Home /News /astrology /

HOROSCOPE TODAY JUNE 19 2021 ASTROLOGY INDICATES THESE ZODIAC SIGNS PEOPLE MAY GET JOB AND BUSINESS BENEFITS TODAY NK

Horoscope today 19 June, 2021: నేటి రాశి ఫలాలు... ఈ రాశుల వారికి ఉద్యోగ, వ్యాపార లాభాలు

నేటి రాశి ఫలాలు... ఈ రాశుల వారికి ఉద్యోగ, వ్యాపార లాభాలు

నేటి రాశి ఫలాలు... ఈ రాశుల వారికి ఉద్యోగ, వ్యాపార లాభాలు

Horoscope June 19, 2021: ఇవాళ శనివారం. మరి ఇవాళ రాశి ఫలాలు ఏం చెబుతున్నాయి. ఎవరికి ఎలాంటి ఫలాలు ఉన్నాయి. జ్యోతిష పండితులు ఏయే సూచనలు చేస్తున్నారో తెలుసుకుందాం.

    Horoscope Daily: దేశంలో ఆర్థిక పరిస్థితులు మెరుగవుతున్నాయి. అందువల్ల ప్రజల జీవన విధానం కూడా మెరుగవుతుంది. కరోనా తగ్గుతోంది... కాకపోతే ధరల పెరుగుదల వల్ల ప్రజల ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. సమాన్య ప్రజలకు నెలవారీ బడ్జెట్ భారం అవుతోంది. మరి ఇలాంటి సమయంలో జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారు... రాశి ఫలాలకు సంబంధించి వారు ఎలాంటి సూచనలు చేస్తున్నారు... ఏ రాశుల వారికి ఈ వర్షాకాలం కలిసొస్తుంది... ఎవరికి అప్రమత్త సూచనలు ఉన్నాయి... ఆర్థిక, వివాహ, ప్రేమ సంబంధాలు ఏ రాశుల వారికి జూన్ 19, 2021న ఎలాంటి పంచాంగం చెబుతున్నాయో తెలుసుకుందాం.

    మేష రాశి (Aries) (March 21-April 20):
    ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యక్తిగత సమస్య ఒకటి మిత్రుల సహాయంతో పరిష్కారం అవుతుంది. తల పెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక స్నేహితుడికి ఆర్థికంగా సహాయపడతారు. బాగా దగ్గరి బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం పరవాలేదు. ఆదాయపరంగా వ్యాపారులకు బాగుంది.

    వృషభ రాశి (Taurus) (April 21-May 20):
    ఉద్యోగంలో బాగా శ్రమకు, ఒత్తిడికి గురవుతారు. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయానికి లోటుండదు. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చాలా కాలంగా వేధిస్తున్న ఆర్థిక సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది. స్పెక్యులేషన్ పరవాలేదు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు.

    మిథున రాశి (Gemini) (May 21-Jun 21):
    ఉద్యోగంలో అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి డోకా లేదు. రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి వస్తుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. వైద్యపరమైన ఖర్చులు చికాకులు కలిగిస్తాయి. వ్యాపారంలో బాగా ఒత్తిడి ఉంటుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు.

    కర్కాటక రాశి (Cancer) (Jun 22-July 22):
    ఉద్యోగంలో సానుకూల మార్పు కనిపిస్తోంది. ఆకస్మిక ధన లాభం ఉంది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. కొత్త పనులు చేపడతారు. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. పిల్లల నుంచి సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు తగ్గించుకోవాలి.

    సింహ రాశి (Leo) (July 23-August 23):
    ఉద్యోగంలో మరో మెట్టు పైకెదిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి కొంతవరకు గట్టెక్కుతారు. పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. వృత్తి, నిపుణులు పురోగతి సాధిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లలు శుభవార్తలు చెబుతారు. ఆదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు.

    కన్య రాశి (Virgo) (August 24-September 23):
    ఉద్యోగంలో అధికారులు బాగా సహకరిస్తారు. వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం ఉంది. పలుకుబడి గలవారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులకు సహాయం చేస్తారు. కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

    తుల రాశి (Libra) (September 24-October 23):
    ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక విషయాలు పరవాలేదు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీకు బాగా విశ్రాంతి అవసరం. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు.

    వృశ్చిక రాశి (Scorpio) (October 24-November 22):
    ఉద్యోగం మారడానికి ఇది సమయం కాదు. ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉన్న ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ ఆర్థిక స్తోమతకు మించి ఇతరులకు వీలైనంతగా సహాయం చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెళ్లి సంబంధం వాయిదా పడుతుంది.

    ధనస్సు రాశి (Sagittarius) (November 23-December 21):
    ఉద్యోగంలో అధికారులు మీ శ్రమను, ప్రతిభను గుర్తిస్తారు. అధికార లాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. సొంత నిర్ణయాలు ఉత్తమం. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది.

    మకర రాశి (Capricorn) (December 22-January 21):
    ఏలిన నాటి శని కారణంగా ఉద్యోగ జీవితం అప్పుడప్పుడు చికాకు కలిగిస్తుంది. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయంలో పెద్దగా పెరుగుదల ఉండకపోవచ్చు. వ్యాపారం నిలకడగా సాగుతుంది. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పరవాలేదు. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.

    కుంభ రాశి (Aquarius) (January 22-February 19):
    ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. తల పెట్టిన పనులు ఎంతో శ్రమ మీద పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల వారికి ఇది ఎంతో అనుకూల సమయం.

    ఇది కూడా చదవండి: Vastu Tips: ఇంట్లో ట్యాప్ లీకవుతోందా.. మీ డబ్బుకు రెక్కలొచ్చినట్లే

    మీన రాశి (Pisces) (February 20-March 20):
    ఉద్యోగ జీవితం పరవాలేదు. కుటుంబంలో ప్రశాంతత తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుంది. మిత్రులు చేదోడు వాదోడుగా ఉంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac sign

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు