Home /News /astrology /

HOROSCOPE TODAY HERE IS TELUGU ASTROLOGY RASI PHALALU RASHI FAL KNOW YOUR ZODIAC SIGN DETAILS SK

Horocope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు జాగ్రత్త.. ఇంటా బయటా ఒత్తిడి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Horoscope Today: నేడు బుధవారం.. ఇవాళ ఏయే రాశుల వారికి బాగుంది? ఏయే రాశుల వారికి బాగాలేదు.? జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారు? ఎలాంటి జాగ్రత్తలు సూచిస్తున్నారు? ఈ వారం రాశి ఫలాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

  కాలజ్ఞానం

  అక్టోబరు 20, 2021

  దినఫలాలు

  మేష రాశి (Aries):
  వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తోంది. ఉద్యోగంలో మరింతగా శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఇంటి సమస్యల పరిష్కారంలో సొంత నిర్ణయాలతో పాటు కుటుంబ సభ్యుల సలహాలు కూడా తీసుకోండి. ఆరోగ్యం పరవాలేదు. ఆదాయం నిలకడగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఒకకొలిక్కి వస్తాయి.

  వృషభ రాశి (Taurus):
  తలచిన పనులు వెంటనే పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. వాహన సౌఖ్యం ఉంది. బంధుమిత్రుల వల్ల లాభపడతారు. ఇప్పుడు మంచి పనులు తలపెడితే సత్ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం కొంతమేరకు మెరుగుపడుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఎవరికీ హమీలు ఉండొద్దు.

  లాఫింగ్‌ బుద్ధుడి ఈ రూపం.. మీ అదృష్టాన్ని మార్చగలదు!

  మిథున రాశి (Gemini):
  ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ఓర్పుతో వ్యవహరిస్తే మంచే జరుగుతుంది. ఎవరి విమర్శలూ పట్టించుకోవద్దు. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యుల సలహాలు కూడా పాటించండి. పరిచస్థులలో పెళ్లీ సంబంధం కుదురుతుంది. ఆరోగ్యానికి ఢోకా లేదు.

  కర్కాటక రాశి (Cancer):
  ఆర్థికంగా బలం పుంజుకుంటారు. రుణ సమస్యలు కొంత వరకు పరిష్కారం అవుతాయి. ఇబ్బందుల్లో ఉన్న బంధువులను ఆదుకుంటారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా శుభ యోగ౦ ఉంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. సమాజంలో గుర్తింవు లభిస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

  చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఈ వస్తువు మీ దగ్గర ఉంటే..!

  సింహ రాశి (Leo):
  ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో సతృలితాలనిస్తాయి. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది ఆరోగ్యం పరవాలేదు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. అదృష్ట యోగంపట్టబోతోంది. అవసరాలకు తగ్గట్టుగా డబ్బు చేతికి అందుతుంది. తలపెట్టిన పనులు ఒక్కటొక్కటిగా పూర్తవుతాయి.

  కన్య రాశి (Virgo):
  ఉద్యోగపరంగా ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో మరింతగా శ్రద్ధ పెంచాలి. ఆదాయం నిల కడగా ఉంటుంది. అనవసర ఖర్చులు అదుపు చేసుకోవాలి. కొందరికి మీ ద్వారా మేలు జరుగుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త.

  'ఉత్తమ కౌగిలింత' ఏ రాశివారిదో తెలుసా?

  తుల రాశి (Libra):
  ఉద్యోగంలో చక్కని ఫలితాలు సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. వివాహ ప్రయత్నాలకు అనుకూల సమయం. ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యుల సలహాలు కూడా పాటించండి. ఆరోగ్యం పరవాలేదు. సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

  వృశ్చిక రాశి (Scorpio):
  ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు గడించే అవకాశం ఉ౦ది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవసరాలకు సరిపడ డబ్బు అందుతుంది. కుటుంబ నమన్య పరిష్కారమవుతుంది. సొంత నిర్ణయాలతో థైర్యంగా ముందడుగు వేయండి. ఆరోగ్యం జాగ్రత్త.

  ధనస్సు రాశి (Sagittarius):
  ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా జాగ్రత్త అవసరం. బంధుమిత్రులను౦చి సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణ లాభం ఉంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. తలపెట్టిన పనులు పునరావృతమవుతాయి.

  పడుకునే ముందు అమ్మాయిలు సాల్ట్‌వాటర్‌ తాగితే..!

  మకర రాశి (Capricorn):
  ఉద్యోగంలో అభివృద్ధి ఉంది. ఆర్థికంగా లాభదాయకంగా ఉంది. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దూర ప్రాంతం నుంచి శుభవార్త వింటారు. అనుకున్న పనులు నెరవేరతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. కోర్టు కేసులో నెగ్గుతారు. ఆకస్మిక ప్రయాణాలన్నాయి.

  కుంభ రాశి (Aquarius):
  ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు బాగా పెరుగుతాయి. వాదనలకు దూరంగా ఉండండి. ఏలిన్నాటి శని కారణంగా తరచూ అనారోగ్యాలు తప్పకపోవచ్చు. కొంతవరకు శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం పరవాలేదు. మీకు విశ్రాంతి అవసరం.

  ఆర్కిటెక్చరల్‌ కిచెన్, బెడ్‌రూం ఇటువైపే ఉండాలి!

  మీన రాశి (Pisces):
  ఉద్యోగంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ధన లాభం ఉన్నా ఖర్చులు కూడా పెరుగుతాయి. తిప్పట ఎక్కువగా ఉంటుంది. తలచిన పనులు పూర్తవుతాయి. కుటుంబం ద్వారా లబ్ధి పొందుతారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Astrology, Horoscope, Horoscope Today, Rashifal, Rasi phalalu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు