Home /News /astrology /

Horoscope 31-7-2021: నేటి రాశి ఫలాలు.. ఉద్యోగ మార్పులు, పురోగతి

Horoscope 31-7-2021: నేటి రాశి ఫలాలు.. ఉద్యోగ మార్పులు, పురోగతి

Horoscope today: రాశి ఫలాలు

Horoscope today: రాశి ఫలాలు

Horoscope today 31-7-2021: ఇవాళ్టితో జులై నెల ముగుస్తుంది. ఇంకా ఈ సంవత్సరంలో 5 నెలలే ఉంటాయి. మరి చివరి రోజున రాశి ఫలాలు ఎవరికి ఏం సూచిస్తున్నాయి?

  Horoscope 31-7-2021: నైరుతీ రుతుపవనాల రాకతో దేశంలో ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. ముఖ్యంగా రైతులు పంటలు పండించేందుకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది. ఐతే... కరోనా సమస్య ఇంకా వదలట్లేదు. ఇలాంటి సమయంలో రాశి ఫలాలు అనేక అంశాల వల్ల ప్రభావితం అవుతాయి. కొన్ని రాశుల వారికి ఈ పరిస్థితులు బాగా కలిసొస్తాయి. మరికొందరికి ఇవి ఇబ్బందులు కలిగిస్తాయి. మరి జ్యోతిష పండితులు ఏ రాశుల వారికి ఎలాంటి భవిష్యత్తు సూచించారో, ఎవరికి ఎలాంటి అప్రమత్త సందేశాలు ఇచ్చారో తెలుసుకోవాలి. తద్వారా తగిన నిర్ణయాలు తీసుకునేందుకు వీలవుతుంది.

  మేష రాశి (Aries)
  వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. ఆదాయం, ఆరోగ్యం పరవాలేదనిపిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అధికారం చేపట్టే అవకాశం ఉంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. బంధుమిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. ఎవరికీ హామీలు ఉండొద్దు.

  వృషభ రాశి (Taurus)
  ఉద్యోగావకాశాలు మీ ముందుకు వస్తాయి. వివాహానికి శుభ సమయం ఇది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. సమాజంలో గౌరవ పురస్కారాలు లభిస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. శుభవార్తలు వింటారు. విద్యార్థులు శ్రమ పడక తప్పదు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త.

  మిథున రాశి (Gemini)
  ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. ఉద్యోగంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇల్లు గానీ, స్థలం గానీ కొనే ఆలోచన చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.

  ఇది కూడా చదవండి: Zodiac Signs: నల్ల తాడు ఏ రాశుల వారికి మంచిది... ఎవరు కట్టుకోకూడదు?

  కర్కాటక రాశి (Cancer)
  ఉద్యోగంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. అధికారుల్ని ప్రతిభతో మెప్పిస్తారు. ఆకస్మిక ధన లాభం ఉంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని అవాంతరాలున్నా అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. దగ్గరి బంధువులతో విభేదాలకు అవకాశం ఉంది. శక్తికి మించి శ్రమ పడి మంచి గుర్తింపు తెచ్చుకుంటారు.

  సింహ రాశి (Leo)
  అన్నివిధాలా సమయం బాగుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలకు ఆస్కారముంది. కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

  కన్య రాశి (Virgo)
  ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ప్రయత్నాలు ఒక్కటొక్కటిగా ఫలిస్తాయి. సరైన ఆలోచనా విధానంతో ముందడుగు వేయండి. చాలావరకు రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సమాజానికి పనికి వచ్చే పనులు చేపడతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త.

  తుల రాశి (Libra)
  ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇంటి సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. వివాహ ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఇతరులకు సహాయపడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.

  ఇది కూడా చదవండి: Vastu Tips: ఇంట్లో గొడవలా... కల్లు ఉప్పుతో పరిష్కారం!

  వృశ్చిక రాశి (Scorpio)
  ఆదాయపరంగా శుభవార్త వింటారు. ఉద్యోగంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇంటాబయటా బాగా ఒత్తిడి ఉంటుంది. వృత్తికి సంబంధించి కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో అనుకోకుండా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుద్యోగులకు అనుకూలంగా ఉంది. తిప్పుట ఎక్కువగా ఉంటుంది.

  ధనస్సు రాశి (Sagittarius)
  సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. తలచిన పనులు చాలావరకు నెరవేరుతాయి. ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. గృహ, వాహన యోగాల మీద దృష్టి పెడతారు. వ్యాపారులు లాభాల బాటలో పడతారు.

  మకర రాశి (Capricorn)
  ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. కొద్దిగా ధనలాభం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. మిత్రులు, ఆప్తుల సలహాలు, సూచనలు తీసుకోండి. ఇరుగు పొరుగువారితో వివాదాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడుతుంది.

  కుంభ రాశి (Aquarius)
  మంచి ఉద్యోగం వస్తుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. ప్రతిదీ ఆలోచించి చేయండి. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే లక్ష్యాన్ని చేరుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఎదురవుతాయి. సద్యోగుల సహకారం కూడా తీసుకోండి. బంధువులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.

  మీన రాశి (Pisces)
  ఆర్థికంగా కొన్ని ప్రయోజనాలు చోటు చేసుకుంటాయి. ప్రస్తుతానికి సమయం అంత అనుకూలంగా లేదు. ఇంటా బయటా శ్రమ పెరుగుతుంది. సమస్యల పరిష్కారానికి విపరీతంగా ఆలోచించి మనశ్శాంతి పోగొట్టుకోవద్దు. అందరినీ కలుపుకుని వెడితే మంచిది. వివాదాలకు దూరంగా ఉండండి. హామీలు ఉండొద్దు.
  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac signs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు