Home /News /astrology /

HOROSCOPE TODAY JUNE 15 2021 HERE IS THE FULL DETAILS OF YOUR ASTROLOGY ZODIAC SIGNS RASI PHALALU AND RASHIFAL NK

Horoscope today June 15, 2021: నేడు ఎవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే...

నేడు ఎవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే...

నేడు ఎవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే...

Horoscope 15 June 2021: ఇవాళ బుధవారం. గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉండే రోజు. మరి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం ఉందో జ్యోతిష పండితుల ద్వారా తెలుసుకుందాం.

    Horoscope Daily: దేశంలో నైరుతీ రుతుపవనాలు వచ్చాయంటే... దాని అర్థం... దేశంలో పాడి పంటలు బాగా వస్తాయని. అది దేశ సంక్షేమానికి దారితీస్తుంది. రైతుల చేతిలో కాస్త డబ్బు వస్తుంది. ప్రజలకు ఆహారం చేరుతుంది. దేశం ఆర్థికంగా, సుభిక్షంగా మారుతుంది. ఇవన్నీ రాశి ఫలాలకు సంబంధించి మంచి పరిణామాలు. పైగా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కూడా తగ్గుతోంది. అందువల్ల రాశి ఫలాలు మంచి సంకేతాలను చూపిస్తాయి. మరి ఇవాళ ఏ రాశి వారికి ఎలా ఉందో, ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, జ్యోతిష పండితులు... ఎవరికి ఎలాంటి పంచాగాన్ని ఇవాళ సూచిస్తున్నారో, వారి మాటల ద్వారానే తెలుసుకుందాం.

    మేష రాశి (Aries) (March 21-April 20):
    కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. దగ్గర బంధువొకరికి సహాయపడతారు. బాగా దగ్గరి బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయపరంగా వ్యాపారులకు బాగానే ఉంటుంది.


    వృషభ రాశి (Taurus) (April 21-May 20):
    ఉద్యోగంలో అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయానికి లోటుండదు. రోజంతా బాగానే గడిచిపోతుంది. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. కానీ, బాగా ఖర్చవుతుంది. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. కొందరు సన్నిహితుల సహాయంతో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. హామీలు ఉండవద్దు.

    మిథున రాశి (Gemini) (May 21-Jun 21):
    ఆదాయానికి, ఆరోగ్యానికి డోకా లేదు. ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. వైద్యపరమైన ఖర్చులు చికాకు కలిగిస్తాయి వ్యాపారంలో బాగా ఒత్తిడి ఉంటుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు.



    కర్కాటక రాశి (Cancer) (Jun 22-July 22):
    ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం ఉంది. వ్యాపారపరంగా ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. కొత్త పనులు చేపడతారు. కుటుంబంలో కొద్దిగా ప్రశాంతత లోపిస్తుంది. ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు తగ్గించుకోవాలి.

    సింహ రాశి (Leo) (July 23-August 23):
    ఉద్యోగంలో చక్కని ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు గట్టెక్కుతారు. పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు.

    కన్య రాశి (Virgo) (August 24-September 23):
    ఉద్యోగంలో సహోద్యోగులు బాగా సహకరిస్తారు. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులకు మీ సలహాలు నచ్చుతాయి. కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అందరికీ మేలు జరిగేపనులు చేస్తారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

    తుల రాశి (Libra) (September 24-October 23):
    ఉద్యోగంలో మీకు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఆర్థికంగా బాగానే ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. కుటుంబపరంగా బాగా ఒత్తిడి, చికాకులు ఉంటాయి. ప్రయాణాల్లో ఇబ్బంది పడతారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు.

    వృశ్చిక రాశి (Scorpio) (October 24-November 22):
    తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడు అన్నట్టుగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. మీ ఆర్థిక స్తోమతకు మించి ఇతరులకు వీలైనంతగా సహాయం చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

    ధనస్సు రాశి (Sagittarius) (November 23-December 21):
    ఉద్యోగంలో అధికారులను మెప్పిస్తారు. అధికార లాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. స్పెక్యులేషన్లో నష్టపోతారు. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. సొంత నిర్ణయాలు ఉత్తమం. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది.

    మకర రాశి (Capricorn) (December 22-January 21):
    ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడి శ్రమకు గురవుతారు. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అదనపు సంపాదన కోసం ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారం నిలకడగా సాగుతుంది. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పరవాలేదు. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.

    కుంభ రాశి (Aquarius) (January 22-February 19):
    ఉద్యోగంలో మీ శ్రమకు, ప్రతిభకు గుర్తింపు ఉంటుంది. తల పెట్టిన పనులు ఎంతో శ్రమ మీద పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల వారికి ఇది ఎంతో అనుకూల సమయం.

    ఇది కూడా చదవండి: Zodiac signs: ఈ రాశుల వారు చాలా యాక్టివ్... వీరు మాత్రం తెలివిగా వ్యవహరిస్తారు

    మీన రాశి (Pisces) (February 20-March 20):
    వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికాంశాలు బాగా మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యక్తిగతంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుంది. మిత్రులు మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac sign

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు