• HOME
 • »
 • NEWS
 • »
 • ASTROLOGY
 • »
 • HOROSCOPE TODAY HERE IS ASTROLOGY PREDICTIONS FOR 6TH MAY 2021 THESE ZODIAC SIGNS WILL HERE GOOD NEWS SK

Horoscope Today: మే 6 రాశిఫలాలు.. ఈ రాశుల వారు నేడు శుభవార్త వింటారు

Horoscope Today: మే 6 రాశిఫలాలు.. ఈ రాశుల వారు నేడు శుభవార్త వింటారు

ప్రతీకాత్మక చిత్రం

Horoscope today: నేడు మే 6, 2021 (గురువారం)`12 రాశులు వారికి ఎలా ఉందో రాశి ఫలాలు చూద్దాం.

 • Share this:
  కాలజ్ఞానం

  దినఫలాలు

  మే 6, 2021

  మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

  ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు కానీ, ఖర్చులు ఎక్కువవుతాయి. సన్నిహితులు మోసం చేసే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నం కలిసి వస్తుంది. దూరప్రాంతంలో ఉన్న సంతానం నుంచి సానుకూల వార్త వింటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది.  వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

  ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ, మిత్రులకు సహాయం చేస్తారు. ఆదాయంలో పెద్దగా పెరుగుదల ఉండదు. ఉద్యోగంలో చికాకు
  ఎదురవుతాయి. ఎవరికీ హామీగా ఉండవద్దు. భార్యాపిల్లలతో కాలక్షేపం చేస్తారు. ఎవరితోనూ వాదనకు దిగవద్దు. విద్యార్థులు మరింతగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.  మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

  ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వివాహ సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. ప్రయాణ
  సూచనులున్నాయి. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. కోర్టు కేసులో గెలిచే సూచనలున్నాయి. ప్రేమ వ్యవహారం ఫలిస్తుంది.

  కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

  ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. రుణ బాధ నుంచి బయటపడతారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.  సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

  ఆదాయం నిలకడగా ఉంటుంది. తలచిన పనులు నెరవేరుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అనారోగ్యం నుంచి కోలుకుంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు.  కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

  ఉద్యోగం విషయంలో అనుకూల సమాచారం అందుతుంది. ఆదాయం పెంచుకునే మార్గాలు ఆలోచిస్తారు. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. చిన్ననాటి స్నేహితులు, వెనుకటి సహోద్యోగులు పలకరిస్తారు. సంతానం నుంచి కొన్ని మంచి కబుర్లు వింటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.  తులా (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

  ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఆస్తులు పెంచుకునే ఆలోచన చేస్తారు. మీకుం కావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారులు లాభార్జన చేస్తారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధం కుదరవచ్చు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. హామీగా ఉండవద్దు.  వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

  మంచి సంస్థ నుంచి ఆఫర్‌ వస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. భార్యాపిల్లలతో విందు వినోదాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువవుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ జీవితం బాగుంటుంది.  ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

  ఈ రోజంతా సంతోషంగా, ప్రశాంతంగా గడిచిపోతుంది. ఉద్యోగ స్థానంలో వాతావరణం అనుకూంగా ఉంటుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. వివాహ సంబంధం కుదురుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. డబ్బు నీళ్లలా ఖర్చవుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.  మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

  ఆదాయానికి లోటు ఉండదు కానీ, ఆరోగ్యం సంగతే చూసుకోవాలి. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచలున్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులకు బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. కోర్టు కేసు మళ్లీ వాయిదా పడుతుంది.  కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

  సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగంలో మార్పు ఉంటుంది. స్నేహితులను ఆర్థికంగా ఆదుకుంటారు. వ్యాపారస్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. రుణ బాధ తగ్గించుకుంటారు. సైన్స్‌, ఐ.టి విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.


  మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

  ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సమావేశాల్లో పాల్గొంటారు. సంతానం నుంచి శుభవార్త వింటారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. ఎవరికీ హామీగా ఉండవద్దు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కోర్టు కేసుల్లో నెగ్గుతారు.
  Published by:Shiva Kumar Addula
  First published: