Horoscope today: ఈ సంవత్సరం ఎక్కువ మందికి రాశి ఫలాలు కలిసొస్తాయని పండితులు తెలిపారు. గ్రహాల గమన పరిస్థితులతో ప్రతి రోజు రాశిఫలాలు మారిపోతూ ఉంటాయి. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు చాలా మందికి ఆందోళన కలిగిస్తున్నాయి. మరి వాటికి సంబంధించి జ్యోతిష పండితులు తిథి, నక్షత్రం, పంచాంగం, గ్రహాలు, సూర్యుడు, ఘడియలు అన్నీ పరిశీలించి... 14-4-2021 నాడు ఏయే సూచనలు చేస్తున్నారో చూద్దాం. తద్వారా ఏవైనా అనుకోని ప్రమాదకర సంఘటనలు జరిగేలా ఉంటే ముందుగానే జాగ్రత్త పడవచ్చు.
మేష రాశి (Aries)
ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం బాగుంటుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఆలయాలను సందర్శిస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
వృషభ రాశి (Taurus)
ఉద్యోగానికి ఆఫర్ అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఎంతో శ్రమ మీద పనులు పూర్తి చేసుకుంటారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి అన్నివిధాలా బాగుంది. ప్రేమ వ్యవహారంలో ముందుకు దూసుకుపోతారు.
మిథున రాశి (Gemini)
ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. కొంతవరకు శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఆదాయంలో పెరుగుదల ఏమీ ఉండదు కానీ ఖర్చులు మాత్రం పెరుగుతాయి. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. ఆరోగ్యం జాగ్రత్త. స్నేహితులు ముఖం చాటేయవచ్చు.
కర్కాటక రాశి (Cancer)
ఉద్యోగంలో ప్రమోషన్‌ను ఆశించవచ్చు. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. తలచిన పనులు నెరవేరుతాయి. కోర్టు కేసుల్లో నెగ్గుతారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. శుభవార్త వింటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
సింహ రాశి (Leo)
తలపెట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయం పరవాలేదు. కానీ, ఖర్చులు బాగా పెరుగుతాయి. సంతానం నుంచి శుభవార్త వింటారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులకు చాలా బాగుంది. ప్రేమ వ్యవహారాలు పరవాలేదు.
కన్య రాశి (Virgo)
ఆదాయం నిలకడగానే ఉంటుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఇరుగు పొరుగుతో విందులో పాల్గొంటారు. వ్యాపారులకు, ఐ.టి నిపుణులకు అన్ని విధాలా అనుకూలమైన సమయం. పెళ్లి సంబంధం కుదురుతుంది. కామర్స్ విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
తుల రాశి (Libra)
ఉద్యోగరీత్యా స్థాన చలనానికి అవకాశం ఉంది. అనుకోకుండా ఆదాయం కలిసి వస్తుంది. వివాహ ప్రయత్నాలకు అనుకూల సమయం. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. కొత్త స్నేహితులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధువు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు.
వృశ్చిక రాశి (Scorpio)
పలుకుబడి పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. డబ్బు ఇవ్వాల్సిన వాళ్లు వాయిదా వేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. తగాదాలకు దూరంగా ఉండండి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త.
ధనస్సు రాశి (Sagittarius)
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయపరంగా సంతృప్తికరంగా ఉంటుంది. కొన్ని పనులు ఆలస్యం అవుతాయి. రాజకీయ, సామాజిక రంగంలోని వారికి సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులకు బాగుంది. స్నేహితురాలితో కాలక్షేపం చేస్తారు.
మకర రాశి (Capricorn)
ఉద్యోగపరంగా బాగానే ఉంటుంది. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉండవు కానీ, ఖర్చులు అదుపు తప్పుతాయి. పని ఒత్తిడి పెరుగుతుంది. పిల్లల్లో చదువు పట్ల శ్రద్ధ కనిపిస్తుంది. సన్నిహితులు అపార్థాలు చేసుకుంటారు. స్నేహితురాలి విషయంలో ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.
కుంభ రాశి (Aquarius)
ఉద్యోగంలో మార్పు జరగవచ్చు. పెళ్లికి సంబంధించి శుభవార్త వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం పరవాలేదు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ధనలాభ సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.
ఇది కూడా చదవండి: Business Idea: వ్యాపార ఐడియా.. రూ.2లక్షల పెట్టుబడితో ఏడాదికి రూ.6 లక్షల ఆదాయం
మీన రాశి (Pisces)
ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ఆదాయంలో మార్పేమీ ఉండదు. ఊహించని ఖర్చులు మీద పడతాయి. వృత్తి ఉద్యోగ, వ్యాపారాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. రియల్ ఎస్టేట్
రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. స్నేహితురాలితో షికార్లు చేస్తారు.