Home /News /astrology /

HOROSCOPE TODAY ON 11 11 2021 HERE IS TELUGU ASTROLOGY RASHIFAL RASI PHALALU KNOW HOW IS YOUR ZODIAC SIGN SK

Horoscope today: నవంబరు 11 దిన ఫలాలు.. ఈ రాశుల వారికి గుడ్‌న్యూస్.. మంచి సంస్థలో ఉద్యోగం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Horoscope today: నేడు గురువారం. ఇవాళ ఏ రాశి వారికి ఎలా ఉంది? జ్యోతిష పండితుల అంచనాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు సూచిస్తున్నారు. మేషం నుంచి మీనం వరకు దిన ఫలాలను ఇక్కడ తెలుసుకుందాం.

  కాలజ్ఞానం

  నవంబరు 11, 2021

  దిన ఫలాలు

  మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) మంచి సంస్థ నుంచి ఉద్యోగం ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గం గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. చాలావరకు రుణ సమస్యలు తగ్గించుకుంటారు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి.

  వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. తలచిన పనులు నెరవేరుతాయి. చాలాకాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించవచ్చు. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. పొదుపు చర్యలు చేపడతారు. వ్యాపారంలో బాగా లబ్ధి పొందుతారు.

  మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో శుభ వార్తలు వింటారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యాల్లో పాల్గొంటారు. ఆలయాలకు వెడతారు. సహచరులు, సన్నిహితులతో వాదనలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త.

  దేవుడి ఫొటోతో సహా ఈ 4 వస్తువులను పర్సులో అస్సలు పెట్టుకోవద్దు.. అవేంటంటే..

  కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఉద్యోగం విషయంలో అనుకూల సమాచారం అందుతుంది. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. చిన్నప్పటి స్నేహితులు పలకరిస్తారు. శుభకార్యం తల పెడతారు. సంతానంలో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది.

  సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) ఈ రాశివారికి సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. బంధువులు, స్నేహితులు సహాయపడతారు. ఆర్థిక లావాదేవీలలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం చక్కగా అనుకూలిస్తుంది.

  కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. బంధుమిత్రుల నుంచి సహకారం అందుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఆటంకాలు ఎదురవుతున్నా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

  Zodiac signs: ఈ మూడు రాశుల వారు అస్సలు అబద్దం చెప్పరట !.. మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి

  తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. ఖర్చుల్ని అదుపు చేయాల్సిన అవసరం ఉంది. బంధుమిత్రుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

  వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ) ఉద్యోగం విషయంలో సమయం అనుకూలంగా ఉంది. శుభకార్యం జరుగుతుంది. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. తిప్పట ఎక్కువగా ఉంటుంది. సన్నిహితులతో తగాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో నష్టపోతారు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేయడం మంచిది.

  ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఆదాయానికి ఏమాత్రం కొరత లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. రుణ సమస్యల రుణ సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్త. శరీరానికి విశ్రాంతి అవసరం.

  ఈ వస్తువులు ఇంట్లో పెట్టుకోకుండా జాగ్రత్తపడండి.. దురదృష్టాన్ని కొని తెచ్చుకున్నట్లే..

  మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. శుభ కార్యం తల పెడతారు. వివాహ సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. డబ్బు నష్టపోయే సూచనలున్నాయి.

  కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఏలిన్నాటి శని కారణంగా పనులు ఆలస్యం అవుతుంటాయి. తిప్పట ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. రాదనుకున్న డబ్బు అనుకోని విధంగా చేతికి అందుతుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. వివాహ సంబంధం కుదరవచ్చు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. అదనపు బాధ్యతలు మీద పడతాయి.

  ఎవరైనా ఏడిస్తే.. ఈ రాశివారు కూడా ఏడ్చేస్తారట!

  మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో విందులో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. ఇతరులకు ఆర్థికంగా వీలైనంత సహాయం చేస్తారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Astrology, Horoscope, Horoscope Today, Rashifal, Rasi phalalu, Zodiac signs

  తదుపరి వార్తలు