Home /News /astrology /

HOROSCOPE TODAY ON 13TH NOVEMBER HERE IS TELUGU ASTROLOGY RASI PHALALU RASHIFAL TODAY THESE ZODIAC SIGNS SK

Horoscope Today: నవంబరు 13 దిన ఫలాలు.. ఈ రాశుల వారి వ్యాపారాల్లో ఊహించని లాభాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Horoscope today: నేడు శనివారం. ఇవాళ ఏ రాశి వారికి ఎలా ఉంది? గ్రహాలు, నక్షత్రం, తిథి ఆధారంగా జ్యోతిష పండితుల అంచనాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు సూచిస్తున్నారు? మేషం నుంచి మీనం వరకు దిన ఫలాలను ఇక్కడ తెలుసుకుందాం.

  కాలజ్ఞానం

  నవంబరు 13, 2021

  దినఫలాలు

  మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థికంగా మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. శుభవార్తలు వింటారు. కొన్ని విజయవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. బంధుమిత్రుల ద్వారా మంచి మేలు జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.

  వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం చేతికి వస్తుంది. అధిక ధన లాభం ఉంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులకు వీలైనంతగా సహాయపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్ర దర్శనం ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి.

  మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలు రాకుండా జాగ్రత్తలు పాటించాలి. ఆటంకాలు ఎదురైనా చాలావరకు పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యలు నిరుత్సాహం కలిగించవచ్చు. తోటివారి సహకారంతో కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం జాగ్రత్త.

  Vastu Tips: మట్టితో చేసిన ఈ వస్తువులు.. ఇంటికి చాలా లక్కీ!

  కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగానే ఉన్నాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. పట్టుదలగా పనులు పూర్తి చేసుకుంటారు. సంతానపరంగా అనుకూలమైన కాలం నడుస్తోంది. బంధువులు కొందరు అపనిందలు వేసి ఇబ్బంది పెడతారు. ఆరోగ్యానికి ఢోకా లేదు.

  సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) ఇంటా బయటా సమస్యలున్నా ఉద్యోగంలో లక్ష్యాలు పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. గతంలో ఆగిపోయిన పనుల్ని ఇప్పుడు పూర్తి చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఎదుగుదలకు వీలైన సమయం ఇది. ఇప్పుడు తల పెట్టిన పనులు విజయాన్నిస్తాయి.

  కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1, 2) ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని లాభాలు ఉంటాయి. ప్రస్తుతం అన్నివిధాలా మంచి కాలం నడుస్తోంది. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. సంతానం గురించి శుభవార్తలు వింటారు. ఒక ముఖ్యమైన పనిని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

  వాస్తు ప్రకారం ఇలాంటి మొక్క మీ ఇంట్లో ఉంటే.. అరిష్టమే!

  తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) వృత్తి, వ్యాపారాల్లో లాభాలుంటాయి. అవసరాలకు ధన సహాయం అందుతుంది. ఉద్యోగం ప్రశాంతంగా గడిచిపోతుంది. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. కొన్ని వ్యక్తిగత వ్యవహారాలు, సమస్యల్లో మిత్రుల సలహాలు కూడా తీసుకోండి. శుభవార్త వింటారు.

  వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ) వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలున్నాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. తల పెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. సమస్యలు ఎదురవుతున్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి. మీ కోరిక నెరవేరుతుంది. సొంత నిర్ణయాలతో పాటు కుటుంబ సభ్యుల సలహాలు కూడా తీసుకోవడం మంచిది.

  రాశిచక్రం ప్రకారం ఆ రాశి వాళ్లు వివాహేతర సంబంధాలకు ఆకర్షితులయ్యే అవకాశం ఎక్కువట..!

  ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంతా అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం మంచి కాలం నడుస్తోంది. తల పెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. సంకల్ప బలం బాగానే ఉంది. బంధుమిత్రులతో అపార్థాలకు అవకాశం లేకుండా వ్యవహరించండి. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

  మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం,ధనిష్ఠ 1,2) బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ, కుటుంబపరంగా సమస్యలు ఎదురవుతుంటాయి. ఓపికతో వ్యవహరించి వీటిని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. పాజిటివ్‌గా ఉండండి. అభివృద్ధి పైనే దృష్టి నిలపండి. అంతా మీరు అశించిన విధంగానే జరుగుతుంది. తలచిన పనులు చాలావరకు నెరవేరుతాయి.

  కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతికి కాలం అనుకూలంగా ఉంది. కొన్ని ఇష్ట కార్యాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులకు బాగా సహాయం చేస్తారు. ఆదాయానికి సంబంధించి ఒక ముఖ్యమైన పని మీకు అనుకూలంగా నెరవేరుతుంది. గృహ లాభం, వాహన యోగం ఉన్నాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

  ఈ ఒక్క వస్తువు మీ ఇంట్లో ఉంటే.. సిరిసంపదలు డబుల్‌ అవుతాయి!

  మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ఉద్యోగంలో గుర్తింపు, ప్రోత్సాహం ఉంటాయి. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. సొంత నిర్ణయాలు, స్వయం కృషి సత్ఫలితాలను ఇస్తాయి. ఆర్థికంగా అనుకూలమైన కాలం నడుస్తోంది. ఇప్పుడు తల పెట్టిన పనుల్లో అధిక లాభం ఉంటుంది. ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం పరవాలేదు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Astrology, Horoscope, Horoscope Today, Rashifal, Rasi phalalu, Zodiac signs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు