హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Horoscope Today: జులై 29 రాశిఫలాలు.. ఆ రాశివారికి చాలా ప్రమాదం!

Horoscope Today: జులై 29 రాశిఫలాలు.. ఆ రాశివారికి చాలా ప్రమాదం!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జ్యోతిష్యం ప్రకారం.. రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. జులై 29 శుక్రవారం.. మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో పరిశీలిద్దాం. 

జ్యోతిష్యం ప్రకారం.. రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. జులై 29 శుక్రవారం.. మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో పరిశీలిద్దాం.

* మేషం

నిర్దిష్టంగా కొన్ని అంశాలపై సంభాషణ నివారించడానికి మీరు, మీ భాగస్వామి పరస్పరం నిర్ణయించుకొని ఉండవచ్చు. అయితే ఆ విషయాలను తాత్కాలికంగా పక్కకు నెట్టడం కంటే పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇవ్వండి.

లక్కీ సైన్ - ప్రశాంతమైన సంగీతం

* వృషభం

మీరు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లో ఉన్నట్లయితే, అవి మీకు అనుకూలంగా మారి మరింత డెవలప్ కావచ్చు. ఖర్చులు పెరుగుతున్నప్పటికీ, మీరు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

లక్కీ సైన్- వెండి గొలుసు

* మిథునం

మీరు మరో వైపు చూస్తున్నట్లయితే, చేతిలో ఉన్న అవకాశాన్ని కోల్పోవచ్చు. ఒకవేళ మీకు విశ్వాసం లేకపోతే, ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలా వద్దా అని ఆలోచిస్తుంటే, దాన్ని కూడా మీరు కోల్పోవచ్చు. కాబట్టి మీరు చాలా దృఢ నిశ్చయంతో నిర్ణయం తీసుకోవాలి. ఇది మీకోసం మీరు తీసుకున్న అత్యుత్తమ నిర్ణయమని కాలం రుజువు చేస్తుంది.

లక్కీ సైన్ - పుస్తక కవర్

* కర్కాటకం

స్వీట్స్ ఎక్కువగా తినడం వంటి పాత ఆహారపు అలవాట్లను వదిలించుకోవాలని మీరు కోరుకుంటూ ఉండవచ్చు. కానీ విజయవంతం కాలేరు. అయితే వీటన్నింటిని తీవ్రంగా సమీక్షించాల్సిన సమయం ఆసన్నమైంది. అది ఇప్పుడు మీ మార్గంలో జరిగే అవకాశం కనిపిస్తోంది.

లక్కీ సైన్ - గులాబీ క్వార్ట్జ్

* సింహం

మీరు కొంతకాలంగా ఓ విషయంపై అతిగా ఆలోచిస్తున్నారు. అయితే దాని వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆలోచనలను క్రోడికరించి, ఖచ్చితమైన ప్రణాళికను రూపొందించండి, నమ్మదగిన, విశ్వసనీయమైన వారితో చర్చించి ముందుకు సాగండి. దీంతో త్వరలో మీరు స్థిరమైన జోన్‌లోకి ప్రవేశిస్తున్నట్లు కనిపిస్తోంది.

లక్కీ సైన్ - నీలి నీలమణి

* కన్య

మీరు ఏదైనా ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు, ఆలోచనలు చెదిరిపోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. మీ పర్యవేక్షణలో ఉన్న పనిలో చాలా ప్రమాదం ఉండవచ్చు. రానున్న రోజుల్లో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.

లక్కీ సైన్ - సోలో ప్రదర్శన

* తుల

కొన్నిసార్లు మీ అభిప్రాయాలు, మీ ఆలోచనల కంటే దృఢంగా ఉండవచ్చు. మీ కమ్యూనికేషన్‌‌ను మానసికంగా బ్యాలెన్స్ చేయడం మంచిది. పరిపూర్ణత కోసం మీరు స్ట్రగుల్ ఫేస్ చేయవచ్చు. కాబట్టి మీరు మైండ్ సెట్ ఉన్న బిజినెస్ మ్యాన్‌లా ఆలోచించాలి.

లక్కీ సైన్ - పెద్ద కిటికీ

* వృశ్చికం

భావోద్వేగాల కంటే అవసరాలకే ప్రాధాన్యత ఇచ్చే ఈ కాలంలో, మీది భిన్నమైన అనుభవం కావచ్చు. ఏదైనా అంశంలో మీరు చాలా లోతుగా అనుబంధం ఏర్పరుచుకుంటారు. అది ముగింపునకు చేరుకున్నప్పుడు, దాన్ని నుంచి మీరు త్వరగా వేరుపడలేరు. త్వరలో మీ పనికి గుర్తింపు పొందవచ్చు.

లక్కీ సైన్- టెన్నిస్ రాకెట్

* ధనుస్సు

కొంతకాలంగా వెతుకుతున్న విశ్రాంతి క్షణాలను చివరకు మీరు ఎంపిక చేసుకున్న ట్రిప్‌లో పొందుతారు. జీవితం అంటేనే హడావిడి. దీంతో చాలా డిమాండ్ ఉంటుంది. విశ్రాంతి సమయంలో కూడా ఏదైనా అమలు చేయాలనే ఉద్దేశంతో ఉంటే, ముందుగా ప్లాన్ చేసుకోవడం మంచిది.

లక్కీ సైన్ - పక్షుల గుంపు

* మకరం

అన్ని చోట్లా కనిపించిన విషయాలు ఇప్పుడు బ్యాలెన్స్ అవుతున్నాయని, వాటిని అర్థం చేసుకోవడానికి ఎక్కువ మానసిక స్పష్టత ఉందని మీరు గమనిస్తూ ఉండవచ్చు. మీ విధానంలో కొద్దిగా సర్దుబాటు కోసం మీరు కొంత టైమ్ తీసుకోవచ్చు. త్వరలో ఆ అవకాశం కూడా రావచ్చు.

లక్కీ సైన్ - వారసత్వ గడియారం

* కుంభం

మీకు తెలియకుండా చాలా విషయాలు జరిగి ఉండవచ్చు. వాటిని మీ మనసుతో గుర్తించడానికి ముందు, వాస్తవాలను వెలికితీసేందుకు మీ సమయాన్ని వెచ్చించండి. గత కొన్ని రోజులుగా విపరీతమైన ఖర్చుల కారణంగా, మీరు మీ ఖర్చు విధానాన్ని సమీక్షించవలసి రావచ్చు.

లక్కీ సైన్ - గంట

* మీనం

ఈరోజు ఉల్లాసంగా అనిపించవచ్చు. మనసులో చాలా విషయాలు నడుస్తున్నాయి. వాటన్నింటినీ ఒకేసారి పరిష్కరించే మానసిక స్థితిలో మీరు ఉంటారు. అందుకు మీకు కొంత ఓపిక, మార్గదర్శకం రెండు ఒకేసారి అవసరం కావచ్చు.

లక్కీ సైన్ - సెమీ విలువైన రత్నం

Published by:Venkaiah Naidu
First published:

Tags: Astrology, Horoscope Today, Zodiac signs

ఉత్తమ కథలు