Horoscope 4-9-2021: రాశి ఫలాలు.. పనులు పూర్తి... ఆర్థిక ఫలాలు

Horoscope: రాశి ఫలాలు

Horoscope 4-9-2021: 12 రాశుల వారికి ఇవాళ సెప్టెంబర్ 4, 2021 నాడు ఎలా ఉంటుంది? జ్యోతిష పండితులు ఎలాంటి శుభవార్తలు చెప్పారో చూద్దాం.

  • Share this:
    Zodiac Signs: దేశంలో ఆర్థిక పరిస్థితులు మెరుగవుతున్నాయి. నిత్యవసర వస్తువుల ధరలు మాత్రం బాగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఇంటి బడ్జెట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగాలు, వ్యాపారాల్లో జాగ్రత్తగా అడుగులు వెయ్యాలి. మరి నేటి భవిష్యత్ ఎలా ఉంటుంది... ఏయే రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది జ్యోతిష పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా వివిధ రాశుల వారికి ఎదురయ్యే సమస్యల్ని ముందే వివరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం. 12 రాశుల వారికి సెప్టెంబర్ 4, 2021 నాడు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

    మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1)
    వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యక్తిగతంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుంది. మిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. శుభవార్తలు వింటారు. మంచి కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

    వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
    ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. దగ్గర బంధువు ఒకరు సహాయపడతారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కదురుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయపరంగా వ్యాపారులకు బాగానే ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతం నెలకొంటుంది.

    మిథునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
    ఉద్యోగంలో ఎవరి సహకారమూ లేకుండా లక్ష్యాలు పూర్తి చేస్తారు. వృతి, వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చాలాకాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. కొందరు సన్నిహితుల సహాయంతో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

    కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
    ఆదాయానికి, ఆరోగ్యానికి డోకా లేదు. ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. వైద్యపరమైన ఖర్చులు చికాకు కలిగిస్తాయి. వ్యాపారంలో బాగా ఒత్తిడి ఉంటుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దూరం ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు.

    సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1)
    ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధన లాభం ఉంది. వ్యాపారపరంగా ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. కొత్త పనులు చేపడతారు. కుటుంబంలో కొద్దిగా ప్రశాంతత లోపిస్తుంది. ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. పెళ్లి సంబంధం కదురుతుంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. శుభవార్త వింటారు.

    కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
    ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అనుకోకుండా ఆర్థిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. అదనపు ఆదాయం కోసం పయత్నాలు ప్రారంభిస్తారు.

    తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
    ఉద్యోగంలో సహోద్యోగుల సహాకారంతో లక్ష్యాలు పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఒక ప్రధాన ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

    వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)
    ఉద్యోగం మారాలనే ఆలోచన కలుగుతుంది. ఆర్థికంగా బాగానే ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. కుటుంబపరంగా కొద్దిగా ఒత్తిడి, చికాకులు ఉంటాయి. ప్రయాణాలను వాయిదా వేయండి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృతి, వ్యాపారాల్లో ఉన్న వారు లాభాలు ఆర్జిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు.

    ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
    ఊహించని విధంగా ఆదాయం పెరుగుతంది. ఖర్చులకు కళ్లెం వేయాలి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ వాతావరణం ఆశాజనంగా ఉంటుంది. ఇతరులకు వీలైనంతగా సహాయం చేస్తారు. కుటుంబంలో ఆనందోత్సాహాలు నెలకొంటాయి. మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఆరోగ్యం ఫర్వాలేదు.

    మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
    ఉద్యోగంలో అధికారుల అభినందనలు, ప్రశంసలు అందుకుంటారు. అధికార లాభం ఉంది. ఆర్థిక స్థోమత చాలావరకు మెరుగుపడుతుంది. మిత్రుల సహాయంతో ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండండి. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది.

    కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
    ఉద్యోగంలో అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఇంటా బయటా కాస్తం ఒత్తిడి ఉంటుంది. ఆదాయం నిలకడగా టుంది. అదనపు సంపాదన కోసం ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారం నిలకడగా సాగుతుంది. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పర్వాలేదు. మిత్రు వల్ల మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.

    ఇది కూడా చదవండి:Lucky Numbers: పుట్టిన తేదీ ఆధారంగా మీ లక్కీ నంబర్లు తెలుసుకోండి

    మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)
    ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తలపెట్టిన పనులు ఎంతో శ్రమ మీద పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల వారికి ఇది ఎంతో అనుకూల సమయం.
    Published by:Krishna Kumar N
    First published: