• HOME
  • »
  • NEWS
  • »
  • ASTROLOGY
  • »
  • HOROSCOPE TODAY ON 10 4 2021 THESE ZODIAC SIGN PERSONS MAY GET UNEXPECTED MONEY CHECK YOUR TODAY RASI PHALALU NK

Horoscope 10-4-2021: రాశి ఫలాలు... ఈ రాశులవారికి ఆకస్మిక ధనలాభం

Horoscope 10-4-2021: రాశి ఫలాలు... ఈ రాశులవారికి ఆకస్మిక ధనలాభం

Horoscope 10-4-2021: రాశి ఫలాలు

Horoscope today: నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయి. ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి... జ్యోతిష పండితులు ఏ రాశి వారికి ఏం సూచిస్తున్నారో తెలుసుకుందాం.

  • Share this:
    Horoscope today: దేశంలో ఆర్థిక పరిస్థితులు మెల్లమెల్లగా దిగజారుతున్నాయి. కరోనా సమస్యలు పెరుగుతున్నాయి. నైట్ కర్ఫ్యూలు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆర్థిక పరమైన అంశాల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. రేపు ఎలా ఉంటుందో అనే ఆందోళన అందరిలోనూ ఉంది. రాశి ఫలాల ద్వారా ఎదురవ్వబోయే సమస్యల్ని ముందుగానే కొంతవరకూ తెలుసుకోవచ్చు. తద్వారా అప్రమత్తం అయి వాటి నుంచి బయటపడవచ్చు. జ్యోతిష పండితులు తిథి, నక్షత్రం, పంచాంగం, గ్రహాలు, సూర్యుడు, ఘడియలు అన్నీ పరిశీలించి... ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. 10-4-2021 నాడు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. (image credit - shutterstock)

    మేష రాశి (Aries)
    ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఉద్యోగపరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూల సమయం. ఆరోగ్యం పరవాలేదు. హామీలు ఉండొద్దు.

    వృషభ రాశి (Taurus)
    ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం చేకూరుతుంది. సానుకూల వాతావరణం ఉంది. వ్యాపారంలో కూడా శుభ ఫలితాలు ఉన్నాయి. ధనలాభం ఉంది. భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. రుణాలు తీరుస్తారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. కోర్టు కేసుల్లో నెగ్గుతారు.

    మిథున రాశి (Gemini)
    ముఖ్యమైన పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ, ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

    కర్కాటక రాశి (Cancer)
    కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. కొన్ని కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులకు బాగుంది.

    సింహ రాశి (Leo)
    గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తాయి. ఉద్యోగ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉన్న ఊళ్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పలుకుబడి గలవారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు.

    కన్య రాశి (Virgo)
    ఉద్యోగంలో సమర్థవంతంగా పని చేస్తారు. అవసరానికి ధనం లభిస్తుంది. వ్యక్తిగతంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడికి గురి కాకుండా నిర్ణయాలు తీసుకోండి. మిత్రుల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది.

    తుల రాశి (Libra)
    ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. కాలం కలిసి వస్తుంది. ఉద్యోగ కష్టాలు లేకుండా సాఫీగా సాగిపోతుంది. చేస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించి అవసరమైన ప్రణాళికలను ఆలోచిస్తారు. వ్యాపారంలో కలిసి వస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త.

    వృశ్చిక రాశి (Scorpio)
    ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. సంపద పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపార పరంగా శ్రమ ఎక్కువవుతుంది. పలుకుబడి పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో
    పాల్గొంటారు. హామీలు ఉండొద్దు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది.

    ధనస్సు రాశి (Sagittarius)
    తగినంత ప్రయత్నం చేస్తే మీకు అంతా బాగుంటుంది. బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అనుకూలమైన సమయం ఇది. ఉద్యోగంలో అవకాశాలు కలిసి వస్తాయి. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. ప్రశాంతత చేకూరుతుంది. ప్రేమికురాలితో సరదాగా గడుపుతారు. విద్యార్థులకు చాలా బాగుంది.

    మకర రాశి (Capricorn)
    ప్రయత్నాల్ని కొనసాగిస్తే విజయం సిద్ధిస్తుంది. జీవితంలో స్థిరత్వం ఏర్పడడానికి నాంది పలుకుతారు. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారంలో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వివాదాలకు ఇది సమయం కాదు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంది.

    కుంభ రాశి (Aquarius)
    అనుకూలమైన సమయం ఇది. పనులన్నీ పూర్తవుతాయి. అవరోధాలు, ఆటంకాలు తొలగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. మిమ్మల్ని చూసి అసూయపడే వారుంటారు. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో బాగా లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం కాపాడుకోవాలి. పని ఒత్తిడి ఉంటుంది.

    ఇది కూడా చదవండి: How to become Rich: ఇవి దానం చేస్తే ధనవంతులవ్వడం ఖాయం... పండితుల సలహా

    మీన రాశి (Pisces)
    సమయం అంతగా అనుకూలంగా లేదు. ప్రతి పనికీ ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్య కార్యాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగంలో ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. వ్యాపారంలో లాభాలు తగ్గుతా యి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు