Horoscope today: నేటి రాశి ఫలాలు.. నడుస్తున్న మంచికాలం

Horoscope today: నేటి రాశి ఫలాలు

Horoscope 7-8-2021: నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయి. ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి... జ్యోతిష పండితులు ఏ రాశి వారికి ఏం సూచిస్తున్నారో తెలుసుకుందాం.

 • Share this:
  Horoscope today: దేశంలో మళ్లీ కరోనా సమస్యలు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆర్థిక పరమైన అంశాల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. రేపు ఎలా ఉంటుందో అనే ఆందోళన అందరిలోనూ ఉంది. ఎదురవ్వబోయే సమస్యల్ని రాశి ఫలాల ద్వారా ముందుగానే కొంతవరకూ తెలుసుకోవచ్చు. తద్వారా అప్రమత్తం అయి వాటి నుంచి బయటపడవచ్చు. జ్యోతిష పండితులు తిథి, నక్షత్రం, పంచాంగం, గ్రహాలు, సూర్యుడు, ఘడియలు అన్నీ పరిశీలించి... ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. 7-8-2021 నాడు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  మేష రాశి (Aries)
  ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం చేతికి వస్తుంది. అధిక ధన లాభం ఉంది. అనుకున్న పనులన్నిటినీ దాదాపు పూర్తి చేస్తారు. బంధుమిత్రులకు సహాయపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు. కుటుంబసమేతంగా పుణ్యక్షేత్ర దర్శనం ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి.

  వృషభ రాశి (Taurus)
  ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. విజయవంతంగా పనులు పూర్తి చేస్తారు. శుభవార్త వింటారు. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. ఆర్థికంగా మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. బంధుమిత్రుల ద్వారా మంచి మేలు జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త వస్తువులు కొంటారు.

  మిథున రాశి (Gemini)
  ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగానే ఉన్నాయి. పట్టుదలగా పనులు పూర్తి చేసుకుంటారు. చాలావరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. సంతానపరంగా అనుకూలమైన కాలం నడుస్తోంది. బంధువులు కొందరు అపనిందలు వేస్తారు. ఆరోగ్యానికి డోకా లేదు.

  ఇది కూడా చదవండి: ఆదివారం అద్భుతం. 100 ఏళ్ల తర్వాత వస్తున్న ప్రత్యేక రోజు. రాజయోగం కోసం ఇలా చెయ్యండి

  కర్కాటక రాశి (Cancer)
  ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలు రాకుండా జాగ్రత్తలు పాటించాలి. ఆటంకాలు ఎదురైనా చాలావరకు పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఒక కుటుంబ సమస్య కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. పెళ్లి సంబంధం పెండింగ్‌లో పడుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

  సింహ రాశి (Leo)
  ప్రస్తుతం అన్నివిధాలా మంచి కాలం నడుస్తోంది. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. సంతానం గురించి శుభవార్తలు వింటారు. ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకోని లాభాలుంటాయి.

  కన్య రాశి (Virgo)
  గతంలో ఆగిపోయిన పనుల్ని ఇప్పుడు పట్టుదలగా పూర్తి చేస్తారు. ఇంటా బయటా సమస్యలున్నా ముందుకు దూసుకు వెళతారు. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఎదుగుదలకు వీలైన సమయం ఇది. ఇప్పుడు తల పెట్టిన పనులు విజయాన్నిస్తాయి.

  తుల రాశి (Libra)
  తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. ఇంటా బయటా సమస్యలు ఎదురవుతున్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి. ప్రయత్నిస్తే మీ కోరిక నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభసాటి ఫలితాలున్నాయి. సొంత నిర్ణయాలతో పాటు కుటుంబ సభ్యుల నుంచి కూడా సలహాలు తీసుకుంటే మంచిది.

  ఇది కూడా చదవండి: Vastu tips: ఆ పూలతో అరిష్టం... అవి ఇంట్లో ఉంటే అప్పులే!

  వృశ్చిక రాశి (Scorpio)
  అవసరాలకు ధన సహాయం అందుతుంది. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో విశేషమైన లాభాలుంటాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. కొన్ని వ్యక్తిగత కార్యాల్లో మిత్రుల సలహాలు కూడా తీసుకోండి. మంచి శుభవార్త వింటారు.

  ధనస్సు రాశి (Sagittarius)
  బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ, కుటుంబపరంగా మధ్య మధ్య సమస్యలు ఎదురవుతుంటాయి. ఓపికతో వ్యవహరించి వీటిని పరిష్కరించుకుంటారు. పాజిటివ్ గా ఉండండి. అభివృద్ధి పైనే దృష్టి నిలపండి. అంతా మీరు అశించిన విధంగానే జరుగుతుంది. తలచిన పనులు చాలావరకు నెరవేరుతాయి.

  మకర రాశి (Capricorn)
  వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంతా అనుకూలంగా ఉంటుంది. మంచి కాలం నడుస్తోంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. సంకల్ప బలం బాగానే ఉంది. బంధుమిత్రులతో అపార్థాలకు అవకాశం లేకుండా వ్యవహరించండి. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది.

  కుంభ రాశి (Aquarius)
  ఉద్యోగంలో గుర్తింపు, ప్రోత్సాహం ఉంటాయి. అనుకూలమైన కాలం నడుస్తోంది. సొంత నిర్ణయాలు, స్వయం కృషి సత్ఫలితాలను ఇస్తాయి. ఇప్పుడు తల పెట్టిన పనుల్లో అధిక లాభం ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తాయి. ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యంపరవాలేదు.

  మీన రాశి (Pisces)
  ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతికి కాలం అనుకూలంగా ఉంది. ఇష్ట కార్యాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులకు ఆర్థికంగా బాగా సహాయం చేస్తారు. ఆదాయానికి సంబంధించి ఒక ముఖ్యమైన పని మీకు అనుకూలంగా నెరవేరుతుంది. గృహ లాభం, వాహన యోగం ఉన్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
  Published by:Krishna Kumar N
  First published: