Home /News /astrology /

Horoscope Today: డిసెంబరు1 రాశి ఫలాలు.. వీరికి చాలా బాగుంది.. అనుకోని విధంగా డబ్బు వస్తుంది

Horoscope Today: డిసెంబరు1 రాశి ఫలాలు.. వీరికి చాలా బాగుంది.. అనుకోని విధంగా డబ్బు వస్తుంది

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Today Horoscope: నేడు బుధవారం (డిసెంబర్ 01).. ఇవాళ పలు రాశుల వారికి అద్భుతంగా ఉంది. రాదనుకున్న డబ్బు అనుకోని విధంగా చేతికి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే సూచలున్నాయి. మరికొందరికి మాత్రం ఇబ్బందులు కలిగే అవకాశముంది. కొందరి వివాహ బంధం వెనక్కి వెళ్తుంది. మరి మేషం నుంచి మీనం వరకు.. ఇవాళ ఎవరికి ఎలా ఉందో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  కాలజ్ఞానం

  డిసెంబరు 1, 2021 రాశి ఫలాలు

  దిన ఫలాలు

  మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్ మీద బదిలీ చేసే అవకాశం ఉంది. కుటుంబంతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు ప్రశంసలు లభిస్తాయి. స్నేహితురాలితో పెళ్లి ప్రస్తావన తెస్తారు.

  వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఉద్యోగం సాఫీగానే సాగిపోతుంది. వివాహ ప్రయత్నం సఫలమవుతుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. సానుకూల సమాచారం అందుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సహ చరులతో వాదనలకు దిగవద్దు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారం ఉత్సాహంగా సాగిపోతుంది.

  మిథునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఉద్యోగంలో అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. తలచిన పనులు సంతృప్తికరంగా నెరవేరుతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు కుదుటపడు తుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. స్నేహితురాలితో సరదాగా గడుపుతారు.

  కర్కాటకం (Cancer)(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఒక శుభకార్యం విషయంలో జీవిత భాగస్వామితో చర్చిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. ఎవరికీ ఏ విషయంలోనూ హామీలు ఉండొద్దు. ఆరోగ్యం జాగ్రత్త. విద్యార్థులు శ్రమ మీద విజయాలు సాధిస్తారు. ప్రేమలో ఇబ్బంది పడతారు.

  సింహం (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1) ఉద్యోగంలో ప్రమోషన్ గానీ, ఇంక్రిమెంట్ గానీ లభించే అవకాశం ఉంది. సమయం అన్నివిధాలా అ నుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధువులు వీలైనంతగా సహాయపడతారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితురాలితో షికార్లు చేస్తారు.

  కన్య (Virgo)(ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఉద్యోగంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. అనుకున్న పెళ్లి సంబంధం వాయిదా పడుతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు. స్నేహితురాలితో కొద్దిగా విభేదాలు తలెత్తుతాయి.

  తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. సహుద్యోగుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సంతానంలో ఒకరికి వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. విద్యార్థులకు బాగా అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం కావచ్చు. స్నేహితురాలితో ఆనందంగా గడుస్తుంది.

  వృశ్చికం (Scorpio)(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) ఉద్యోగంలో సహుద్యోగులు బాగా సహకరిస్తారు. జీవిత భాగస్వామితో వాదనలకు దిగకండి. త్వరలో శుభకార్యం జరిగే సూచనలున్నాయి. బంధుమిత్రులు ఆర్థికంగా అండదండలనందిస్తారు. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. స్నేహితురాలు మీతో సరదాగా కాలక్షేపం చేస్తుంది.

  ధనస్సు (Sagittarius)(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనలో ఎక్కువ సమయం గడుపుతారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి తరఫు బంధువుల రాకపోకలు ఉంటాయి. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. స్నేహితురాలు బిజీగా ఉండి కలవ లేకపోవచ్చు.

  మకరం (Capricorn)(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. బంధువులొకరు మీ సలహా తీసుకుంటారు. కొత్తవారు పరి చయమవుతారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. స్నేహితురాలితో చెట్టపట్టాలేసుకుని తిరుగుతారు.

  కుంభం (Aquarius)(ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గుతుంది. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. పనులు ఆలస్యం అవుతుంటాయి. తిప్పట ఎక్కువగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధం వెనక్కు వెళ్తుంది. స్నేహితురాలి మీద మితిమీరిన ఖర్చు అవుతుంది.

  మీనం (Pisces)(పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4) ఉద్యోగంలో అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. చాలావరకు అప్పులు తీరుస్తారు. కొద్దిపాటి శ్రమతో పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపు తారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. స్నేహితురాలితో వాదనలకు దిగే అవకాశం ఉంది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Astrology, Horoscope, Horoscope Today, Rashifal, Rasi phalalu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు