Home /News /astrology /

HOROSCOPE TODAY ASTROLOGY PREDICT THAT THESE ZODIAC SIGNS FOCUS ON SECOND INCOME SOURCE CHECK YOUR RASI PHALALU HERE NK

Today Horoscope: నేటి రాశి ఫలాలు... ఈ రాశులవారికి రెండో ఆదాయంపై దృష్టి

Today Horoscope: నేటి రాశి ఫలాలు... ఈ రాశులవారికి రెండో ఆదాయంపై దృష్టి

Today Horoscope: నేటి రాశి ఫలాలు... ఈ రాశులవారికి రెండో ఆదాయంపై దృష్టి

Rashifal Today: ఈ రోజు శనివారం. కొన్ని రాశుల వారికి ప్రత్యేకమైన రోజు. మరి ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి శుభాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అలాగే జ్యోతిష పండితులు ఎవరికి ఎలాంటి సూచనలు చేశారో తెలుసుకుందాం.

    Horoscope Daily: ఇండియాలో వాతావరణం మారింది. ఎండాకాలం పోయి వానాకాలం వచ్చేసింది. నైరుతీ రుతుపవనాలు తెలుగు ప్రజలను పలకరిస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాశి ఫలాలు ఎలా ఉన్నాయి. నేడు ఏ రాశి వారికి బాగా కలిసొస్తుంది... ఏ రాశి వారికి సమస్యలుంటాయి... ఆర్థిక పరిస్థితులు ఎవరికి ఎలా ఉంటాయి.. వివాహం, ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం... ఇలా వేర్వేరు అంశాల్లో ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఏవైనా అప్రమత్త సందేశాలను జ్యోతిష పండితులు చెబితే... తదనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగవచ్చు.

    మేష రాశి (Aries)
    ఉద్యోగంలో ప్రమోషన్‌కు గానీ, ఇంక్రిమెంట్‌కు గానీ అవకాశం ఉంది. అధికార యోగం పట్టవచ్చు. ఆర్థికంగా కలిసి వచ్చే కాలం ఇది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారంలో మిత్రులు సహాయ సహకారాలందిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఇష్టపడినవారి దగ్గర పెళ్లి ప్రస్తావన తెస్తారు. వ్యాపారులు, వృత్తి నిపుణులు పురోగతి సాధిస్తారు.

    వృషభ రాశి (Taurus)
    అటు ఉద్యోగంలోనూ, ఇటు ఇంటిలోనూ బాగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడిగల వారితో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు సత్ఫలితాలు పొందుతారు. కుటుంబ సమస్యల పై దృష్టి కేంద్రీకరిస్తారు. మీకు రావాల్సిన బకాయిలు చేతికి అందివస్తాయి.

    మిథున రాశి (Gemini)
    ఇంటా బయటా ఒత్తిడి ఉన్నా తల పెట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆర్థికంగానూ, ఆరోగ్యపరంగానూ బాగుంది. కుటుంబానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుని అమలులో పెడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులు లాభా ఆర్జిస్తారు. ఒక ముఖ్యమైన కుటుంబ సమస్యకు అనుకోకుండా పరిష్కారం అవుతుంది. డబ్బు జాగ్రత్త.

    కర్కాటక రాశి (Cancer)
    ఆర్థిక లావాదేవీల విషయంలో ఆచితూచి అడుగేయాల్సి ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. దూర ప్రాంతం నుంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యాపారులకు ఆర్థికంగా బాగుంటుంది. వృత్తి నిపుణులు రాణిస్తారు.

    సింహ రాశి (Leo)
    ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. నిరుద్యోగ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు అభివృద్ధి సాధిస్తారు. దూరంగా ఉన్న సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది.

    కన్య రాశి (Virgo)
    గతంలో మీ దగ్గర ఆర్థిక సహాయం పొందినవారు తిరిగి చెల్లిస్తారు. దగ్గరి బంధువుల్లో కొందరు మీకు సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. ఆదాయపరంగా మెరుగైన స్థితిలోనే ఉంటారు. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఆదాయపరంగా, ఉద్యోగపరంగా సమయం బాగుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ప్రతిష్ఠ పెరుగుతుంది.

    తుల రాశి (Libra)
    ఉద్యోగంలో సహైద్యోగుల సహాయంతో ఒక గడ్డు సమస్య నుంచి బయటపడతారు. శ్రమ మీద కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో సమస్యలు, గొడవలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థికంగా బాగానే ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు కొద్దిగా లాభాలు ఆర్జిస్తారు. ఆదాయానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.

    వృశ్చిక రాశి (Scorpio)
    కొద్దిపాటి ఆర్థిక సమస్యలు మినహా ఇతరత్రా జీవితం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగంలో తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల సహాయ సహకారాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. ఎక్కడా పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయవద్దు. స్పెక్యులేషన్ లాభించదు. కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలవారి ఆర్థిక స్థితి పరవాలేదు.

    ధనస్సు రాశి (Sagittarius)
    ఆదాయపరంగా కలిసి వస్తుంది. అనుకున్న పనులు శ్రమ లేకుండా పూర్తవుతాయి. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. అందరికీ మేలు జరిగే పనులు చేపడతారు. కుటుంబంలో ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలవారు అభివృద్ధి సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

    మకర రాశి (Capricorn)
    ఉద్యోగంలో సకాలంలో లక్ష్యాలు పూర్తి చేసి అధికారుల అభినందనలు అందుకుంటారు. ఆదాయపరంగా ఎదుగూ బొదుగూ లేకపోయినా ఇతరులకు సహాయం చేస్తారు. వ్యాపారంలో శ్రమ, ఒత్తిడి బాగా పెరుగుతాయి. మిత్రులు ఆర్థికంగా ఆదుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త

    కుంభ రాశి (Aquarius)
    అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. రుణ సమస్యల నుంచి కొంత వరకు బయటపడతారు. ఖర్చులు తగ్గించుకోవడం అవసరం. పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాల వారికి ఇది అనుకూల సమయం. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.

    ఇది కూడా చదవండి: Vastu Shastra: ఇంట్లో ఈ వస్తువులు ఉంటే ఆర్థిక సమస్యలే... వెంటనే వదిలించుకోండి

    మీన రాశి (Pisces)
    ఉద్యోగంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యం జాగ్రత్త. వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల పరిస్థితి పరవాలేదన్నట్టుగా ఉంటుంది. బంధుమిత్రులు సహాయ సహకారాలందిస్తారు. దగ్గరి బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac sign

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు