హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Horoscope 9-8-2021: నేటి రాశి ఫలాలు.. శుభవార్తా శ్రవణం

Horoscope 9-8-2021: నేటి రాశి ఫలాలు.. శుభవార్తా శ్రవణం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Horoscope daily 9-8-2021: ఇవాళ శ్రావణ మాసం ప్రారంభం. మరి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి. ఏ రాశుల వారికి ఎలా ఉంటుందని జ్యోతిష పండితులు చెప్పారో... ఫటాఫట్ తెలుసుకుందాం.

Horoscope today on 9-8-2021: రాశిఫలాల్లో ఈ రోజు ప్రత్యేకమైనది. శ్రావణమాసం ప్రారంభం కావడం, సోమవారం కావడం అన్నీ మంచి అంశాలే. మరి ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి. గ్రహాలు తమదైన కక్ష్యలో ముందుకుసాగుతున్నాయి. కాలం పరుగులు పెడుతోంది. మధ్యలో కరోనా కష్టాల సవాళ్లు విసురుతోంది. వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నాం. ఇలాంటి సమయంలో... డబ్బు అత్యంత కీలకమైనది. మరి జ్యోతిష పండితులు మన రాశిఫలాలపై ఏం చెబుతున్నారు? ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? ఎవరు అప్రమత్తంగా ఉండాలి? ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి?... అన్ని విషయాలనూ తెలుసుకుందాం.

మేష రాశి (Aries)

మంచి ఉద్యోగం వస్తుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. ప్రతిదీ ఆలోచించి చేయండి. ప్రణాళికా బద్ధంగా పనిచేస్తే లక్ష్యాన్ని చేరుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఎదురవుతాయి. బంధువులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.

వృషభ రాశి (Taurus)

ఆర్థికంగా కొంత ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతానికి మీకు కాలం అంతగా సహకరించకపోవచ్చు. శ్రమ పెరుగుతుంది. సమస్యల పరిష్కారానికి విపరీతంగా ఆలోచించి మనశ్శాంతి పోగొట్టుకోవద్దు. అందరినీ కలుపుకుని వెళితే మంచిది. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండండి. ఎవరికీ హామీలు ఉండొద్దు.

ఇది కూడా చదవండి: Dhana Yoga: ధనయోగం అంటే?.. అది పట్టాలంటే ఏం చెయ్యాలి?

మిథున రాశి (Gemini)

సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. తలచిన పనులు చాలావరకు నెరవేరుతాయి. ఉద్యోగస్థులకు ప్రశంసలు దక్కుతాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. గృహ, వాహన యోగాల మీద దృష్టి పెడతారు. వ్యాపారులకు కొంతవరకు పరవాలేదు.

కర్కాటక రాశి (Cancer)

ఆదాయం ఆశించినంతగా పెరుగుతుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువవుతుంది. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు నెరవేరతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.

సింహ రాశి (Leo)

ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇంటి సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. వివాహ ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Shravana Masam 2021: నేడు శ్రావణమాసం ప్రారంభం. ప్రాసస్థ్యం, విశిష్టత, చేయాల్సిన పూజలు

కన్య రాశి (Virgo)

శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి తప్పకపోవచ్చు. ఆదాయానికి సంబంధించి కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి నిపుణులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది.

తుల రాశి (Libra)

సమయం బాగుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో చక్కని లాభాలకు ఆస్కారముంది. కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తు కొనుగోలు చేస్తారు.

వృశ్చిక రాశి (Scorpio)

అన్ని విధాలా సమయం అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ఒక్కటొక్కటిగా ఫలిస్తాయి. సరైన ఆలోచనా విధానంతో ముందడుగు వేయండి. రుణ సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సమాజానికి పనికి వచ్చే పనులు చేపడతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త.

ధనస్సు రాశి (Sagittarius)

ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. పనులు ఆలస్యం అవుతుంటాయి. అనుకోని విధంగా కొంత డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారులు బాగా కస్టపడాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఇబ్బంది పెడతాయి. స్నేహితురాలి మీద మితిమీరిన ఖర్చు అవుతుంది.

మకర రాశి (Capricorn)

ఆకస్మిక ధనలాభం ఉంది. ఉద్యోగం విషయంలో అనుకున్నది సాధిస్తారు. శక్తికి మించి శ్రమ పడి మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. శరీరానికి బాగా విశ్రాంతి అవసరం. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని అవాంతరాలున్నా అనుకున్న పనులన్నీ చక్కగా పూర్తి చేస్తారు. దగ్గరి బంధువులతో విభేదాలకు అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: శ్రావణమాసంలో పవిత్ర సోమవారం.. పరమశివుడికి పూజా విధానం

కుంభ రాశి (Aquarius)

వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. ఆదాయం, ఆరోగ్యం పరవాలేదనిపిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అధికారం చేపట్టే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త ఆదాయ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఎవరికీ హామీలు ఉండొద్దు.

మీన రాశి (Pisces)

కొత్త ఉద్యోగావకాశాలు మీ ముందుకు వస్తాయి. వివాహానికి శుభ సమయం ఇది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. గౌరవ పురస్కారాలు లభిస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. శుభవార్తలు వింటారు. వృత్తి నిపుణులు శ్రమ పడక తప్పదు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.

First published:

Tags: Astrology, Bhakti, Horoscope, Horoscope Today, Rasi phalalu

ఉత్తమ కథలు