Horoscope today July 10, 2021: ఈ రాశుల వారికి తీరనున్న ముఖ్యమైన కోరికలు

Horoscope today July 10, 2021: నేటి రాశిఫలాలు

Horoscope today 10-July-2021: నేడు శనివారం. మరి ఇవాళ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి. ఏ రాశుల వారికి ఎలాంటి అదృష్టం ఉందో, ఎలాంటి సూచనలు ఉన్నాయో తెలుసుకుందాం.

 • Share this:
  Horoscope Daily: జులై 10, 2021 నాడు దినఫలాలు ఏం సూచిస్తున్నాయి? రాశి ఫలాలు అన్ని రోజులూ ఒకేలా ఉండవు. కాలానుగుణంగా... సూర్య గమనాన్ని బట్టీ మారుతూ ఉంటాయి. గ్రహాల బలాబలాలు రాశులపై పడుతుంటాయనీ, అందువల్ల రాశి ఫలాలు ఏరోజు కారోజు మారిపోతూ ఉంటాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు. వివిధ కాలాల్లో వివిధ రాశుల వారికి చక్కటి ఫలితాలు ఉంటాయని అంటున్నారు. మరి ఈ వర్షాకాలంలో ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్న సమయంలో... రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  మేష రాశి (Aries)
  ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంది. వ్యాపారంలో ఊహించని ఇబ్బందులు తప్పకపోవచ్చు. గృహ, వాహన యోగాలున్నాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఒక శుభవార్త శక్తినిస్తుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగు పడుతుంది.

  వృషభ రాశి (Taurus)
  మీ ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపారంలో ఆటంకాలు ఎదురవుతున్నా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. మిత్రులకు చేసే సహాయం వల్ల మేలు జరుగుతుంది. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండండి. కుటుంబ సమస్య పరిష్కారమయ్యే సూచనలున్నాయి.

  మిథున రాశి (Gemini)
  కాలం ప్రతికూలంగా ఉన్నట్టు కనిపించినా ధైర్యంగా పనులు పూర్తి చేయండి. ఉద్యోగంలో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. అనవసర ఖర్చులకు కళ్లెం వేయండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇంట్లో శుభం జరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

  కర్కాటక రాశి (Cancer)
  అనుకున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో మరింత శ్రమ ఎక్కువవుతుంది. పదోన్నతులకు అవకాశం ఉంది. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. ఆర్థికంగా వృద్ధికి అవకాశం ఉంది. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి.

  సింహ రాశి (Leo)
  ప్రతి పనికీ శ్రమ, మానసిక ఒత్తిడి తప్పవు. ఉద్యోగంలో మీరు కోరుకున్నట్టే జరుగుతుంది. వ్యాపారం చాలావరకు నిలకడగా ఉంటుంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. కుటుంబ సమస్యల పరిష్కారంలో అవరోధాలు తొలగుతాయి. నూతన ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు.

  కన్య రాశి (Virgo)
  అనుకున్న పనులు పూర్తవుతాయి. ఇంటా బయటా కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. వ్యాపారంలో మరింత శ్రద్ధ అవసరం. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు బాగా పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం పరవాలేదు.

  తుల రాశి (Libra)
  వ్యాపారంలో కలిసి వస్తుంది. అన్ని విధాలా విశేష లాభాలున్నాయి. ఉద్యోగపరంగా కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. బంధుమిత్రుల వల్ల ప్రయోజనం ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. పోయిన వస్తువులు తిరిగి వస్తాయి. బంధువులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.

  వృశ్చిక రాశి (Scorpio)
  గట్టి పట్టుదలతో పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంది. కుటుంబంలో ఒక కీలక సమస్య నుంచి బయటపడతారు. ఆదాయం పెంచుకోవడానికి అనుకూలమైన కాలం ఇది. కుటుంబపరంగా కాస్తంత మేలు జరుగుతుంది. స్నేహితుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

  ధనస్సు రాశి (Sagittarius)
  అన్ని విధాలా కలసి వచ్చే కాలం. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థికంగా ముందడుగు వేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చక్కని అవకాశాలు అందివస్తాయి. అధికారులను ప్రతిభతో ఆకట్టుకుంటారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. దూర ప్రాంతంలో ఉన్న ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.

  మకర రాశి (Capricorn)
  ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో సమస్యలు ఎదురైనా తెలివిగా పరిష్కరించుకుంటారు. ఒక ముఖ్యమైన కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. మీరు కోరుకున్న చోట ఉద్యోగం లభించే సూచనలున్నాయి. కొందరు స్నేహితులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారు. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం.

  కుంభ రాశి (Aquarius)
  వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ ఫలితాలున్నాయి. ఆదాయం పరవాలేదు కానీ, ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. కొద్దిగా ఆలస్యంగా అయినా మీ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ప్రతిభా పాటవాలతో అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్యం చాలావరకు పరవాలేదు.

  ఇది కూడా చదవండి: Feng Shui Money: ఇంట్లో ఈ మార్పులు చేస్తే... ధనలక్ష్మీ వరిస్తుంది

  మీన రాశి (Pisces)
  ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. వ్యాపారంలో కొంత మంచి జరుగుతుంది. ఇంటా బయటా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌కు వీలుంది. తల పెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. కొత్త ప్రయత్నాలు చేపట్టవచ్చు. మిత్రులకు సహాయం చేస్తారు. అంతా శుభమే జరుగుతుంది. ఆరోగ్యం పరవాలేదు.
  Published by:Krishna Kumar N
  First published: