హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Horoscope Today: జులై 15 రాశి ఫలాలు..అన్ని శక్తులు మీకు అనుకూలం

Horoscope Today: జులై 15 రాశి ఫలాలు..అన్ని శక్తులు మీకు అనుకూలం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Horoscope Today : నేడు అంటే జులై 15న కొన్ని రాశుల వారు ఒక మంచి విజయం సాధించవచ్చు. ఒక రాశి వారిని ఒక విద్యా అవకాశం వరించవచ్చు. ఒక వార్తతో కొందరు తమ రోజును చాలా సంతోషంగా గడిపే అవకాశం ఉంది. ఇంకా ఈ రోజు 12 రాశుల వారికి ఎలా గడుస్తుందో (Astrology Predictions) ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...

Horoscope Today: నేడు అంటే జులై 15న కొన్ని రాశుల వారు ఒక మంచి విజయం సాధించవచ్చు. ఒక రాశి వారిని ఒక విద్యా అవకాశం వరించవచ్చు. ఒక వార్తతో కొందరు తమ రోజును చాలా సంతోషంగా గడిపే అవకాశం ఉంది. ఇంకా ఈ రోజు 12 రాశుల వారికి ఎలా గడుస్తుందో (Astrology Predictions) ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి

మీరు మీ భావాలను వ్యక్తపరచడానికి ఇది ఒక మంచి రోజు. ఇవాళ మీరు మీ ఆలోచనలను ఒక జర్నల్ లేదా నోట్ బుక్‌లో రాయడం ప్రారంభించవచ్చు. అది త్వరలో మీ అలవాటుగా మారవచ్చు. మీరు మీ ఆఫీస్‌లో గర్వించదగిన ఒక విజయం సాధించొచ్చు. ఈ రోజు కొత్తగా ఒకరు పరిచయం అవుతారు.

లక్కీ సైన్ - ఒక ముత్యం

వృషభరాశి

తెలియని కారణాల వల్ల మీ వ్యక్తిగత జీవితంలో ఎదుగుదలకు ఆటంకాలు ఎదురు కావచ్చు. బాగా అన్వేషిస్తే ఆశ్చర్యపరిచే ఫలితాలు కనిపిస్తాయి. వివేకంతో తీసుకునే నిర్ణయం మీరు ముందుకు సాగడానికి సహాయపడవచ్చు.

లక్కీ సైన్ - నీలం నీలమణి

మిథునరాశి

ఒక విద్యా అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రావచ్చు. ఈ విద్యా అవకాశానికి మీ జ్ఞానం లేదా స్కిల్ సెట్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి ఒక సంబంధం ఉంటుంది. మిమ్మల్ని నిత్యం ఆరాధించే వ్యక్తి ఉంటే.. వారు ప్రస్తుతానికి మీకు దూరంగా ఉండడానికి ఇష్టపడవచ్చు.

లక్కీ సైన్ - ఒక నల్లని టూర్మాలిన్

కర్కాటకరాశి

ఆఫీస్ నుంచి అందే ఒక అనౌన్స్‌మెంట్ మీ రోజును చాలా సంతోషకరంగా మార్చొచ్చు. నేడు మీలో సరికొత్త ఉత్సాహాన్ని నింపవచ్చు. మీ విషయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మీ కుటుంబం మీ సలహాలను పరిగణించకపోవచ్చు.

లక్కీ సైన్- ఒక లాంప్‌షేడ్

సింహరాశి

ఒక ఫ్యామిలీ ఈవెంట్ కోసం మీరు పర్ఫెక్ట్‌గా చేసే ప్లాన్ వల్ల మీరు ప్రశంసలు అందుకోవచ్చు. రోజులో మీ ప్రాధాన్యతలను సరిగ్గా ఉంచడం ద్వారా మీ సమయాన్ని ఆదా చేసుకోవడం మంచిది. మీరు ఒక దినచర్యను అనుసరిస్తూ మంచి పని చేస్తున్నారు.

లక్కీ సైన్ - లేబుల్ చేసిన కూజా

కన్యారాశి

వర్క్‌లో కొన్ని సీరియస్ ప్రాబ్లమ్స్‌లో మీ శ్రద్ధ అవసరం కావచ్చు. రోజంతా వెంటాడే అలసట, చికాకుని వదిలించేందుకు కంటినిండా నిద్రపోవటానికి ప్రయత్నించాలి. కొన్ని అనవసరమైన పనులకు దూరంగా ఉండటం మంచిది. ఒక స్నేహితుడు అనుకోకుండా ఏదైనా ప్లాన్ చేయవచ్చు.

లక్కీ సైన్ - ఒక తోట

తులారాశి

మీ సన్నిహితులు, ప్రియమైన వారికి మీ నుంచి ఎక్కువ శ్రద్ధ అవసరం కావచ్చు. అపార్థాలు ఏమైనా ఉంటే వాటిని ఇప్పుడే క్లియర్ చేసుకోవాలి. సృజనాత్మకంగా పురోగతి సాధించడానికి మీ మనస్సులో ఎనర్జీని మళ్లీ నింపాలి. మీకు అవకాశం వచ్చినప్పుడు చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకోవడం మంచిది.

లక్కీ సైన్ - ఒక ఉడుత

వృశ్చికరాశి

మీ చుట్టూ ఏం జరుగుతుందో ఇతరులు అర్థం చేసుకోవడానికి వీలుగా అన్ని విషయాలను సరళంగా ఉంచాలి. మీరు కొత్త రొటీన్‌కు అలవాటు పడటానికి ప్రయత్నిస్తుంటే బాధ కలిగించే పరిస్థితులను ఎదుర్కోవచ్చు. మీరు మీ అధికారుల నుంచి అభిమానాన్ని పొందే అవకాశం ఉంది.

లక్కీ సైన్ - ఒక చిలుక

ధనుస్సురాశి

మీ జీవితంలో కొత్త, ఆసక్తికరమైన వ్యక్తి కేవలం కొంత కాలం వరకే ఉండవచ్చు. మీ కుటుంబ సభ్యులకు మీ శ్రద్ధ అవసరం కావచ్చు. కొంతమంది బయటి వ్యక్తుల జోక్యం మిమ్మల్ని బాగా చికాకు పెట్టవచ్చు.

లక్కీ సైన్ - ఎరుపు రంగు దుస్తులు

మకరరాశి

అన్ని శక్తులు మీకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఈ రోజును పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. మీలోని వినూత్న ఆలోచనలు ముందుకు సాగుతూ తక్షణ విజయం వైపు కదులుతాయి. ముఖ్యంగా ఈ రోజు మీరు సరైన వ్యక్తులను కలవచ్చు.

లక్కీ సైన్ - పసుపు నీలమణి

కుంభరాశి

మీరు ఎవరికైనా కాల్ చేయడం వాయిదా వేస్తూ ఉంటే, వారికి కాల్ చేయడానికి ఇదే మంచి రోజు. తేలికపాటి వర్కౌట్ చేయడం అవసరంగా మారవచ్చు. మీరు పరిశీలిస్తున్న ఒక వ్యాపార ప్రతిపాదన ప్రయోజనకరంగా మారవచ్చు.

లక్కీ సైన్ - ఆకుపచ్చ అవెంచురిన్ జెమ్‌స్టోన్

మీనరాశి

ఈ రోజు మీరు అన్ని డెడ్ లైన్స్ పూర్తి చేస్తూ చాలా బిజీగా గడుపుతారు. మీరు నేడు బయటికి వెళ్లే అవకాశం ఉంది. పని ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ పనిలో మీరు తగిన సహాయం పొందుతారు.

లక్కీ సైన్ - ఎమెరాల్డ్

Published by:Venkaiah Naidu
First published:

Tags: Astrology, Horoscope, Horoscope Today, Zodiac signs

ఉత్తమ కథలు