Home /News /astrology /

Horoscope Today: నవంబరు 9 రాశి ఫలాలు.. వీరికి శుభవార్త.. ఆకస్మిక ధనలాభం

Horoscope Today: నవంబరు 9 రాశి ఫలాలు.. వీరికి శుభవార్త.. ఆకస్మిక ధనలాభం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Horoscope today: నేడు మంగళవారం. ఇవాళ పలు రాశుల వారికి అద్భుతంగా ఉంది. అనుకున్నవన్నీ జరుగుతాయి. మరికొందరికి మాత్రం బాగాలేదు. వారు జాగ్రత్తగా ఉండి. మరి మేషం నుంచి మీనం వరకు.. ఏ రాశి వారికి ఎలా ఉంది? జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారు? ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  కాలజ్ఞానం

  నవంబరు 9, 2021

  దిన ఫలాలు

  మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆదాయం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ వారికి అనుకూలంగా ఉంది. ఆరోగ్యానికేమీ ధోకా ఉండదు. వృత్తి ఉద్యోగాల్లో కాస్తంత ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో స్థానచలనం ఉండే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు.

  వృషభం (కృత్తిక 2,3,4,రోహిణి, మృగశిర 1,2) ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శుభకార్యం తలపెడతారు. మంచి చోట పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సహచరులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. విద్యార్థులకు పరవాలేదు. కోర్టు కేసులో చిక్కులు ఎదురవుతాయి.

  మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) అనుకోకుండా ఆదాయం కలిసి వస్తుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక సహాయం కోసం స్నేహితులు ఇబ్బంది పెడతారు. ఇంటా బయటా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు కాస్తంత శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంది.

  IRCTC Shri Ramayana Yatra: ఐఆర్‌సీటీసీ శ్రీరామాయణ యాత్ర ఎక్స్‌ప్రెస్

  కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) సొంత ఊర్లో మంచి ఉద్యోగం లభిస్తుంది. శని సంచారం అనుకూలంగా లేని కారణంగా కొన్ని పనులు ఆలస్యం అవుతాయి. రాజకీయ, సామాజిక రంగంలోని వారికి సమయం పరవాలేదు. బంధువుల తాకిడి ఉంటుంది. విద్యార్థులకు అన్ని విధాలా మెరుగ్గా ఉంది. ప్రేమ వ్యవహారాలలో ఖర్చులు బాగా పెరుగుతాయి.

  సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. మంచి ఉద్యోగంలో చేరతారు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. తగాదాల్లో తల దూర్చవద్దు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. విద్యార్థులకు బాగుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

  కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1, 2) అనుకున్న ఉద్యోగం లభించవచ్చు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. వివాహ ప్రయత్నాలకు అనుకూల సమయం. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో పరిస్థితులు అనుకూలిస్తాయి. కోర్టు కేసులో నెగ్గుతారు.

  Vastu Tips: వంట గదిలో సామాన్లను ఇలా ఉంచండి.. అన్నీ శుభాలే ఇక..

  తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) అన్ని విధాలా అనుకూలమయిన సమయం. ఆర్థికంగా పరవాలేదు. ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆశించినంతగా ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. వ్యాపారులకు, న్యాయవ్యవస్థలోని వారికి అనుకూలంగా ఉంది.

  వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ) ఉద్యోగంలో ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా సమయం అనుకూలంగా ఉంది. రుణాల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా విసుగు కలిగిస్తాయి. తల పెట్టిన పనులు పూర్తవుతాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విదేశాల నుంచి ఆఫర్ వస్తుంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది.

  ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. మరో ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు సునాయాసంగా నెరవేరతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందంజ వేస్తారు.

  మీ ఇంట్లో ఈ మొక్కను ఎట్టిపరిస్థితుల్లో పెంచకండి!

  మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) ఉద్యోగానికి, ఆదాయానికి డోకా లేదు. కొత్త ఆదాయ మార్గాలు కూడా మీ ముందుకు వస్తాయి. అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం మాత్రం చూసుకోవాలి. కొత్త ప్రయత్నాలు తల పెట్టినప్పుడు కుటుంబ సభ్యుల్ని కూడా సంప్రదించండి. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. తరచూ శివాలయ సందర్శన మంచిది.

  కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) మంచి ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో రాణిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. తిప్పట ఎక్కువగా ఉన్నా, కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్, స్వయం ఉపాధివారికి బాగుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూల పడతాయి.

  మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ఉద్యోగంలో సహెూద్యోగులు, అధికారుల సహకారం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సమయం బాగుంది. ఆరోగ్యం పరవాలేదు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. విదేశాలలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులకు చాలా బాగుంది. స్నేహితురాలితో ఉత్సాహంగా షికార్లు చేస్తారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Astrology, Horoscope, Horoscope Today, Rashifal, Rasi phalalu, Zodiac sign

  తదుపరి వార్తలు