ఉద్యోగ వాతావరణం సానుకూలంగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయంలో చాలా జ్యాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మిత్రులు మీకు సహాయంగా ఉంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారం చాలావరకు నిలకడగా సాగుతుంది. మంచి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.
వృషభం (కృత్తిక 2, 3, 4 రోహిణి, మృగశిర 1, 2)
ఉద్యోగంలో మిమ్మల్ని అధికారులు కొద్దిగా వేధించే అవకాశం ఉంది. ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. శుభవార్త వింటారు. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం జాగ్రత్త, బంధువర్గంలో వివాహ సంబంధం కుదురుతుంది. ఆర్థికంగా మేలు జరుగుతుంది. వృత్తి వ్యాపారాల వారికి ఇది ఎంతో అనుకూల సమయం.
మిథునం (మృగశిర 3, 4, ఆర్ద్ర, పునర్వసు 123)
ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి. కుటుంబ సమస్య ఒకటి ఆందోళన కలిగి స్తుంది. ఆరోగ్యం పరవాలేదు. మిత్రుల వల్ల ప్రయోజనం జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. మిత్రుల వల్ల బాగా నష్టపోతారు. హామీలు ఉండవద్దు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
గ్రహ సంచారం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగులకే కాదు, నిరుద్యోగులకు కూడా టైమ్ బాగుంది. అధికార లాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. మీ ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. పుణ్యకార్యాలు, సేవా కార్యక్రమాలు చేస్తారు. వ్యాపారులకు కలిసి వస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం పరవాలేదు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో అధికారులు బాధ్యతలను పెంచుతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది పెడతాయి. మీ వల్ల సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం పెండింగ్లో పడుతుంది. వృత్తి వ్యాపారాల వారి ఆర్థిక పరిస్టితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది.
కన్య (ఉత్తర 2, 3 4 హస్త, చిత్త 1 2)
వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. పెట్టబడులు పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ఆర్థికంగా బాగానే ఉంటుంది. అనుకోకుండా పెల్లి సంబంధం కుదురుతుంది. ధన లాభానికి అవకాశం ఉంది. ప్రయాణాల్లో ఇబ్బంది పడతారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు కొద్దిగా లాభాలు ఆర్జిస్తారు.
తుల (చిత్త 3, 4, స్వాతి, విశాఖ1, 23)
ఉద్యోగంలో కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి. సహనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్టితి మెరుగుపడడానికి పథకాలు వేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం జా(గ్రత్తగా చూసుకోవాలి. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
సమయం కొద్దిగా అనుకూలంగా ఉంది. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఆదాయ వృద్దికి సంబంధించి కొన్ని నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు అభివృద్ధి సాధిస్తారు. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వ్యాపారపరంగా లాభాలున్నాయి. కొత్త పనులు చేపడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. పెల్లి సంబంధం కుదురుతుంది. వ్యాపారులకు మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా ఉంటుంది. వృత్తి నిపుణులకు మంచి ఆఫర్లు వస్తాయి. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు.
మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం, ధనిష్ఠ 1, 2)
వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. కొద్ది ఖర్చుతో అనారోగ్యం నుంచి బయటపడతారు. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ప్రేమించినవారితోనే పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు.
కుంభం (ధనిష్ఠ 3, 4 శతభిషం, పూర్వాభాద్ర 1, 2 ౩)
ఉద్యోగంలో శ్రమ ఎక్కువైనా సత్ఫలితాలు సాధిస్తారు. అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారాల్లో మంచి అభివృద్ది కనిపిస్తోంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఎందులోనూ పెట్టుబడులు పెట్టవద్దు. ప్రస్తుతానికి స్పెక్యులేషన్ కూడా లాభించదు. ఒక వ్యక్తిగత సమస్యను తెలివితేటలతో పరిష్కరించుకు౦టారు. వ్యాపారులు శ్రమ మీద సత్ఫలితాలు పొందుతారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
అధికార యోగం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. మిత్రుల సహాయంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. జీవితానికి సంబంధించి ఇప్పుడు తీసుకునే నిర్లయాలు సత్ఫలితాలనిస్తాయి. సంతానం పురోగతి చెందుతారు. మంచి కుటుంబంలో వివాహ సంబంధం కుదురుతుంది. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.