Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు జాగ్రత్త.. రోడ్డు ప్రమాదం జరిగే అవకాశం

ప్రతీకాత్మక చిత్రం

Today Horoscope: నేడు బుధవారం ( అక్టోబర్ 13).. ఇవాళ పలు రాశుల వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. మరి మేషం నుంచి మీన రాశి వరకు.. ఇవాళ ఎవరికి ఎలా ఉందో తెలుసుకుందాం..

  • Share this:
    కాలజ్ఞానం

    అక్టోబరు 13, 2021

    దిన ఫలాలు

    మేషం (Aries): (అశ్విని, భరణి, కృత్తిక 1).
    ఆర్థిక పరంగా అదృష్టం పడుతుంది. ముఖ్యమైన పనులు చకచకా పూర్తవుతాయి. గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. సకాలంలో లక్ష్యాలు పూర్తి చేసి అభినందనలు అందు కుంటారు. వ్యాపార లాభం ఉంది. మనసులోని కోరిక నెరవేరుతుంది. గతంలో మీ మీద పడ్డ నిందలు తొలగుతాయి.

    వృషభం (Taurus): (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
    ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఇతరులకు సహాయపడడం వంటి మంచి పనులు చేస్తారు. మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక స్థితి ఆశా జనకంగా ఉంటుంది. స్నేహితులు అండగా ఉంటారు. కుటుంబ సభ్యులతో వీలైనంత సామరస్యంగా వ్యవహరించండి

    మిథునం (Gemini): (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
    ముఖ్యమైన పనుల్ని వాయిదా వేయకుండా పూర్తి చేస్తారు. ఇంటా బయటా శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. ధన లాభానికి అవకాశం ఉంది. అపార్థాలకు తావివ్వకుండా ఓర్పుతో సంభాషించడం మంచిది. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి.

    Navaratri 2021: దుర్గాష్టమి విశిష్టత.. కన్యాపూజ సమయం!

    కర్కాటకం (cancer): (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
    మంచి నిర్ణయంతో ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. సమయం అనుకూలంగా ఉంది. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగంలో ఒక మెట్టు పైకెక్కే అవకాశం ఉంది. కొత్తవారి పరిచయాలు లాభాలనిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం దొరుకుతుంది.

    సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1)
    మంచి కాలం నడుస్తోంది. ఉద్యోగ, వ్యాపారాల్లో చక్కని విజయాలు సాధిస్తారు. ఉద్యోగ సంబంధంగా -మంచి అవకాశాలు అందివస్తాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. పది మందికి మేలు జరిగే పను లు తలపెడతారు. చిన్న చిన్న సమస్యలకు, అవరోధాలకు ఆందోళన చెందవద్దు. మీకు అంతా మంచే జరుగుతుంది.

    కన్య (Virgo): (ఉత్తర 2,3,4, హస్త, చిత్త1,2)
    ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు బాధిస్తాయి. అయితే, శుభ ఫలితాలు కూడా ఉన్నాయి. ఉద్యోగ, . వ్యాపారాల్లో కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. కొత్త ప్రయత్నాలకు వెనుకాడవద్దు. తోటివారి సహా యంతో ముందుకు వెళతారు. కుటుంబంతో కలిసి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. కొద్దిగా ఓర్పు అవసరం.

    Dussehra 2021: దసరా ఉత్సవాలు ప్రతీష్టాత్మకంగా జరిగేది ఇక్కడే!

    తుల (Libra): (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
    సన్నిహితులు, మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో సహచరుల అండదండలు లభిస్తాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుం ది. మొత్తం మీద అన్ని శుభవార్తలే వింటారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    వృశ్చికం (Scorpio ) : (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
    ఉద్యోగ, వ్యాపారాల్లో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా వ్యాపారంలో నష్టం రాకుండా చూసుకోవాలి. డబ్బు మోసపోయే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదానికి అవకాశం ఉంది. అంతరంగిక విషయాలు ఇతరులతో చర్చించడం మంచిది కాదు. కుటుంబ సభ్యులకు చెప్పి చేసే పనులు మంచి ఫలితాలనిస్తాయి.

    ధనుస్సు( Sagittarius ): (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
    శ్రమ, తిప్పలు ఉన్నా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో విశేషమైన ఫలితాలు అనుభవానికి వస్తాయి. వ్యాపార లాభం ఉంది. స్వల్ప ప్రయత్నంలో మంచి విజయాలు సాధిస్తారు. సానుకూల దృక్ఫథంతో వ్యవహరించండి. చెడు ఊహించవద్దు. ఒక గడ్డు సమస్య నుంచి బయటపడతారు. ఎవరికి హామీలు ఉండవద్దు.

    Marriage: ఈ మూడు రాశుల్లో ఏ రాశి అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అదృష్టవంతులు మీరే..!

    మకరం (Capricorn): (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1, 2)
    ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో ఆ దాయం పెరుగుతుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారంలో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతుంది. మనసులోని కోరిక నెరవేరుతుంది.

    కుంభం (Aquarius): (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
    గ్రహ సంచారం ఏమంత అనుకూలంగా లేదు. ఇంటా బయటా అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగి ఇబ్బంది పడతారు. కొందరు ఆత్మీయుల వల్ల మనశ్శాంతి ఏర్పడుతుంది. మిత్రుల సలహాలతో వ్యక్తిగత సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులకు కళ్లెం వేయాలి.

    నవరాత్రుల్లో ముఖ్యమైన 9 రంగులు.. వాటి ప్రాముఖ్యత!

    మీనం (Pisces): (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
    ఉద్యోగ పరంగా కష్టపడాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల సహకారంతో మంచి ఫలితాలు అనుభవానికి వస్తుంది. గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా పెరుగుతాయి. ఒక ముఖ్యమైన కుటుంబ సమస్య పరిష్కారం అవుతుంది.
    Published by:Shiva Kumar Addula
    First published: