Horoscope 7-9-2021: రాశి ఫలాలు.. సంతాన శుభవార్తలు.. హామీలతో చిక్కులు

Horoscope: రాశి ఫలాలు

Horoscope 7-9-2021: మరో రెండ్రోజుల తర్వాత ఈ నెల 10 వినాయక చవితి. తెలుగు రాష్ట్రాల ప్రజలు పండుగ ఏర్పాట్లలో ఉన్నారు. మరి ఇవాళ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

 • Share this:
  Zodiac Signs: రాశి ఫలాలు చాలా మంచిది. అవి మనల్ని ఎప్పుడూ అలర్ట్ చేస్తూ ఉంటాయి. ఇవాళ ఉద్యోగం వస్తుందనో, దూర ప్రయాణాలు చేస్తారనో, శుభవార్త వింటారనో... ఏవో ఒక మంచి విషయాలు చెబుతాయి. అలాగే... అప్పులు ఇవ్వొద్దనో, శత్రుబాధలు ఉంటాయనో చెబుతూ... హెచ్చరిస్తాయి. నేడు మనకు ఏం జరగనుందో ఓ అంచనాగా తెలుసుకుంటే మంచిదే. ఏదైనా చెడు జరిగే ఛాన్స్ ఉంటే... అప్రమత్తం అవ్వొచ్చు. మంచి జరిగితే ఆనందపడవచ్చు. మరి ఇవాళ 7-9-2021 నాడు జ్యోతిష పండితులు (Astro experts) రాశి ఫలాలు (Horoscope) ఎలా ఉన్నాయని చెప్పారో చూద్దాం.

  మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1)
  ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. చిన్ననాటి స్నేహితుల్ని పలకరిస్తారు. ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు. శరీరానికి మధ్య మధ్య విశ్రాంతి అవసరం.

  వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
  రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. ఉద్యోగానికి, ఆదాయానికి సంబంధంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎక్కడా ఎవరికీ హామీలు ఉండవద్దు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. చెడు స్నేహాలకు వీలైనంత దూరంగా ఉండండి. వ్యసనాలు, జూదాలు జోలికి వెళ్లవద్దు.

  మిథునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
  ఉద్యోగంలో అధికారుల నుంచి అభినందనలు లభిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పలుకుబడిగల వ్యక్తులు పరిచయమవుతారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

  కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
  ఉయోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడుతాయి. ఆశించినంతగా ఆదాయం పెరుగుతుంది. ఖర్చుకు కళ్లెం వేయాలి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చక పోవడం మంచిది.

  సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1)
  అనుకోకుండా పెరిగి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆదాయం పర్వాలేదు కానీ, ఖర్చులు పెరుగుతాయి. మీ నుంచి సహాయం పొందినవారు ముఖ్యం చాటేస్తారు. తలపెట్టిన పనులు అతికష్టం మీద పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఒక చిన్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

  కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
  ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కరించుకుంటారు.

  తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
  ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కరించుకుంటారు.

  వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)
  ఉద్యోగం మారదలుచుకుంటే గట్టిగా ప్రయత్నించాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. ఇంటా బయటా శ్రమ ఎక్కువగా ఉంటుంది.

  ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
  ఉద్యోగం మారడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొద్దిగా ఆలస్యమైనా పనులు పూర్తవుతాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త, ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.

  మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
  ఆదాయం ఫర్వాలేదు కానీ ఖర్చులు అదుపు తప్పుతాయి. ఉద్యోగంలో బాగా శ్రమ పెరుగుతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆరోగ్యం జాగ్రత్త.

  కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
  ఉద్యోగంలో బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారు ఆర్థికంగా పుంజుకుంటారు. ఎంతో శ్రమపడి పనులు పూర్తి చేస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. సన్నిహితులు మీకు అండగా నిలబడతారు.

  ఇది కూడా చదవండి: Ganesh Chaturthi 2021: గణపతికి నచ్చే నైవేద్యాలు.. ఇవి పెడితే వరాల జల్లే!

  మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)
  అన్ని విధాలా సమయం అనుకూలంగా ఉంది. ఆశించినంతగా ఆదాయం పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నం కలిసి వస్తాయి. బంధువులు, స్నేహితులతో సరదాగా గడుపుతారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ప్రశంసలు లభిస్తాయి. ఎంతో శ్రమ మీద పనులు పూర్తవుతాయి.ho
  Published by:Krishna Kumar N
  First published: