Home /News /astrology /

HOROSCOPE TODAY JUNE 16 2021 ACCORDING TO ASTROLOGY THESE ZODIAC SIGNS MAY GET NEW PROFESSIONAL TARGETS TODAY NK

Horoscope today 16 June, 2021: ఈ రాశుల వారికి కొత్త లక్ష్యాలు

Horoscope today 16 June, 2021: ఈ రాశుల వారికి కొత్త లక్ష్యాలు

Horoscope today 16 June, 2021: ఈ రాశుల వారికి కొత్త లక్ష్యాలు

Horoscope June 16, 2021: ఇవాళ బుధవారం. రాశులపై గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉండే రోజు. మరి ఇవాళ ఏ రాశి వారికి ఎలా ఉంటుందో... తిథి, నక్షత్రాలు, గ్రహాలు ఏం సూచిస్తున్నాయో తెలుసుకుందాం.

    Horoscope Daily: ఇండియాలో కరోనా తగ్గిపోతున్న రోజులు మొదలయ్యాయి. అంతా సర్దుకునేందుకు వీలవుతోంది. మళ్లీ వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు మెరుగయ్యేందుకు వీలు కలుగుతోంది. మరి ఇలాంటి సమయంలో... రాశి ఫలాలు ఏం సూచిస్తున్నాయి. ఎవరికి ఎలాంటి ఆర్థిక ఫలాలు ఉంటాయి. కొత్త ఉద్యోగాలు లభిస్తాయా... ఉపాధి దొరుకుతుందా.. ఆదాయం పెరుగుతుందా... లక్ష్మీదేవి కరుణిస్తుందా.. వంటి విషయాలపై జ్యోతిష శాస్త్ర పండితులు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. గ్రహాల గమనాలను, రాశుల్లోని నక్షత్ర బలాలతో పోల్చి చూస్తున్నారు. మరి నేటి రాశి ఫలాలపై వారు ఎలాంటి అంచనాలు, విశ్లేషణలు చేశారో చూద్దాం.

    మేష రాశి (Aries) (March 21-April 20):
    ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యం జాగ్రత్త. వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో ఎదుగూ బొదుగూ ఉండదు. బంధుమిత్రులు సహాయం అందిస్తారు. దగ్గరి బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అంతా మన మంచికే అనుకుని ధైర్యంగా ఉండండి.

    వృషభ రాశి (Taurus) (April 21-May 20):
    ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. పెళ్లి సంబంధం వారు ఓకే చెబుతారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. వృత్తి, వ్యాపారాల వారికి ఇది అనుకూల సమయం. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

    ఇది కూడా చదవండి:


    మిథున రాశి (Gemini) (May 21-Jun 21):
    ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థికంగా నిలకడగా ఉంటుంది కానీ, ఊహించని ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఆరోగ్యం పరవాలేదు. మీరు ఇబ్బందుల్లో ఉన్నా ఇతరులకు సహాయం చేస్తారు. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులకు చిరుద్యోగం లభిస్తుంది. పెళ్లి సంబంధం వారు ఎటూ తేల్చరు.

    కర్కాటక రాశి (Cancer) (Jun 22-July 22):
    ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో అధికారులను మెప్పిస్తారు. తిప్పట ఉన్నప్పటికీ అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అందరికీ మేలు జరిగే పనులు చేపడతారు. కుటుంబంలో ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలవారు అభివృద్ధి సాధిస్తారు.

    సింహ రాశి (Leo) (July 23-August 23):
    ఉద్యోగ జీవితం పరవాలేదు. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆదాయంలో పెద్దగా పెరుగుదల ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. అద్దె ఇళ్లలో ఉంటున్నవారు ఇల్లు మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పెళ్లి సంబంధం నానుతూ ఉంటుంది. సంతానం పురోగతి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల వారి పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

    ఇది కూడా చదవండి:



    కన్య రాశి (Virgo) (August 24-September 23):
    ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా లక్ష్యాలు పూర్తి చేస్తారు. ఇంటా బయటా శ్రమ ఉంటుంది. ఆర్థికంగా బాగానే ఉంటుంది. పెళ్లి సంబంధం విషయంలో ఆశించిన స్పందన లభించకపోవచ్చు. దూర ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లల పరిస్థితి బాగుంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు కొద్దిగా లాభాలు ఆర్జిస్తారు. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.

    తుల రాశి (Libra) (September 24-October 23):
    ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు మాత్రం బాగా పెరుగుతాయి. మధ్య మధ్య వైద్య ఖర్చులు కూడా తడిసి మోపెడవుతుంటాయి. బంధువులు, స్నేహితుల్లో కొందరు ఉత్తి పుణ్యానికి మీకు శత్రువులుగా మారతారు. ఉద్యోగం చికాకు కలిగిస్తుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. సమాజంలో ప్రతిష్ఠ పెరుగుతుంది.

    వృశ్చిక రాశి (Scorpio) (October 24-November 22):
    ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పొదుపు మార్గం అనుసరిస్తారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు అభివృద్ధి సాధిస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. బంధువులతో పేచీలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యం పరవాలేదు.

    ధనస్సు రాశి (Sagittarius) (November 23-December 21):
    ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం, సహకారం లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. అప్పులు తీరుస్తారు. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యాపారులకు ఆర్థికంగా బాగుంటుంది. వృత్తి నిపుణులు రాణిస్తారు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.

    మకర రాశి (Capricorn) (December 22-January 21):
    అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. అయితే, అనవసర ఖర్చులతో అవస్థలు పడతారు. ఉద్యోగంలో అధికారుల ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆధ్యాత్మిక చింతన కొత్త పుంతలు తొక్కుతుంది. వ్యాపారులు లాభాల బాట పడతారు. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది.
    ఇది కూడా చదవండి:



    కుంభ రాశి (Aquarius) (January 22-February 19):
    ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. ఉద్యోగంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడిగల వారితో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులు శ్రమ మీద సత్ఫలితాలు పొందుతారు. కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. వాగ్వాదాలకు, విభేదాలకు అవకాశం ఉంది.

    మీన రాశి (Pisces) (February 20-March 20):
    ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చి చేరతాయి. ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు. తల్లితండ్రుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సంతానం పురోగతి సాధిస్తారు. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac sign

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు