• HOME
  • »
  • NEWS
  • »
  • ASTROLOGY
  • »
  • HOROSCOPE TODAY 9 MARCH 2021 CHECK TODAY RASI PHALALU ASTROLOGY PREDICTIONS IN TELUGU NK

Horoscope Today: మార్చి 9 రాశి ఫలాలు... మెరుగ్గా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

Horoscope Today: మార్చి 9 రాశి ఫలాలు... మెరుగ్గా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

మార్చి 9 రాశి ఫలాలు

Horoscope Today | 12 రాశుల వారికి ఈ రోజు మంగళవారం (మార్చి 9, 2021) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

  • Share this:
    Zodiac Signs: తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు ఎంతో ఉపయోగపడుతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదు:ఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు రాశి ఫలాలు దోహదపడుతాయి. 12 రాశుల వారికి ఈ రోజు మంగళవారం (మార్చి 9, 2021) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ... ముందుకు సాగవచ్చు.

    మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1)
    ఆర్థికంగా అనుకూమైన సమయం. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. మిత్రుల సహాయంతో సమస్యలు పరిష్కరించుకుంటారు. తలచిన పనులు నిదానంగా నెరవేరుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించవచ్చు.
    విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త.

    వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
    ఆర్థికంగా లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. మంచి నిర్ణయాలతో ముందుకు సాగుతారు. ఉద్యోగపరంగా అభివృద్ధికి అవకాశం ఉంది. ముఖ్యమైన కార్యాల్లో శ్రమ ఫలిస్తుంది. ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి.

    మిథునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
    శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఉద్యోగపరంగా అప్రమత్తంగా ఉండాలి. అనుకోని సమస్యలు ఎదురవుతాయి. దగ్గరి వారి సహాయం తీసుకోండి. ఆర్థిక స్థితి బాగుంటుంది. వ్యాపారంలో వివేకం ఫలిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. విందులో పాల్గొంటారు. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.

    కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
    శుభవార్త వింటారు. అదృష్ట యోగం ఉంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం లభిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. అధికార యోగం పట్టబోతోంది. భూ, గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.

    సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1)
    ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. మిత్రులతో అపోహలు తలెత్తుతాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. బంధుమిత్రుల నుంచి సహకారం అందుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

    కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
    ముఖ్యమైన కుటుంబ సమస్య పరిష్కారమవుతుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. శ్రమ మీద పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగపరంగా కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. జీవితంలో పైకి రావడానికి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త.

    తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
    వ్యాపారంలో కలిసి వస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. బంధువుతో అపార్థాలు తలెత్తవచ్చు. కుటుంబ బాధ్యత మీద దృష్టి కేంద్రీకరిస్తారు.
    ఆరోగ్యం జాగ్రత్త. తగాదాలకు దూరంగా ఉండండి. మనశ్శాంతి లభిస్తుంది.

    వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)
    ఉద్యోగంలో సానుకూల వాతవరణం ఉంటుంది. పెద్దల సహాయ సహకారాలతో ముఖ్యమైన కుటుంబ సమస్య ఒకటి పరిష్కరించుకుంటారు. వ్యాపారంలో లాభం పెరుగుతుంది. నిదానంగా సమస్యలు పరిష్కరించుకుంటారు. వినోదాలతో కాలం గడుపుతారు. సంతానం నుంచి శుభవార్త వింటారు.

    ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
    చిన్న ప్రయత్నం కూడా గొప్ప విజయాన్నిచ్చే కాలం ఇది. కాలాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగాలి. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజం నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. ఆరోగ్యం జాగ్రత్త.

    మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
    ఆర్థిక స్థితి బాగుంటుంది. ముఖ్యమైన పనుల్లో అప్రమత్తంగా ఉండాలి. తోటివారి సహాయ సహకారాలతో కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రద్ధ పెంచండి. ఆరోగ్యం విషయలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఖర్చులు తగ్గించుకోవాలి.

    కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
    ఆటంకాలను అధిగమించి పనులు పూర్తి చేస్తారు. శుభవార్త వింటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాలి. సహాయ, సూచనలకు ఇతరులపై ఆధారపడవద్దు. అభివృద్ధికి ఉపయోగపడే ఆలోచనలు చేస్తారు. ఉద్యోగంలో శ్రమ అధికమైనా మంచి ఫలితం ఉంటుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

    ఇది కూడా చదవండి: Viral Video: నువ్వా...నేనా... చెట్టుపై తలపడిన చిరుతపులి... నల్ల చిరుతపులి

    మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)
    మంచి కాలం నడుస్తోంది. అదృష్ట యోగం ఉంది. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. వ్యాపారంలో నిలదొక్కుకుంటారు. సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. మంచి సంస్థ నుంచి ఉద్యోగం ఆఫర్‌ వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
    Published by:Krishna Kumar N
    First published: