Horoscope Today: అక్టోబరు 1 రాశి ఫలాలు.. ఎవరికి మంచి? ఎవరికి చెడు?

Horoscope Today | 12 రాశుల వారికి ఈ రోజు గురువారం (అక్టోబరు 1, 2020) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

news18-telugu
Updated: October 1, 2020, 11:49 AM IST
Horoscope Today: అక్టోబరు 1 రాశి ఫలాలు.. ఎవరికి మంచి? ఎవరికి చెడు?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
1 అక్టోబర్‌ 2020 దిన ఫలాలు వివరాలు:

మేషం (అశ్విని 4, భరణి 4, కృతిక 1):

ఈ రోజు గ్రహస్థితి అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువు, స్నహితులు పలకరిస్తారు. దూర ప్రాంతంలోఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుంది.


వృషభం (కృ త్తిక 2,3,4, రోహిణి 4, మృగశిర 1,2)

శుభకార్యాలకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. బంధుమిత్రులతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగం విషయంలో ఆందోళన చెందుతారు. అప్పు తీసుకోవడానికి, ఇవ్వడానికి ఇది సమయం కాదు. భార్యా పిల్లలతో కాలక్షేపం చేస్తారు. ఎవ్వరితోనూ వాదనకు దిగొద్దు. ఆస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర 4, పునర్వసు 1,2,3)

వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. భార్య తరఫు బంధువులు ఇంటికి వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రయాణం చేసే అవకాశముంది. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది.కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 4, ఆశ్లేష 4)

ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంటుంది. పలుకుబడి ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యాల్లో పాల్గొంటారు. ఆలయాలకు వెళతారు. జీవిత భాగస్వామితో వాదనకు దిగవద్దు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్ధులు పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. డబ్బును నష్టపోతారు.

సింహం (మఖ 4, పుబ్బ 4, ఉత్తర 1)

గ్రహాలు అనుకూలంగా ఉన్నాయ. తలచిన పనులు నెరవేరుతాయి. చాలా కాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశముంది. తీర్థయాత్రకు ప్రణాళిక తయారు చేసుకుంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. శివార్చన చేయడం మంచింది.


కన్య (ఉత్తర 2,3,4, హస్త 4, చిత్త 1,2)

బంధుమిత్రుతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పాత స్నహితులు పలకరిస్తారు. శుభకార్యాల విషయంలో జీవిత భాగస్వామితో చర్చిస్తారు. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగం విషయంలో అనుకున్న సమాచారం అందుతుంది. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశముంది.


తులా (చిత్త 3,4, స్వాతి 4, విశాఖ 1,2,3)

ఇళ్లు లేక స్థలం కొనుగోలు విషయంలో ఒప్పందం కుదర్చుకుంటారు. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. షాపింగ్‌ చేస్తారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధాు కుదరవచ్చు. సమీప బంధువుకు సంబంధించిన ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ 4, జ్యేష్ఠ 4)

వృత్తి ఉద్యోగాలకు సంబంధించి విదేశాల నుంచి అనుకూల సమాచారం అందుతుంది. భార్యాపిల్లలతో విందు వినోదాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితుల నుంచి
సహాయ సహకారాలు లభిస్తాయి. ఎవరితోనూ వాదనలు వద్దు.

ధనుస్సు (మూ 4, పూర్వాషాఢ 4, ఉత్తరాషాఢ 1)

శుభకార్యం తలపెడతారు. ఏలినాటి శని కారణంగా ప్రతి పనీ ఆలస్యమవుతుంది. విద్యార్థుకు అనుకూంలగా
ఉంది. అవివాహితులకు పెళ్లి గంట మోగే సూచనలున్నాయి. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. డబ్బు నష్టం జరగవచ్చు. ఆరోగ్యం జాగ్రత్త.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం 4, ధనిష్ఠ 1,2)

శ్రమ మీద పను పూర్తవుతాయి. శుభకార్యం జరిగే సూచనలున్నాయి. తీర్థయాత్రకు ప్లాన్‌ వేస్తారు. బంధుమిత్రు సహాయ సహకారం ఉంటుంది. విద్యార్థులు.. ఉపాధ్యాయు లేదా అధ్యాపకుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. దూరంగా ఉండండి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం 4, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగానికి సంబంధించి అనుకూమైన సమాచారం అందుతుంది. రెండవ ఆదాయ మార్గం గురించి స్నహితుతో చర్చిస్తారు. అప్పు తీరుస్తారు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన
కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. శివార్చన మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తం భాద్ర 4, రేవతి 4)

ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. సంతానం నుంచి శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి తరఫు బంధువు మిమ్మల్ని పకరించే అవకాశం ఉంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ఎవ్వరికీ డబ్బులు ఇవ్వొద్దు.
Published by: Shiva Kumar Addula
First published: October 1, 2020, 11:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading