• HOME
  • »
  • NEWS
  • »
  • ASTROLOGY
  • »
  • HOROSCOPE TODAY ON 13 4 2021 ON UGADI FESTIVAL DAY THESE ZODIAC SIGNS PEOPLE HAVE GOOD NEWS CHECK YOUR RASI PHALALU TODAY NK

Horoscope today: నేటి రాశి ఫలాలు... ఏ రాశి వారికి ఎలాంటి ఫలాలు ఉన్నాయంటే...

Horoscope today: నేటి రాశి ఫలాలు... ఏ రాశి వారికి ఎలాంటి ఫలాలు ఉన్నాయంటే...

Horoscope today: నేటి రాశి ఫలాలు

Horoscope today 13-4-2021: ఉగాది వచ్చేసింది. మరి ఈ కొత్త ప్లవ నామ సంవత్సరంలో తొలిరోజైన ఇవాళ రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • Share this:
    Horoscope today: ఈ సంవత్సరం ఉగాదిలో ఉత్సాహం లేకుండా పోయింది. దేశ ఆర్థిక పరిస్థితులు బాలేవు. పేదవాళ్లు మరింత పేదరికంలోకి జారుకుంటున్నారు. అయినా సరే భవిష్యత్తును పాజిటివ్‌గా చూడాలి. పైగా ప్లవ నామ సంవత్సరం... కష్టాలను తొలగిస్తుందని అర్థం కాబట్టి... ఈ సంవత్సరం మనకు కలిసి రావాలని కోరుకుందాం. ఆ సందర్భంగా... ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులకు సంబంధించి జ్యోతిష పండితులు తిథి, నక్షత్రం, పంచాంగం, గ్రహాలు, సూర్యుడు, ఘడియలు అన్నీ పరిశీలించి... 13-4-2021 నాడు ఏయే సూచనలు చేస్తున్నారో చూద్దాం.

    మేష రాశి (Aries)
    తలచిన పనులు వెంటనే పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. వాహన సౌఖ్యం ఉంది. బంధుమిత్రుల వల్ల లాభపడతారు. ఇప్పుడు మంచి పనులు తలపెడితే సత్ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండొద్దు.

    వృషభ రాశి (Taurus)
    ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ఓర్పుతో వ్యవహరిస్తే మంచే జరుగుతుంది. ఎవరి విమర్శలూ పట్టించుకోవద్దు. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యుల సహాయం కూడా తీసుకోండి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యానికి ఢోకా లేదు.

    మిథున రాశి (Gemini)
    ఆర్థికంగా కోలుకుంటారు. అప్పుల బాధలకు పరిష్కారం దొరుకుతుంది. ఇబ్బందుల్లో ఉన్న బంధువులను ఆదుకుంటారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా శుభయోగం ఉంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు.

    కర్కాటక రాశి (Cancer)
    ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మున్ముందు సత్ఫలితాలను ఇస్తాయి. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. అదృష్ట యోగం పట్టబోతోంది. అవసరాలకు తగ్గట్టుగా డబ్బు చేతికి అందుతుంది. తలపెట్టిన పనులు క్రమంగా పూర్తవుతాయి.

    సింహ రాశి (Leo)
    ఉద్యోగపరంగా ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో మరింతగా శ్రద్ధ పెంచాలి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు అదుపు చేసుకోవాలి. కొందరికి మీ ద్వారా మేలు జరుగుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త.

    కన్య రాశి (Virgo)
    ఉద్యోగంలో చక్కని ఫలితాలు సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో కొత్త నిర్ణయాు తీసుకుంటారు. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. వివాహ ప్రయత్నాలకు అనుకూల సమయం. ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యుల సలహాలు కూడా పాటించండి. ఆరోగ్యం పరవాలేదు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    తుల రాశి (Libra)
    ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు గడించే అవకాశం ఉంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవసరాలకు డబ్బు అందుతుంది. కుటుంబ సమస్య పరిష్కారమవుతుంది. సొంత నిర్ణయాలతో ధైర్యంగా ముందడుగు వేయండి. ఆరోగ్యం జాగ్రత్త.

    వృశ్చిక రాశి (Scorpio)
    ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణ లాభం ఉంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులు శుభవార్త
    వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి.

    ధనస్సు రాశి (Sagittarius)
    ఉద్యోగంలో అభివృద్ధి ఉంది. ఆర్థికంగా లాభదాయకంగా ఉంది. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభవార్త వింటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. కోర్టు కేసులో నెగ్గుతారు. ఆకస్మిక ప్రయాణాలు ఉన్నాయి.

    మకర రాశి (Capricorn)
    ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. వాదనకు దూరంగా ఉండండి. ఏలిన నాటి శని కారణంగా తరచూ అనారోగ్యాలు తప్పకపోవచ్చు. కొంతవరకు శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం పరవాలేదు. మీకు విశ్రాంతి అవసరం.

    కుంభ రాశి (Aquarius)
    ఉద్యోగంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ధనలాభం ఉన్నా ఖర్చులు కూడా పెరుగుతాయి. తిప్పుట ఎక్కువగా ఉంటుంది. తలచిన పనులు పూర్తవుతాయి. కుటుంబం ద్వారా లబ్ధి పొందుతారు.

    ఇది కూడా చదవండి: Banana in Fridge: అరటిపండును ఫ్రిజ్‌లో ఎందుకు పెట్టకూడదు? అది తింటే ఏమవుతుంది?

    మీన రాశి (Pisces)
    వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తోంది. ఉద్యోగంలో శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఇంటి సమస్యల పరిష్కారంలో సొంత నిర్ణయాలతో పాటు కుటుంబ సభ్యుల సలహాలు కూడా తీసుకోండి. ఆరోగ్యం పరవాలేదు. ఆదాయం నిలకడగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు