Home /News /astrology /

HOROSCOPE TODAY JUNE 23 2021 ASTROLOGY PREDICTIONS SUGGEST THESE 3 ZODIAC SIGNS MAY WIN MONEY ISSUES TODAY NK

Horoscope today June 23, 2021: ఈ 3 రాశుల వారికి ఆర్థిక ధన లాభం

Horoscope today June 23, 2021: రాశిఫలాలు

Horoscope today June 23, 2021: రాశిఫలాలు

Horoscope today June 23, 2021: తెలుగు రాష్ట్రాల్లో నేడు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తెలుగు వారికి ఇవాళ ఎలా కలిసొస్తుంది? ఏయే శుభవార్తలు ఉన్నాయో జ్యోతిష పండితుల ద్వారా తెలుసుకుందాం.

  Daily Horoscope: నైరుతీ రుతుపవనాలు ఇండియాలోకి ప్రవేశించి 20 రోజులు దాటినా ఇంతవరకూ తెలుగు రాష్ట్రాల్లో సరైన వర్షాలు పడలేదు. మేఘాలు ముఖం చాటేస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. వ్యాపారులు తిరిగి తమ వ్యాపారాలను గట్టెక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగులు వర్క్ ప్రమ్ హోమ్ నుంచి తిరిగి ఆఫీసులకు వెళ్తున్నారు. ఇలా పరిస్థితులన్నీ సాధారణం వైపు నడుస్తున్నాయి. మరి ఇలాంటి సమయంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయి. ఏ రాశుల వారికి ఏయే అంశాలు కలిసివస్తాయి. దీనిపై జ్యోతిష పండితులు ఏమంటున్నారు. జూన్ 23 ఎలా ఉంటుందని వారు అంచనా వేస్తున్నారో తెలుసుకుందాం.

  మేష రాశి (Aries) (March 21-April 20):
  వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి బాగా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యక్తిగతంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుంది. మిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. శుభవార్తలు వింటారు. మంచి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆలయ సందర్శనకు అవకాశం ఉంది.

  వృషభ రాశి (Taurus) (April 21-May 20):
  ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తల పెట్టిన పనులు ఎంతో శ్రమ మీద పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల వారికి ఇది ఎంతో అనుకూల సమయం.

  ఇది కూడా చదవండి: Zodiac signs: ఏ రాశి వారికి ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్ నచ్చుతుంది? మీకు నచ్చే స్టైల్ ఏది?

  మిథున రాశి (Gemini) (May 21-Jun 21):
  ఉద్యోగంలో అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అదనపు సంపాదన కోసం ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారం నిలకడగా సాగుతుంది. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పరవాలేదు. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.

  కర్కాటక రాశి (Cancer) (Jun 22-July 22):
  ఉద్యోగంలో అధికారుల అభినందనలు, ప్రశంసలు అందుకుంటారు. అధికార లాభం ఉంది. ఆర్థిక స్తోమత చాలావరకు మెరుగుపడుతుంది. మిత్రుల సహాయంతో ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండండి. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది.

  సింహ రాశి (Leo) (July 23-August 23):
  ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. ఖర్చులకు కళ్లెం వేయాలి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది. ఇతరులకు వీలైనంతగా సహాయం చేస్తారు. కుటుంబంలో ఆనందోత్సాహాలు నెలకొంటాయి. మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు.

  కన్య రాశి (Virgo) (August 24-September 23):
  ఉద్యోగం మారాలనే ఆలోచన కలుగుతుంది. ఆర్థికంగా బాగానే ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. కుటుంబపరంగా కొద్దిగా ఒత్తిడి, చికాకులు ఉంటాయి. ప్రయాణాలను వాయిదా వేయండి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు.

  తుల రాశి (Libra) (September 24-October 23):
  ఉద్యోగంలో సహెూద్యోగుల సహకారంతో లక్ష్యాలు పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. పలుకుబడి గలవారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఒక ప్రధాన ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

  వృశ్చిక రాశి (Scorpio) (October 24-November 22):
  ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అనుకోకుండా ఆర్థిక సమస్య సహాయం అందుతుంది. పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. ఆదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు.

  ధనస్సు రాశి (Sagittarius) (November 23-December 21):
  ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధన లాభం ఉంది. వ్యాపారపరంగా ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. కొత్త పనులు చేపడతారు. కుటుంబంలో కొద్దిగా ప్రశాంతత లోపిస్తుంది. ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. శుభవార్త వింటారు.

  మకర రాశి (Capricorn) (December 22-January 21):
  ఆదాయానికి, ఆరోగ్యానికి ధోకా లేదు. ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. వైద్యపరమైన ఖర్చులు చికాకు కలిగిస్తాయి. వ్యాపారంలో బాగా ఒత్తిడి ఉంటుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు.

  ఇది కూడా చదవండి: Vastu Shastra: పూజ గదిలో ఇవి ఉంటే... ఆ ఇంట మనస్శాంతి లేనట్లే...

  కుంభ రాశి (Aquarius) (January 22-February 19):
  ఉద్యోగంలో ఎవరి సహకారమూ లేకుండా లక్ష్యాలు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. కొందరు సన్నిహితుల సహాయంతో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

  మీన రాశి (Pisces) (February 20-March 20):
  ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. దగ్గర బంధువొకరికి సహాయపడతారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయపరంగా వ్యాపారులకు బాగానే ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది.
  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac sign

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు