Horoscope Today: అక్టోబరు 2 రాశి ఫలాలు.. ఎవరికి మంచి? ఎవరికి చెడు?

Horoscope Today | 12 రాశుల వారికి ఈ రోజు శుక్రవారం (అక్టోబరు 2, 2020) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

news18-telugu
Updated: October 2, 2020, 6:31 AM IST
Horoscope Today: అక్టోబరు 2 రాశి ఫలాలు.. ఎవరికి మంచి? ఎవరికి చెడు?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
శుక్రవారం | 02 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | పాడ్యమి: రా.03-02 వరకు తదుపరి విదియ | రేవతి నక్షత్రం పూర్తిగా | వర్జ్యం: సా.06-55 నుంచి రా.08-41వరకు | అమృత ఘడియలు: తె.05-32నుంచి 06-36 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-15 నుంచి 09-02 వరకు తిరిగి మ. 12-09 నుంచి 12.56 వరకు |

రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు

సూర్యోదయం: ఉ.5-54
సూర్యాస్తమయం: సా.5-47


2 అక్టోబర్‌ 2020 దినఫలాలు:

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులతో పరిచయం ఏర్పడుతుంది. శుభాకార్యాయాల్లో పాల్గొంటారు. ఆలయాలకు వెళతారు. సహచరులు, సన్నిహితులతో వాదనకు దిగవద్దు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.

వృషభం (క త్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. తలచిన పనులు నెరవేరుతాయి. చాలాకాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశముంది. తీర్థయాత్రలకు ప్రయత్నాలు చేస్తుంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. డబ్బు నష్టపోయే అవకాశం ఉంది.


మిధునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

సన్నిహితుతో విందు వినోదాల్లో పాల్గొంటారు. చిన్నప్పటి స్నేహితులు పలకరిస్తారు. శుభకార్యం విషయంలో జీవిత భాగస్వామితో చర్చిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగం విషయంలో అనుకూల సమాచారం అందుతుంది. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.


కర్కాటకం పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఈ రాశి వారికి సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. బంధువులు, స్నేహితులు సహాయపడతారు. ఆర్థిక లావాదేవీల్లో మోసపోయే ప్రమాదం ఉంది. విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.


సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

పెళ్లి సంబంధాలకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. బంధుమిత్రులతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగం విషయంలో ఆందోళన చెందుతారు. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వొద్దు. తీసుకోవద్దు. భార్యాపిల్లలతో సరదాగా గడుపుతారు. ఎవరితోనూ వాదనకు దిగవద్దు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశముంది.


కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

సంతానంలో ఒకరికి వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. తిప్పట ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూంగా ఉంది. అవివాహితులకు పెళ్లి గంట మోగుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. డబ్బు నష్టం జరగవచ్చు.


తులా (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

అన్ని విధాలా సమయం అనుకూంగా ఉంది. శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. తీర్థయాత్రకు ప్లాన్‌ వేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారం లభిస్తుంది. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. తిప్పట ఎక్కువగా ఉంటుంది. సన్నిహితుతో వివాదాలకు దూరంగా ఉండండి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఆదాయానికి కొరత లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి తరఫు బంధువు మిమ్మల్ని పకరించే అవకాశం ఉంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలున్నాయి. ఎవరికీ డబ్బు ఇవ్వొద్దు. ఆరోగ్యం జాగ్రత్త.


ధనుస్సు (మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1)

త్వరలో ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. భార్య తరఫు బంధువు ఇంటికి వచ్చే సూచనలున్నాయి.
కొత్తవారు పరిచయమవుతారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది.



మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

ఏలినాటి శని కారణంగా పనులు ఆలస్యం అవుతుంటాయి. తిప్పట ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధాలు కుదరవచ్చు. సమీప
బంధువుకు సంబంధించిన ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది.


కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి, మంచి సంస్థలో చేరతారు. ఆదాయం పెరుగుతుంది. రెండవ ఆదాయ మార్గం గురించి స్నేహితులతో చర్చిస్తారు. చాలా వరకు అప్పు తీరుస్తారు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. భార్యాపిల్లలతో సరదాగా గడుపుతారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త.


మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

విదేశీ సంబంధ సంస్థలో మంచి ఉద్యోగం భిస్తుంది. భార్యాపిల్లలతో విందు వినోదాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఎవరితోనూ వాదనకు దిగవద్దు. విద్యార్థులకు ప్రశంసలు లభిస్తాయి.
Published by: Shiva Kumar Addula
First published: October 2, 2020, 6:27 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading