Home /News /astrology /

HOROSCOPE TODAY ON 12TH NOVEMBER 2021 HERE IS TELUGU ASTROLOGY RASI PHALALU RASHIFAL HERE IS ALL 12 ZODIAC SIGNS DETAILS SK

Horoscope today: నవంబరు 12 దిన ఫలాలు.. ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంది.. అన్నీ శుభాలే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Horoscope today: నేడు శుక్రవారం. ఇవాళ ఏ రాశి వారికి ఎలా ఉంది? గ్రహాలు, నక్షత్రం, తిథి ఆధారంగా జ్యోతిష పండితుల అంచనాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు సూచిస్తున్నారు. మేషం నుంచి మీనం వరకు దిన ఫలాలను ఇక్కడ తెలుసుకుందాం.

  కాలజ్ఞానం

  నవంబరు 12, 2021

  దినఫలాలు

  మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఒక క్లిష్టమైన కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. గృహ ప్రయత్నాలు సఫలమవుతాయి. మనసులో ఉన్న ఓ ఆశయం నెరవేరుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అదృష్టం పట్టే అవకాశం ఉంది.

  వృషభం (కృత్తిక 2,3,4,రోహిణి, మృగశిర 1,2) ముఖ్యమైన పనులను పూర్తి చేయడం మీద శ్రద్ధ పెంచాలి. గ్రహబలం తక్కువగా ఉంది. ఉద్యోగంలో నిలకడ ఉంది. కొన్ని కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. భవిష్యత్తుకు సంబంధించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆదాయం పరవాలేదు. అనవసర ఖర్చులకు కళ్లెం వేయాలి. ఎవరికీ హామీలు ఉండవద్దు.

  మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఉద్యోగ, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఇష్టమైన వ్యక్తుల్ని కలుస్తారు. శ్రమ మీద పనులు పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కొందరికి మీ వల్ల ఆర్థికంగా మేలు జరుగుతుంది. నచ్చినవారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. అనుకోకుండా ధనం కలిసి వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త.

  Zodiac Signs: ఈ రాశుల వారితో జర జాగ్రత్త.. మీ సీక్రెట్స్ అన్నీ చెప్పేస్తారు..

  కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అన్నివిధాలా మంచి సమయం నడుస్తోంది. నిరుద్యోగులకు సొంత ఊర్లో మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగ రీత్యా ప్రమోషన్ కు అవకాశం ఉంది. వ్యాపార సంబంధమైన పనుల్లో ఇతరుల మీద ఆధారపడకుండా ముందుకు వెడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

  సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) ఉద్యోగపరంగా ఒత్తిడి ఉంటుంది. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. శ్రమ మీద కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల అండదండలు లభిస్తాయి. పలుకుబడి గలవారితో పరిచయాలు ఏర్పడతాయి.

  కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఉద్యోగంలో చాలావరకు అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఆశించిన స్థాయిలో గ్రహ బలం లేనప్పటికీ ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. లోతుగా ఆలోచించి, కుటుంబ సభ్యుల్ని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. ఇతరుల మాటలు ఏమాత్రం పట్టించుకోవద్దు.

  అతిపెద్ద చంద్రగ్రహణం 2021 ఎప్పుడు ఏర్పడుతుందంటే ..!

  తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ప్రస్తుతం సమయం అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థికంగా పరవాలేదు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. ఉద్యోగంలో శ్రమ పెరిగినా మంచి జరుగుతుంది.

  వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ) ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. కుటుంబపరంగా చికాకులు ఉంటాయి. మంచి ఆలోచనలను ఆచరణలో పెట్టండి. ఉద్యోగ సంబంధమైన ఒక కీలక సమస్యను సహోద్యోగుల సహాయంతో పరిష్కరించుకుంటారు. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా సమయం బాగానే ఉంది. శరీరానికి విశ్రాంతి అవసరం.

  ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఉద్యోగంలో పురోగతి కనిపిస్తోంది. ఆదాయానికి సంబంధించి ఒక శుభవార్త వింటారు. అనుకున్న పనులు తేలికగా నెరవేరుతాయి. మంచి అవకాశాలు అందివస్తాయి. అదృష్ట యోగం ఉంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సమస్యల పరిష్కారానికి సొంత నిర్ణయాలు మంచివి. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది.

  దేవుడి ఫొటోతో సహా ఈ 4 వస్తువులను పర్సులో అస్సలు పెట్టుకోవద్దు.. అవేంటంటే..

  మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. అనుకున్న పనుల్ని ఎంతో శ్రమ మీద పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యల పరిష్కారంలో సొంత నిర్ణయాలతో పాటు, సన్నిహితుల సలహాలు కూడా తీసుకోండి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ, అనవసర ఖర్చుల్ని అదుపు చేసుకోవాలి. ఆశయ సాధనకు బాగా కృషి చేస్తారు.

  కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి, అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. గృహ సౌఖ్యం ఉంది. వాహన యోగం కనిపిస్తోంది. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది.

  మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) వ్యాపారపరంగా లాభముంటుంది. ఉద్యోగంలో ప్రశంసలు, ప్రోత్సాహం ఉంటాయి. అయితే, ఒత్తిడి, శ్రమ ఉంటాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బంధువుల్లో కొందరు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. స్నేహితుల సహాయ సహకారాలు ఉంటాయి.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Astrology, Horoscope, Horoscope Today, Rashi fal, Rasi phalalu, Zodiac sign

  తదుపరి వార్తలు