Horoscope 6-9-2021: రాశి ఫలాలు.. కలిసొచ్చే కాలం.. పని ఒత్తిడి, శ్రమ

Horoscope: రాశి ఫలాలు

Horoscope 6-9-2021: 12 రాశుల వారికి ఇవాళ సెప్టెంబర్ 6, 2021 ఎలా ఉంటుంది. జ్యోతిష పండితులు ఎలాంటి శుభవార్తలు చెప్పారో చూద్దాం.

  • Share this:
    Zodiac Signs: తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు ఎంతో ఉపయోగపడతాయి. మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదు:ఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు దిన ఫలాలు దోహదపడుతాయి. 12 రాశుల వారికి సెప్టెంబర్ 6, 2021 నాడు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ... ముందుకు సాగవచ్చు.

    మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1)
    ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ఇంటా బయటా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌కు వీలుంది. తల పెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. కొత్త ప్రయత్నాలు చేపట్టవచ్చు. మిత్రులకు సహాయం చేస్తారు. అంతా శుభమే జరుగుతుంది. ఆరోగ్యం పరవాలేదు.

    వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
    ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంది. వ్యాపారంలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. గృహ, వాహన యోగాలున్నాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఒక శుభవార్త శక్తినిస్తుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది.

    మిథునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
    మీ ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపారంలో ఆటంకాలు ఎదురవుతున్నా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. మిత్రులకు చేసే సహాయం వల్ల మేలు జరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ సమస్య పరిష్కారమయ్యే సూచనలున్నాయి.

    కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
    కాలం ప్రతికూలంగా ఉన్నట్టు కనిపించినా ధైర్యంగా పనులు పూర్తి చేయండి. ఉద్యోగంలో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఖర్చులకు కళ్లెం వేయండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇంట్లో శుభం జరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త.

    సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1)
    అనుకున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో మరింత శ్రమ పెరుగుతుంది. పదోన్నతులకు అవకాశం ఉంది. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంది. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి.

    కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
    ప్రతి పనికీ శ్రమ, మానసిక ఒత్తిడి తప్పవు. ఉద్యోగంలో మీరు కోరుకున్నట్టే జరుగుతుంది. వ్యాపారం నిలకడగా ఉంటుంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. కుటుంబ సమస్యల పరిష్కారంలో ఆ వరోధాలు తొలగుతాయి. నూతన ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు.

    తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
    అనుకున్న పనులు పూర్తవుతాయి. ఇంటా బయటా కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. వ్యాపారంలో మరింత శ్రద్ధ అవసరం. ఆదాయం బాగానే ఉన్నా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం పరవాలేదు.

    వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)
    వ్యాపారంలో కలిసి వస్తుంది. అన్ని విధాలా విశేష లాభాలున్నాయి. ఉద్యోగపరంగా కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. బంధుమిత్రుల వల్ల ప్రయోజనం ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. పోయిన వస్తువులు తిరిగి వస్తాయి. బంధువులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త.

    ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
    గట్టి పట్టుదలతో పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంది. కుటుంబంలో ఒక కీలక సమస్య నుంచి బయటపడతారు. ఆదాయం పెంచుకోవడానికి అనుకూలమైన కాలం ఇది. కుటుంబపరంగా మేలు జరుగుతుంది. స్నేహితుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

    మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
    అన్ని విధాలా కలసి వచ్చే కాలం. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థికంగా ముందడుగు వేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చక్కని అవకాశాలు అందివస్తాయి. అధికారులను ప్రతిభతో ఆకట్టుకుంటారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. దూర ప్రాంతంలో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.

    కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
    ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో సమస్యలు ఎదురైనా తెలివిగా పరిష్కరించుకుంటారు. ఒక ముఖ్యమైన కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. మీరు కోరుకున్న చోట ఉద్యోగం లభించే సూచనలున్నాయి. స్నేహితులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

    ఇది కూడా చదవండి: Bhakti: తులసిని ఇలా వాడకండి.. దురదృష్టం వెంటాడుతుంది.

    మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)
    వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ ఫలితాలున్నాయి. ఆదాయం పరవాలేదు కానీ, ఖర్చులు పెరగకుం డా జాగ్రత్త పడాలి. కొద్దిగా ఆలస్యంగా అయినా మీ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ప్రతిభా పాటవా లతో అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్యం చాలావరకు పరవాలేదు.
    Published by:Krishna Kumar N
    First published: