Home /News /astrology /

HOROSCOPE TODAY ON 17TH DECEMBER 2021 HERE TELUGU ASTROLOGY RASHIFAL RASI PHALALU FOR ALL 12 ZODIAC SIGNS SK

Horoscope Today: డిసెంబరు 17 రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి చేతి నిండా పని.. అన్నీ శుభాలే

రాశి ఫలాలు

రాశి ఫలాలు

Today Horoscope: నేడు శుక్రవారం. ఇవాళ పలు రాశుల వారు శుభవార్తలు వింటారు. అనుకున్నవన్నీ జరుగుతాయి. కొందరికి మాత్రం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మరి ఇవాళ మేషం నుంచి మీనం వరకు.. ఇవాళ ఎవరికి ఎలా ఉందో తెలుసుకుందాం.

  కాలజ్ఞానం

  డిసెంబరు 17, 2021

  దిన ఫలాలు

  మేషం (Aries)(అశ్విని, భరణి, కృత్తిక 1) గ్రహ స్థితి బాగా అనుకూలంగా ఉంది. కొన్ని కోరికలు నెరవేరుతాయి. అదృష్ట యోగం ఉంది. ఉద్యో గంలో ఉత్తమ స్థితి కనిపిస్తోంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటు ఉండదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

  వృషభం (Taurus)(కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఉద్యోగంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. శుభవార్తలు వింటారు. ఇంటా బయటా శ్రమ పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు బాగుంది. ఆరో గ్యం జాగ్రత్త.

  మిథునం (Gemini)(మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఆర్థిక, రాజకీయ రంగాలవారికి బాగుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. భాగస్వాములతో విభేదాలు పరిష్కారం అవుతాయి. రుణాలు తీరుస్తారు. ఉద్యోగంలోను, వ్యాపారంలోను మంచి అభివృద్ధి కనిపిస్తోంది. ఒక క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరో గ్యం జాగ్రత్త.

  Zodiac Signs: ఈ రాశుల వాళ్లు ప్రియమైన వారితో విడిపోతే ఏం జరుగుతుందో తెలుసా ?

  కర్కాటకం (Cancer)(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఈ రోజు మీకంతా మంచే జరుగుతుంది. ఇంటా బయటా సానుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్త వింటారు. కుటుంబ సభ్యుల సలహాలు పట్టించుకోండి.

  సింహం (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1) గట్టి పట్టుదలతో అనుకున్నవి సాధిస్తారు. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారంలో శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. బంధువుల రాకపోకలుంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

  కన్య (Virgo)(ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ప్రస్తుతం సమయం కాస్తంత బాగానే ఉంది. ఉద్యోగంలో శ్రమకు, ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. పెళ్లి కుదిరే అవకాశం ఉంది. అనుకున్న పనులు చాలావరకు పూర్తవుతాయి. ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. బంధుమిత్రుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆరోగ్యం పరవాలేదు.

  ఈ రాశుల జంటలు ఎప్పటికీ విడిపోవు.. మీ జంట కూడా ఇదేనా?

  తుల (Libra)(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఉద్యోగంలో శ్రమ ఎక్కువగా ఉన్నా మేలు జరుగుతుంది. ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణ సూచనలున్నాయి. కొన్ని కష్టాల నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాల వారికి చేతి నిండా పని ఉంటుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది.

  వృశ్చికం (Scorpio)(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) మానసికంగా, శారీరకంగా ఒత్తిడి ఉన్నా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ముఖ్యంగా కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాలపరంగా లాభాలున్నాయి. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతానానికి సంబంధించి శుభ వార్తలు వింటారు. ఉద్యోగంలో అనుకూల సమాచారం అందుతుంది.

  ధనస్సు (Sagittarius)(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ముఖ్యమైన పనుల్లో కొన్నిటిని శ్రమ మీద పూర్తి చేస్తారు. పరిస్థితులు వ్యతిరేకంగా కనిపించినా పట్టుదలగా ముందడుగు వేయండి. పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. సన్నిహితుల సూచనలు కూడా అవసరం అని గ్రహించండి. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం వస్తుంది. ఆరో గ్యం పరవాలేదు.

  ఈ ఏడాది శుభకార్యాలు లేనట్టే.. 2022లో అత్యధిక వివాహముహూర్తాలు ఈ నెలలోనే

  మకరం (Capricorn)(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) ఆర్థిక పరిస్థితి అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగానికి సంబంధించి మంచి కబురు తెలుస్తుంది. తెలిసినవారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. వ్యాపారంలో బాగా ఒత్తిడి ఉన్నా ఫలితం ఉంటుంది. మిత్రులకు సహాయం చేస్తారు.

  కుంభం (Aquarius)(ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగినా ఇబ్బందేమీ ఉండదు. ముఖ్యమైన పనుల్లో త్వరితగతిన విజయాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారులు విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థిక లావాదేవీలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. ఎవరికీ హామీలు ఉండొద్దు.

  Palmistry: అరచేతుల్లో ఈ గీతలు ఉన్నవారికి.. ఎంతో కలిసివస్తుందట..

  మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4) ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలుంటాయి. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆర్థిక లావాదే వీలకు దూరంగా ఉండండి. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం పరవాలేదు. పెళ్లి ప్రయత్నా లు ఫలిస్తాయి.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Astrology, Horoscope, Rashifal, Rasi phalalu, Zodiac sign

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు