• HOME
  • »
  • NEWS
  • »
  • ASTROLOGY
  • »
  • HOROSCOPE TODAY ASTROLOGY PREDICTIONS ON 22ND APRIL ALER FOR THESE ZODIAC SIGNS MARRIAGE WILL BE POSTPONED SK

Horoscope Today: నేటి రాశి ఫలాలు.. వీరి పెళ్లి సంబంధం వాయిదా పడుతుంది..

Horoscope Today: నేటి రాశి ఫలాలు.. వీరి పెళ్లి సంబంధం వాయిదా పడుతుంది..

ప్రతీకాత్మకచిత్రం

Horoscope: ఏప్రిల్ 22 (గురువారం) రాశి ఫలాలు. నేడు 12 రాశుల వారికి ఎలా ఉంది? అంతా సవ్యంగానే ఉంటుందా? లేదంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాశి ఫలాల ఆధారంగా ఈ రోజు మీకు ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి.

  • Share this:
    కాలజ్ఞానం

    దినఫలాలు-ఏప్రిల్‌ 22, 2021

    మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

    ఉద్యోగం సాఫీగానే సాగిపోతుంది. వివాహ ప్రయత్నం సఫలమవుతుంది. రాజకీయ నాయకుతో పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సహచరులతో వాదనకు దిగవద్దు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారం ఉత్సాహంగా సాగిపోతుంది.

    వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

    ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు, ప్రోత్సాహం అందుకుంటారు. తలచిన పనులు నెరవేరుతాయి. చాలాకాంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించవచ్చు. తీర్థయాత్రలకు ప్రయత్నాలు చేసుకుంటారు. విదేశాల్లో ఉన్నసంతానం నుంచి శుభవార్త వింటారు. స్నేహితురాలితో సరదాగా గడుపుతారు.

    మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

    ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. శుభ కార్యాల విషయంలో జీవిత భాగస్వామితో చర్చిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఎవరికీ హామీగా ఉండవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. విద్యార్థులు శ్రమ మీద విజయాలు సాధిస్తారు. స్నేహితురాలు ముఖం చాటేస్తుంది.

    కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

    ఉద్యోగంలో ప్రమోషన్‌ గానీ, ఇంక్రిమెంట్‌ గానీ లభించే అవకాశం ఉంది. సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధువులు సహాయపడతారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితురాలితో షికార్లు చేస్తారు.

    సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

    ఉద్యోగంలో మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. అనుకున్న పెళ్లి సంబంధం వాయిదా పడుతుంది. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వొద్దు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు. స్నేహితురాలితో అనుకోని ఇబ్బందులు తలెత్తుతాయి.

    కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

    ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సంతానంలో ఒకరికి వివాహ ప్రయత్నాలను ప్రారంభిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం కావచ్చు. స్నేహితురాలితో ఆనందంగా గడుస్తుంది.

    తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

    ఉద్యోగంలో సహోద్యోగులు బాగా సహకరిస్తారు. జీవిత భాగస్వామితో వాదనకు దిగకండి. త్వరలో శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి.
    బంధుమిత్రు అండదండలనందిస్తారు. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. స్నేహితురాలు మీతో
    సరదాగా కాలక్షేపం చేస్తుంది.

    వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

    ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి తరఫు బంధువు రాకపోకలు ఉంటాయి. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. స్నేహితులు బిజీగా ఉండి మిమ్మల్ని కలవలేకపోవచ్చు.

    ధనుస్సు (మూల, పూర్వాషాడ, ఉత్తరాషాఢ 1)

    అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. బంధువులొకరు మీ సలహా తీసుకుంటారు. కొత్తవారు పరిచయమవుతారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. స్నేహితురాలితో చెట్టపట్టాలేసుకుని తిరుగుతారు.

    మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

    ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. పనులు ఆలస్యం అవుతుంటాయి. తిప్పట ఎక్కువగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధం వెనక్కు వెడుతుంది. స్నేహితురాలి మీద మితిమీరిన ఖర్చు అవుతుంది.

    కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

    ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. చాలావరకు అప్పు తీరుస్తారు. కొద్దిపాటి శ్రమ మీద పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. స్నేహితురాలితో వాదనకు దిగే అవకాశం ఉంది.

    మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

    అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్‌ మీద బదిలీ చేసే అవకాశం ఉంది. కుటుంబంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు ప్రశంసలు లభిస్తాయి. స్నేహితురాలితో పెళ్లి ప్రస్తావన తెస్తారు.
    Published by:Shiva Kumar Addula
    First published: