Zodiac signs: తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు ఎంతో ఉపయోగపడుతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదు:ఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు రాశి ఫలాలు దోహదపడుతాయి. 12 రాశుల వారికి ఈ రోజు శనివారం (మార్చి 6, 2021) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ... ముందుకు సాగవచ్చు.
మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఒక విదేశీ సంస్థ నుంచి మంచి ఆఫర్ వస్తుంది. భార్యాపిల్లలతో విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతానం నుంచి శుభవార్త వింటారు. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వాదనకు దిగవద్దు. విద్యార్థులకు ప్రశంసలు లభిస్తాయి. కళా సాహిత్య రంగాల్లోని వారు రాణిస్తారు.
వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. రెండో ఆదాయ మార్గం గురించి స్నేహితులతో చర్చిస్తారు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. భార్యాపిల్లలతో సరదాగా గడుపుతారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు అన్నివిధాలా బాగుంది.
మిథునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
భార్యా పిల్లలతో శుభకార్యాల్లో పాల్గొంటారు. పరిచయాలు పెరుగుతాయి. తీర్థయాత్రకు ప్లాన్ వేస్తారు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. తిప్పుట ఎక్కువగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండండి.
కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
తలచిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. సమయం బాగుంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. బంధువులు, స్నేహితులు సహాయపడతారు. ఆర్థిక లావాదేవీల్లో మోసపోయే ప్రమాదం ఉంది. విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.
సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఊహించని సంఘటనలు జరుగుతాయి. సమయం బాగుంది. ఆరోగ్యం జాగ్రత్త. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధాలు కుదరవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కోర్టు కేసులు అనుకూలంగా ఉంటాయి. ఐ.టి వారికి బాగుంది.
కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
అనుకోకుండా చేతికి డబ్బు అందుతుంది. బంధుమిత్రులతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగం విషయంలో ఆందోళన చెందుతారు. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వొద్దు. నష్టపోతారు. భార్యాపిల్లలతో సరదాగా గడుపుతారు.
ఎవరితోనూ వాదనకు దిగవద్దు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది.
తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ఆదాయానికి కొరత లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. భార్య తరపు బంధువు సంప్రదించే అవకాశం ఉంది. విద్యార్థులు తేలిగ్గా పురోగతి సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం జాగ్రత్త.
వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)
విదేశాల నుంచి అనుకూల సమాచారం అందుతుంది. ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. తిప్పుట ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. అవివాహితులకు పెళ్లి గంట మోగుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. డబ్బు నష్టం జరగవచ్చు.
ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగరీత్యా దూరపు ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది. వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. భార్య తరపు బంధువు ఇంటికి వచ్చే సూచనలు ఉన్నాయి. కొత్తవారు పరిచయమవుతారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది.
మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
అంతా మీరు అశించిన విధంగానే జరుగుతుంది. సమయానికి తలచిన పనులు నెరవేరుతాయి. చాలాకాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. తీర్థయాత్రకు ప్రయత్నాలు చేసుకుంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. డబ్బు నష్టపోయే అవకాశం ఉంది.
కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంది. ముఖ్యంగా స్వయం ఉపాధి వారికి సమయం అనుకూలంగా ఉంది. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త.
ఇది కూడా చదవండి: Worst Pair: ఈ రాశుల వారి మధ్య వివాహం జరిగితే తరచూ గొడవలే... మీ రాశి ఏది?
మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)
అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆలయాలకు వెళ్తారు. సహచరులు, సన్నిహితులతో వాదనకు దిగవద్దు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు.