Home /News /astrology /

HOROSCOPE TODAY JANUARY 9TH 2022 HERE IA ASTROLOGY PREDICTIONS RASHIFAL RASI PHALALU FOR ALL 12 ZODIAC SIGNS PJC GH SK

Daily Horoscope: ఈ రాశుల వారికి అద్భుత అవకాశం.. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోవద్దు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Horoscope Today: నేడు ఆదివారం. మరి రాశి ఫలాల ఆధారంగా ఇవాళ ఎవరికి ఎలా ఉంది. ఏ రాశుల వారికి బాగుంది..? ఏ రాశుల వారికి బాగాలేదు.? జ్యోతిష్య పండితులు ఏం సూచిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుందాం

(పూజ చంద్ర, జ్యోతిష్య నిపుణులు)

రాశి ఫలాలకు అనుగుణంగా ప్రతి రోజు మన దినచర్య ప్రభావితమవుతుంది. రోజుల వారీగా వివిధ అంశాలపై రాశుల ప్రభావం ఉంటుంది. రాశుల ప్రకారం జనవరి 9, ఆదివారం నాడు ఎవరెవరికి ఎలా గడుస్తుందో చూద్దాం.

మేషం (Aries):
పబ్లిక్, ప్రైవేట్ యాక్టివిటీలో హైలైట్‌ అవుతారు. ఒకప్పుడు మిమ్మల్ని అణగదొక్కిన వారు ఇప్పుడు మీకు హాని చేయరని భావించవచ్చు. మీ స్నేహితుడికి మీ మార్గదర్శకత్వం అవసరం. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
లక్కీ సైన్- పసుపు రంగు సంచి

* వృషభం (Taurus) :
మీకు వచ్చే ఇబ్బంది అంత త్వరగా పరిష్కారం కాదని గుర్తుంచుకోండి. అయితే ఓ ప్రత్యేక అవకాశం మీ తలుపు తడుతుంది. త్వరగా నిర్ణయం తీసుకోకపోతే ఆ ఛాన్స్ వేరొకరికి వెళ్లే అవకాశం కూడా ఉంది. కోపం లేదా చికాకుతో సతమతం అవుతారు.
లక్కీ సైన్- చైనా డిన్నర్ సెట్లు

* మిథునరాశి (Gemini):
ఏదైనా చర్చ జరుగుతున్నప్పుడు మౌనంగా గమనిస్తూ.. ఆపై మీ సొంత ఆలోచనలతో సహకారం అందించడం మీ స్వభావం. మీరు మీ పనిని మార్చుకోవాలని చూస్తున్నారు. అయితే సమయం అనుకూలంగా లేదు. ఇంకొన్ని రోజులు ఇలాగే కొనసాగుతుంది. గత కొన్ని నెలలుగా ఒకరు మిమ్మల్ని వెంబడిస్తున్నారు జాగ్రత్త.
లక్కీ సైన్- అమెథిస్ట్ రాయి

శనిదేవుడు ఈ 4 వ్యక్తుల దరిదాపుల్లోకి కూడా వెళ్లడు.. వారిపై వక్రదృష్టి కూడా పడదట..

* కర్కాటకం (Cancer):
ఈ వారంలో ప్రయాణాలు ఉంటాయి. మీరు చేస్తున్న పనికి ఇప్పుడు రెక్కలు వచ్చాయి అనుకోండి. సమయానికి సరిపోయేలా కొత్త షెడ్యూల్‌ని రూపొందించుకోండి. మీ కుటుంబానికి కొంత వరకు దూరంగా ఉండొచ్చు. మానసికంగా దృఢంగా ఉండండి. ఇంట్లో కొత్త పెంపుడు జంతువును పొందడం గురించి ఆలోచిస్తారు.
లక్కీ సైన్- మెరిసే పెయింటింగ్

* సింహం (Leo):
మీ లోపల ఉన్న కొత్త అభిరుచి ఇప్పుడు వికసిస్తుంది. మీరు కూడా దీనిపై మరింత నమ్మకంగా ఉంటారు. మీ సహోద్యోగి మీ జీవితంలో భాగం అవుతారు. ఆ బంధం మరింత బలపడుతుంది. ఏదైనా వ్యసనం మీ ఆరోగ్యానికి భంగం కలిగించే అవకాశం ఉంది. దానిని విడిచిపెట్టేందుకు ప్రయత్నించండి.
లక్కీ సైన్-ఇండోర్ పామ్ ట్రీ

మీరు ఈ తేదీల్లో పుట్టారా? అయితే 2022లో మీకు విపరీతంగా బ్యాంక్ బ్యాలన్స్ జమా..

* కన్య (Virgo):
గత కొన్ని నెలలుగా పగటి కలలు కంటున్నారు. ఇప్పుడు పని చేయాల్సిన సమయం వచ్చింది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం గురించి కొన్ని సూచనలు చేస్తారు. త్వరగానే డబ్బు సంపాదిస్తారు. స్నేహితులు, పని మధ్య సమయాన్ని మేనేజ్ చేసుకోండి.
లక్కీ సైన్ - ఇష్టమైన పాత వాచ్

*తుల (Libra):
జీవితంలో స్మార్ట్ ఎంపికలు.. పాత పద్ధతుల కంటే గొప్పగా అనిపిస్తాయి. కొన్ని కొత్త నియమాల చుట్టూ మీ జీవితాన్ని నిర్మించుకోండి. ఈ వారంలో పెద్దగా మార్పులేమీ లేవు. ఒక వ్యక్తి మీకు స్ఫూర్తిని కలిగించవచ్చు. సమయం నెమ్మదిగా ఉన్నట్లు అనిపించినప్పటికీ అది తాత్కాలికమే అని గుర్తుంచుకోండి.
లక్కీ సైన్-రాగి టంబ్లర్

వేళ్ల ఆకారంతో మీ క్యారెక్టర్ ఏంటో చెప్పొచ్చు.. ఎలానో తెలుసుకోండి..

* వృశ్చికం (Scorpio):
మీ కోరికలను వ్యక్తపరిచే సమయం వచ్చింది. ఆ జాబితాను సిద్ధం చేసుకోండి. మీ ఉద్దేశాలు నెరవేరతాయి. సంబంధాలు బలపడతాయి. ఆర్థిక పెట్టుబడుల గురించి ఆలోచించడానికి ఇది మంచి సమయం.
లక్కీ సైన్-పగిలిన గాజు

* ధనుస్సు (Sagittarius):
ఏకకాలంలో అనేక విషయాలను.. అనగా.. కుటుంబం, పనిని నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది సాధ్యమైనప్పటికీ వెనుకబడిపోతున్నట్లు భావిస్తారు. మీ కింద పనిచేసేవారితో స్పష్టమైన సంభాషణ జరపండి. మీ బృందంతో నేరుగా కమ్యూనికేట్ చేయండి.
లక్కీ సైన్ - రెండు పిచ్చుకలు

సంక్రాంతిరోజు ఏ రాశులవారు ఏ దానం చేయాలో తెలుసుకోండి..

* మకరం (Capricorn) :
అప్పుల వల్ల ఇబ్బంది పడతారు. కొంత ప్రయత్నం చేస్తే మేలైన ఫలితం ఉంటుంది. ఈ సంవత్సరం కొత్త వాహనం కొంటారు. పెండింగ్‌లో ఉన్న పేపర్‌వర్క్‌ను మేనేజ్ చేయాల్సి ఉంటుంది. మీ తల్లి మీకు అత్యంత సన్నిహితురాలు అని తెలుసుకుంటారు.

* కుంభం (Aquarius):
మీ చుట్టూ ఉన్న వ్యక్తులను సంతోషంగా ఉంచడంలో నైపుణ్యం సాధించండి. దానివల్ల మీ నెట్‌వర్క్‌ వృద్ధిచెందుతుంది. లోతైన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నిమగ్నం అవ్వండి. మీరు కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. ఇంట్లో వంట చేయడాన్ని ఆస్వాదిస్తారు.
లక్కీ సైన్-డోర్‌బెల్

* మీనం (Pisces):
మానసికంగా సంతృప్తికరమైన సమయాన్ని ఆస్వాదిస్తారు. అనుకోకుండా ఇతరులతో గడిపిన సమయం బాగుంటుంది. పిల్లలకు మీ నుంచి మంచి సంభాషణను, ప్రమేయాన్ని ఇతరులు కోరుకుంటారు. పాత స్నేహితుడు మీతో ఓ ప్రణాళికను రూపొందించవచ్చు.
లక్కీ సైన్- పసుపు రంగు ఆకులు
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Astrology, Horoscope, Horoscope Today, Rashifal, Rasi phalalu

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు