుంది. ఇతరుల మీద ఆధారపడకుండా వృత్తి వ్యాపారాల్లో నిర్ణయాలు తీసుకోండి. ఆదాయం చాలావరకు నిలకడగా ఉంటుంది. ఖర్చులు అదుపు చేసుకోవాలి. కొందరికి మీ ద్వారా ఆర్థికంగా మేలు జరుగుతుంది. ఆ రోగ్యం జాగ్రత్త.

    తుల రాశి (Libra)
    ఈ రాశి వారికి ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో లాభాలుంటాయి. కొత్త నిర్ణయాలు, ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. తల పెట్టిన పనులు చాలావరకు పూర్తవుతాయి.

    వృశ్చిక రాశి (Scorpio)
    ఈ రాశి వారికి ధన లాభం ఉంది. మీ శ్రమ ఫలించి పనులు కొన్ని పూర్తవుతాయి. సన్నిహితులను సంప్రదిస్తే వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడించే అవకాశం ఉంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవసరాలకు డబ్బు అందుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

    ధనస్సు రాశి (Sagittarius)
    ఈ రాశి వారికి ఉద్యోగంలో మంచి స్థితి కనిపిస్తోంది. ఉత్తమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. కుటుంబ పెద్దల సహకారం ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. వాదనలకు దూరంగా ఉండండి. శ్రమ మీద కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం పరవాలేదు. బాగా విశ్రాంతి అవసరం.

    ఇది కూడా చదవండి: Vastu tips: సంపదను పెంచే చేప!.. ఇంట్లో ఆ దిశలో ఉంచండి!

    మకర రాశి (Capricorn)
    ఈ రాశి వారికి ఉద్యోగపరంగా అంతా అనుకూలంగానే ఉంటుంది. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. ఆర్థికంగా లాభదాయకంగా ఉంది. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసులు నెగ్గుతారు.

    కుంభ రాశి (Aquarius)
    ఈ రాశి వారు ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. మిత్రుల సహకారంతో ఒక ముఖ్యమైన పని పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ధన లాభం ఉన్నా ఖర్చులు కూడా ఇబ్బ డిముబ్బడిగా పెరుగుతాయి. మంచి కాలం నడుస్తోంది. సద్వినియోగం చేసుకోండి. కుటుంబం ద్వారా లబ్ధి పొందుతారు.

    మీన రాశి (Pisces)
    ఈ రాశి వారు పట్టుదలగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో కూడా సంప్రదించండి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తోంది. ఉద్యోగంలో శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.
    Published by:Krishna Kumar N
    First published: