Home /News /astrology /

Today Horoscope: డిసెంబర్ 4 రాశి ఫలాలు.. అశించిన స్థాయిలో ఆదాయం.. ఆ విషయంలో మోసం జరుగుతుంది..

Today Horoscope: డిసెంబర్ 4 రాశి ఫలాలు.. అశించిన స్థాయిలో ఆదాయం.. ఆ విషయంలో మోసం జరుగుతుంది..

డిసెంబర్ 04, 2021 రాశి ఫలాలు

డిసెంబర్ 04, 2021 రాశి ఫలాలు

Today Horoscope: నేడు శనివారం. నేడు కొన్ని రాశుల వారు ఉద్యోగపరంగా కష్టపడాల్సి ఉంటుంది. తల్లితండ్రుల సహకారంతో మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. కొన్ని రాశుల వారు ఫైనాన్షియల్ విషయాల్లో అలర్ట్‌గా ఉండాలి. నేడు పది మందికి మేలు జరిగే పనులు తల పెడతారు. మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  కాలజ్ఞానం (Horoscope Today)

  డిసెంబర్ 4, 2021

  దిన ఫలాలు

  మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగపరంగా కష్టపడాల్సి ఉంటుంది. తల్లితండ్రుల సహకారంతో మంచి ఫలితాలు అనుభవానికి వ స్తుంది. గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆదా యం పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా పెరుగుతాయి. ఒక ముఖ్యమైన కుటుంబ సమస్య పరి ష్కారం అవుతుంది.

  వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఆర్థికపరంగా అదృష్టం పడుతుంది. ముఖ్యమైన పనులు చకచకా పూర్తవుతాయి. గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. సకాలంలో లక్ష్యాలు పూర్తి చేసి అభినందనలు అందు కుంటారు. వ్యాపార లాభం ఉంది. మనసులోని కోరిక నెరవేరుతుంది. గతంలో మీ మీద పడ్డ నింద లు తొలగుతాయి.

  Zodiac Signs: వామ్మో.. క్షమాపణ చెప్పేదాకా ఈ 3 రాశుల వాళ్ల ఇగో ఒప్పుకోదు.. పగను పెంచి పోషిస్తారు..


  మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఇతరులకు సహాయపడడం వంటి మంచి పనులు చేస్తారు. మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక
  స్థితి ఆశా జనకంగా ఉంటుంది. స్నేహితులు అండగా ఉంటారు. కుటుంబ సభ్యులతో వీలైనంత సామరస్యంగా వ్యవహరించండి.

  కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ముఖ్యమైన పనుల్ని వాయిదా వేయకుండా పూర్తి చేస్తారు. ఇంటా బయటా శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. ధనలాభానికి అవకాశం ఉంది. అపార్థాలకు తావివ్వకుండా ఓర్పుతో సంభాషించడం మం చిది. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఇప్పుడు తీసుకునే నిర్ణయా లు సత్ఫలితాలనిస్తాయి.

  Zodiac Signs: ఆనందంలో వీళ్లకు మించిన వాళ్లు లేరు.. ఆ సంతోషం కూడా ఈ రాశుల వారికి ఇలా వస్తుందట..


  సింహం (మఖ 4, పుబ్బ 4, ఉత్తర 1)
  మంచి నిర్ణయంతో ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. సమయం అనుకూలంగా ఉంది. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగంలో ఒక మెట్టు పైకెక్కే అవకాశం ఉంది. కొత్త వారి పరిచయాలు లాభాలనిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉ ద్యోగం దొరుకుతుంది.

  కన్య (ఉత్తర 2,3,4, హస్త 4, చిత్త 1, 2) మంచి కాలం నడుస్తోంది. ఉద్యోగ, వ్యాపారాల్లో చక్కని విజయాలు సాధిస్తారు. ఉద్యోగ సంబంధంగా మంచి అవకాశాలు అందివస్తాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. పది మందికీ మేలు జరిగే పను లు తల పెడతారు. చిన్న చిన్న సమస్యలకు, అవరోధాలకు ఆందోళన చెందవద్దు. మీకు అంతా మంచే జరగబోతోంది.

  తుల (చిత్త 3,4, స్వాతి 4, విశాఖ 1,2,3)
  ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. కొన్ని శుభ ఫలితాలు కూడా ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. కొత్త ప్రయత్నాలకు వెనుకాడవద్దు. తోటి వారి సహాయంతో ముందుకు వెడతారు. కుటుంబంతో కలిసి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఓర్పు అవసరం.

  Pressure Cooker: మీ ఇంట్లో ప్రెషర్ కుక్కర్ ఉందా.. అందులో ఈ 3 రకాల పదర్థాలను ఉడికించకూడదు.. ఎందుకంటే..


  వృశ్చికం (విశాఖ 4, అనూరాధ 4, జ్యేష్ఠ 4)
  బంధుమిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో కూడా సహ చరుల అండదండలు లభిస్తాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. మొ త్తం మీద అన్నీ శుభవార్తలే వింటారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సేవా కార్యక్ర మాల్లో పాల్గొంటారు.

  ధనుస్సు (మూల 4, పూర్వాషాఢ 4, ఉత్తరాషాఢ 1)
  ఉద్యోగ, వ్యాపారాల్లో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా వ్యాపారంలో నష్టం రాకుండా చూసుకోవాలి. డబ్బు మోసపోయే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదానికి అవకాశం ఉంది. ఆంతరంగిక విషయాలు ఇతరులతో చర్చించడం మంచిది కాదు. కుటుంబ సభ్యులకు చెప్పి చేసే పనులు మంచి ఫలితాలనిస్తాయి.

  మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం 4, ధనిష్ఠ 1,2) శ్రమ, తిప్పట ఉన్నా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో విశేషమైన ఫలితాలు అనుభవాని కి వస్తాయి. వ్యాపార లాభం ఉంది. స్వల్ప ప్రయత్నంతో మంచి విజయాలు సాధిస్తారు. సానుకూల దృ క్పథంతో వ్యవహరించండి. చెడు ఊహించవద్దు. ఒక గడ్డు సమస్య నుంచి బయటపడతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.

  కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం 4, పూర్వాభాద్ర 1,2,3) ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. అకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. అశించిన స్థాయిలో ఆ దాయం పెరుగుతుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారంలో కొన్ని స మస్యలు పరిష్కారం అవుతాయి. ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతుంది. మనసులోని కోరిక నెరవేరుతుంది.

  Danger Omicron: ఒమిక్రాన్ ఎఫెక్ట్..? కళాశాలలో కరోనా కలకలం.. 56 మంది విద్యార్థులకు కరోనా..


  మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) గ్రహ సంచారం ఏమంత అనుకూలంగా లేదు. ఇంటా బయటా అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగి ఇబ్బంది పడతారు. కొందరు ఆత్మీయుల వల్ల మనశ్శాంతి ఏర్పడుతుంది. మిత్రుల సల హాలతో వ్యక్తిగత సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చుల కు కళ్లెం వేయాలి.
  Published by:Veera Babu
  First published:

  Tags: Astrology, Zodiac signs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు