• HOME
  • »
  • NEWS
  • »
  • ASTROLOGY
  • »
  • HOROSCOPE TODAY ON 12 4 2021 THESE ZODIAC SIGNS MAY BUY SOME NEW LANDS OR PROPERTIES CHECK YOUR RASI PHALALU TODAY HERE NK

Horoscope today 12-4-2021: రాశి ఫలాలు... ఈ రాశుల వారు ఆస్తులు కొంటారు

Horoscope today 12-4-2021: రాశి ఫలాలు... ఈ రాశుల వారు ఆస్తులు కొంటారు

Horoscope today 12-4-2021: రాశి ఫలాలు

Horoscope today 12-4-2021: ఇవాళ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి... ఎవరికి బాగా కలిసొస్తుంది? జ్యోతిష పండితులు అన్ని అంశాలపై ఏం సూచిస్తున్నారో తెలుసుకుందాం.

  • Share this:
    Horoscope today: ఇండియాలో నానాటికీ కరోనా వైరస్ కేసులు పెరుగుతుంటే... ఆర్థిక సమస్యలు ఎక్కువవుతున్నాయి. ప్రజలు తమ ఖర్చులను తగ్గించుకొని... డబ్బు ఎలా ఆదా చెయ్యాలనే అంశంపై దృష్టి పెడుతున్నారు. అదే సమయంలో నిత్యవసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయి... డబ్బు సేవ్ చేసే పరిస్థితి లేకుండా పోతోంది. ఇలాంటి సమయంలో ఎవరి రాశిఫలాలు ఎలా ఉన్నాయి. ఏ రాశుల వారు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమ వ్యవహారాలు ఎలా ఉంటాయి. ఉద్యోగాల సంగతులేంటి... వంటి అంశాలపై జ్యోతిష పండితులు తిథి, నక్షత్రం, పంచాంగం, గ్రహాలు, సూర్యుడు, ఘడియలు అన్నీ పరిశీలించి... నేటి భవిష్యత్తు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. 12-4-2021 నాడు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

    మేష రాశి (Aries)
    ఆస్తుల కొనుగోలుకు ప్రయత్నిస్తారు. సొసైటీలో పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్య జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. పెండింగ్‌లో ఉన్న ఆర్థిక వ్యవహారాలు సెటిల్ అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు కాస్త నెమ్మదిగా సాగుతాయి.

    వృషభ రాశి (Taurus)
    ఉద్యోగాలు, వృత్తుల్లో పని ఒత్తిడి బాగా ఉంటుంది. చేసిన పని మళ్లీ చెయ్యాల్సి వస్తుంది. కుటుంబం కోసం వేసుకున్న ప్లాన్స్ అంతగా వర్కవుట్ కావు. అనుకున్నట్లుగా జరగవు. ప్రయాణాలకు అనుకూలం. పాత స్నేహితులను కలుస్తారు. మీకు సహాయం చేయాలనుకునేవారిని కలుస్తారు. ఈ అవకాశం మిస్సవకుండా చూసుకోవాలి. ఆరోగ్యపరంగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే. సరైన అంశాలపై పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. పెళ్లి కార్యక్రమాలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి.

    మిథున రాశి (Gemini)
    సంఘంలో గుర్తింపు మరింత పెరుగుతుంది. ఆరోగ్య పరంగా పాజిటివ్‌గా ఉండాలి. డబ్బు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి... కాకపోతే... మీరు ముందడుగు వెయ్యాల్సి ఉంటుంది. ఉద్యోగం మారే అవకాశం ఉంది. మరింత ఎక్కువ శాలరీ వచ్చే ఛాన్స్ ఉంది. మీ గోల్స్ పనిలో పడి... కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తారు. లాంగ్ జర్నీ కోసం మీకు ఓ ఆఫర్ వస్తుంది. ఆస్తి వ్యవహాలపై తెలివైన వారితో చర్చించడం ద్వారా ప్రయోజనాలు కలుగుతాయి. ప్రేమ వ్యవహారాలు కలిసివస్తాయి.

    కర్కాటక రాశి (Cancer)
    దూర ప్రయాణాలు చేసేందుకు అనుకూలమైన సమయం. సామాజిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చాలాకాలంగా ఉన్న ఓ సమస్యకు చెక్ పెడతారు. ఆర్థిక వ్యవహారాల్లో మరీ ఎక్కువ ఆశించకుండా తీసుకునే నిర్ణయాలు కలిసివస్తాయి. ఉద్యోగం, వృత్తుల వారు దేనిపై ఫోకస్ పెడతారో దాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. ఏదైనా కొత్త కార్యక్రమం చేయడానికి రెడీ అవుతారు. స్నేహం కాస్తా ప్రేమగా మారే అవకాశాలు ఉన్నాయి.

    సింహ రాశి (Leo)
    ఆర్థిక వ్యవహారాలు కలిసొచ్చే సమయం... సరైన నిర్ణయాలతో విజయం సాధిస్తారు. ఉద్యోగం, పని విషయాల్లో మాత్రం ఎక్కువ ఫలితాలు ఆశించకపోవడం మేలు. కుటుంబ సభ్యులతో గడపడం ద్వారా కాస్త రిలాక్స్ ఫీల్ అవుతారు. ప్రయాణాలు చేస్తే మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. విద్యార్థులు మరింత ఎక్కువగా చదువుపై ఫోకస్ పెట్టాల్సిన సమయం. చురుకుగా ఉంటే అన్ని విషయాల్లో కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు అనుకున్న విధంగా సత్ఫలితాలు ఇస్తాయి.

    కన్య రాశి (Virgo)
    సామాజిక పరంగా అన్ని విధాలా కలిసి వస్తుంది. కొత్త వారిని కలుస్తారు. మంచి సంభాషణ సాగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి సరైన సమయం. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయడానికి వీలవుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని ఉన్నా... ఒకింత సాధ్యం కాదు. రోడ్డుపై దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. శుభవార్త వింటారు.

    తుల రాశి (Libra)
    ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో మీరు వేసే లెక్కలు, తీసుకునే నిర్ణయాలు బాగా ఫలిస్తాయి. మీ లాజికల్ థింకింగ్ మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. కొత్త స్టార్టప్ ప్రారంభించేందుకు సరైన సమయం. కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యం నుంచి కోలుకుంటారు. వేకేషన్‌కి వెళ్లేందుకు ప్లాన్స్ వేసుకుంటారు. ఆస్తుల కొనుగోలు అవకాశాలున్నాయి. విద్యార్థులు మరింతగా చదువుపై శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఒకింత జాగ్రత్తగా ఉండాలి.

    వృశ్చిక రాశి (Scorpio)
    ఇవాళ మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాలు ఇస్తాయి. ఫిట్‌నెస్, వర్కవుట్లతోపాటూ... తీసుకునే ఆహారం విషయంలో ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఆర్థిక విషయాల్లో స్నేహితుల సలహాలు మీకు కలిసొస్తాయి. వృత్తి పరంగా ఒకింత పని ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సభ్యులతో గడిపేందుకు కొంత సమయం లభిస్తుంది. ఎవరైనా మిమ్మల్ని తమతో రమ్మని ఆఫర్ చేస్తే... మీరు తిరస్కరిస్తారు. ఆస్తి వ్యవహారాల్లో తొందరపాటు ప్రమాదకరం. పూర్తిగా అన్నీ తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి. ప్రేమ వ్యవహారాలు అద్భుతంగా ఉండకపోయినా... సంతృప్తిగా ఉంటాయి.

    ధనస్సు రాశి (Sagittarius)
    మీరు ఇవాళ మీ పాజిటివ్ అంశాలను గుర్తిస్తూ... వాటి ఆధారంగా ముందుకు వెళ్లాలి. పెరిగిపోయిన సమస్యల నుంచి ఒకింత ఉపశమనం లభిస్తుంది. మనసుకు ఉల్లాసంతో ఆరోగ్యం బాగుంటుంది. ఇదివరకు చేసిన ఓ పెట్టుబడి ఇప్పుడు మంచి ఫలితం ఇస్తుంది. మీకు దక్కే ఛాన్స్ ఉన్న మంచి ఉద్యోగం... మీరు చొరవ చూపకపోవడంతో మిస్ అవుతుంది. కుటుంబంలో పెద్దవారు ఇచ్చిన సలహాను పాటించడం మీకు కష్టంగా మారుతుంది. మీకు ప్రియమైన వారితో కలిసి ఉన్నంత సేపూ మీరూ సంతోషంగా ఉంటారు.

    మకర రాశి (Capricorn)
    ఈ రోజు అదృష్టం మీకు కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదివరకటి కంటి ఫిట్‌గా, ఎనర్జీతో ఉంటారు. ఆదాయం పెరుగుతుంది, డబ్బు సమస్యలు ఉండవు. ఉద్యోగ పరంగా మీకు ఇచ్చే టాస్కులు మీకు నచ్చవు. కుటుంబ సభ్యులకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయంపై ప్రశంసల జల్లు కురుస్తుంది. త్వరలో ఎటైనా దూర ప్రాంతానికి సరదాగా వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది. పాత ఆస్తి ఒకటి ఇప్పుడు మెల్లగా మంచి రిటర్న్స్ ఇవ్వడం మొదలుపెడుతుంది. ప్రేమ వ్యవహారాలు మందగొడిగా ఉంటాయి... కానీ ప్రేమికుల మధ్య అవగాహన బలంగా ఉంటుంది.

    కుంభ రాశి (Aquarius)
    మీ స్నేహితులు, తోటి వారికి మీరు అండగా ఉంటారు. ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ ఫిట్ అవుతారు. ఆర్థికంగా కలిసొచ్చే అంశం ఒకటి మీకు చేరుతుంది. దాన్ని పట్టుకుంటారు. పెండింగ్‌లో ఉన్న ఓ మంచి పని ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కుతుంది. కుటుంబ సభ్యులకు సంబంధించి తీసుకునే నిర్ణయం ఒకటి మేలు చేస్తుంది. మీకు ఇష్టమైన వారితో ట్రావెల్ చేస్తే మనసుకు హాయిగా ఉంటుంది. మీరు అద్దెకు ఇచ్చిన ప్రాపర్టీపై కాస్త దృష్టి పెట్టాలి. ప్రేమ వ్యవహారాలు సవాళ్లు విసురుతాయి.

    ఇది కూడా చదవండి: Fitness Tips: కుర్చీలో బెటరా? నేలపై బెటరా? ఎలా కూర్చుంటే మేలు?

    మీన రాశి (Pisces)
    సామాజికపరంగా, కుటుంబ పరంగా మీరు ఏదో బలమైనది సాధిస్తారు. రిలాక్స్ కోసం దూర ప్రయాణం చెయ్యాలనుకునే మీ ఆలోచనకు కుటుంబ సభ్యులంతా ఫుల్ సపోర్ట్ ఇస్తారు. ఆస్తి కొనే ఛాన్స్ కనిపిస్తోంది. అదృష్టం కొంత వరకూ కలిసొచ్చే పరిస్థితి ఉంది. ఆరోగ్యం అద్భుతం. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దెబ్బ పడే ప్రమాదం ఉంది. ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఉన్న సవాలులా స్వీకరిస్తారు. ప్రేమ వ్యవహారాలు చిగురిస్తాయి. అవతలివారిపై ప్రేమ కురిపిస్తారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు