Home /News /astrology /

HOROSCOPE TODAY JUNE 25 HOROSCOPES THAT ZODIAC SIGN IS VERY DANGEROUS IN THEIR WORK PJC PVN

Horoscope Today: జూన్‌ 25 రాశిఫలాలు..ఆ రాశి వారికి ఉన్న పనిలో చాలా ప్రమాదం!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జూన్‌ 25వ తేదీ శనివారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.

ఓ రాశివారు జీవిత భాగస్వామితో అన్ని రకాల విషయాలు చర్చించాలి. మరో రాశి వారు ఖర్చులు పెరుగుతున్నా.. సమర్థంగా ఎదుర్కోగలరు. ఇంకో రాశివారు వేరే వైపు చూస్తూ చేతిలో ఉన్న అవకాశాలను కోల్పోయే సూచనలు కనిపిస్తున్నాయి. నక్షత్రాల గమనం ఆధారంగా వీటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. జూన్‌ 25వ తేదీ శనివారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.

* మేషం
మీరు, మీ జీవిత భాగస్వామి కొన్ని రకాల కన్వర్జేషన్‌లను పక్కన పెట్టాలని అనుకుని ఉండవచ్చు, కానీ అది త్వరలో పరిష్కరించుకోవాలి. ఒక కొత్త ట్రెండ్ కూడా మిమ్మల్ని ఆకర్షించవచ్చు. బుద్ధిగా ఉండండి.

లక్కీ సైన్- ప్రశాంతమైన సంగీతం

* వృషభం
మీరు పబ్లిక్ డీలింగ్ వృత్తిలో ఉన్నట్లయితే సానుకూల పరిణామాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఖర్చులు పెరుగుతున్నప్పటికీ, మీరు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. రెగ్యులర్ హెల్త్ కేర్ షెడ్యూల్‌కు తప్పనిసరిగా ప్రాధాన్యం ఇవ్వాలి.

లక్కీ సైన్- సిల్వర్‌ చైన్‌

* మిథునం
మీరు మరో వైపు చూస్తున్నట్లయితే, చేతిలో ఉన్న అవకాశాన్ని కోల్పోవచ్చు. మీకు ఏదైనా స్థానాన్ని తీసుకోవడానికి తగినంత విశ్వాసం లేకపోతే.. తీసుకోవాలా? లేదా? అనే సందిగ్ధంలో ఉంటే.. ఇక ఆ పరిస్థితి అవసరం లేదు. మీరు సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి.

లక్కీ సైన్- బుక్‌ కవర్‌

* కర్కాటకం
మీరు మీ పాత ఆహారపు అలవాట్లు, అలవాట్లు, స్వీట్ టూత్ మొదలైనవాటిని వదిలించుకోవాలని కోరుకుంటూ ఉండవచ్చు, కానీ విజయవంతం కాలేదు. ఇప్పుడు వీటన్నింటిని తీవ్రంగా సమీక్షించాల్సిన సమయం వచ్చింది. ప్రస్తుతానికి మీరు ఎవరికీ ఎమోషనల్‌గా కమిటెడ్‌ కాదని నిర్ధారించుకోండి.

Dog Birthday : గ్రాండ్ గా పెంపుడు కుక్క బర్త్ డే..100కేజీల కేక్,5వేల మందికి భోజనాలు..ఇక్కడ రాజకీయం కూడా ఉందండోయ్

లక్కీ సైన్- రోస్‌ క్వార్ట్జ్‌

* సింహం
ట్రిప్‌కు వెళ్లడం వలన మీరు కొంతకాలంగా వెతుకుతున్న విశ్రాంతి క్షణాలు మీకు లభిస్తాయి. జీవితంలో చాలా డిమాండ్ ఉంది. భవిష్యత్తుకు సంబంధించి ఇప్పుడే సరైన విధంగా ప్లాన్‌ చేసుకోవడం మంచిది.

లక్కీ సైన్- బ్లూ సఫైర్‌

* కన్య
మీరు కొంతకాలంగా ఆలోచిస్తూనే ఉన్నారు.. కానీ అది మిమ్మల్ని ఎక్కడికీ చేరడంలో ఉపయోగపడదు. మీ ఆలోచనలను ఒకచోట చేర్చుకోండి, ఒక ప్రణాళికను రూపొందించండి, నమ్మదగిన, విశ్వసనీయమైన వారితో చర్చించండి. త్వరలో మీరు త్వరలో ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు.

Numerology: జూన్ 25 న్యూమరాలజీ.. ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకుండా వారు జాగ్రత్త పడాలి

లక్కీ సైన్- సోలో పర్‌ఫార్మెన్స్‌

* తుల
మీరు ఏదైనా ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు, మీ ఆలోచనలు చెదిరిపోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. మీ పర్యవేక్షణలో ఉన్న పనిలో చాలా ప్రమాదం ఉండవచ్చు. రానున్న రోజుల్లో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.

లక్కీ సైన్- లార్జ్‌ విండో

* వృశ్ఛికం
కొన్నిసార్లు మీ అభిప్రాయాలు మీ ఆలోచనల కంటే బిగ్గరగా మాట్లాడవచ్చు. ఏదైనా కమ్యునికేట్‌ చేసేటప్పుడు మనసు, మాటకు సంబంధం ఉండేలా చూడండి. పరిపూర్ణత కోసం మీ పోరాటం అనవసరంగా ఇతరులను ఆపి ఉంచే సూచనలు ఉన్నాయి.

Best dress : స్లిమ్ అండ్ ట్రిమ్ లుక్ పొందడానికి ఇలాంటి కలర్ డ్రెస్‌ని ఎంచుకోండి!

లక్కీ సైన్- టెన్నిస్‌ రాకెట్‌

* ధనస్సు
కొత్త వ్యక్తి మీ జీవితాన్ని మానసికంగా ప్రభావితం చేయవచ్చు. మీరు సౌకర్యంగా ఫీల్‌ కావడానికి కొంత సమయం తీసుకోవచ్చు. కొత్త వినూత్న ఆలోచనతో మీ రోజు విలువైనదిగా మారవచ్చు. గతంలో చేసిన పనికి ప్రతిఫలం అందుకునే సూచనలు ఉన్నాయి.

లక్కీ సైన్- క్లస్టర్‌ ఆఫ్‌ బర్డ్స్‌

* మకరం
అన్ని చోట్లా కనిపించిన విషయాలన్నీ ఇప్పుడు మీకు అర్థమవుతున్నాయి. వాటిని సరిగా అంచనా వేసే మానసిక పరిస్థితి కూడా మీకు ఉంది. మీ విధానంలో కొద్దిగా సర్దుబాటు చేసుకుంటే కొత్త అవకాశాలను చూస్తారు.

లక్కీ సైన్- హెరిటేజ్ క్లాక్

* కుంభం
మీరు చూడనప్పుడు చాలా విషయాలు జరిగి ఉండవచ్చు. మీరు వాటిని మీ మనస్సులో రాసే ముందు ఆ వాస్తవాలను వెలికితీసేందుకు మీ సమయాన్ని వెచ్చించండి. గత కొన్ని రోజులుగా విపరీతమైన ఖర్చుల కారణంగా, మీరు ఖర్చు విధానాన్ని సమీక్షించాల్సి రావచ్చు.లక్కీ సైన్- బెల్‌

* మీనం
రోజు ఉల్లాసంగా కనిపిస్తోంది. మీ మనస్సులో చాలా విషయాలు నడుస్తున్నాయి. మీరు వాటన్నింటినీ పరిష్కరించగల మానసిక స్థితిలో ఉన్నారు. మీకు ఒకే సమయంలో కొంత ఓపిక, కొంత మార్గదర్శకత్వం అవసరం కావచ్చు.

లక్కీ సైన్- సెమి ప్రీసియస్‌ జెమ్‌
First published:

Tags: Astrology, Horoscope Today, Zodiac signs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు