Home /News /astrology /

HOROSCOPE TODAY 31 8 2021 JOBS AND OPPORTUNITIES GOOD TODAY TO THESE ZODIAC SIGNS CAREFUL ON FINANCIAL ISSUES NK

Horoscope 31-8-2021: రాశి ఫలాలు.. ఉద్యోగాలు ప్రశాంతం.. ఆర్థికం అప్రమత్తం

Horoscope: రాశి ఫలాలు

Horoscope: రాశి ఫలాలు

Horoscope 31-8-2021: 12 రాశుల వారికి ఇవాళ ఆగస్ట్ 31, 2021 ఎలా ఉంటుంది. జ్యోతిష పండితులు ఎలాంటి శుభవార్తలు చెప్పారో చూద్దాం.

  Zodiac Signs: తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు ఎంతో ఉపయోగపడతాయి. మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదు:ఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు దిన ఫలాలు దోహదపడుతాయి. 12 రాశుల వారికి ఆగస్ట్ 31, 2021 నాడు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ... ముందుకు సాగవచ్చు.

  మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1)
  ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాను నుంంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులు, వృతి నిపుణులకు సమయం బాగుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కోర్టు కేసుల్లో నెగ్గుతారు.

  వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
  సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో మార్పు ఉంటుంది. స్నేహితులను ఆర్థికంగా ఆదుకుంటారు. వ్యాపారస్థులు ఆర్థికంగా పుంజుకుంటారు. రుణబాధ తగ్గించుకుంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

  మిథునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
  ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. సమస్యల పరిష్కారంలో బంధుమిత్రుల సహాయ సహకారులు అందుతాయి. వ్యాపారులు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. ప్రేమ వ్యవహరాల్లో ఆచితూచి అడుగు వేయాలి.

  కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
  ఈ రోజంతా సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారులు నష్టాల పాలయ్యే సూచనలు లేవు. వివాహ సంబంధం కుదురుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

  సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1)
  సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగే పనులు చేస్తారు. నిరుద్యోగులకు మంచి సంస్థలతో ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి ఎక్కువవుతుంది. వ్యాపారాలకు చాలావరకు సమయం అనుకూలంగా ఉంది.

  కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
  ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. ఆర్థికంగా ఒడిదుడుకులేమీ ఉండవు. భావి జీవితం గురించి ఆలోచిస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అంది అవసరాలు తీరుతాయి. వ్యాపారులు లాభార్జన చేస్తారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. పెళ్లి సంబంధం కుదరవచ్చు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. హామీలు ఉండవద్దు.

  తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
  ఉద్యోగంలో అధికారుల నుంచి ఒకటి రెండు సమస్యలున్నా వాటిని అధిగమించేస్తారు. వ్యాపారంలో కొద్దిపాటి లాభాలతో బయటపడతారు. ఆదాయం పెంచుకునే మార్గాలను ఆలోచిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. నిరుద్యోగులకు మంచి కబురు అందుతుంది. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.

  వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)
  ఆదాయం నిలకడగా ఉంటుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తలచిన పనులు నెరవేరతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఎక్కువగా కుటుంబసభ్యులతో గడుపుతారు. వ్యాపారాలకు చెప్పుకోదగ్గ లాభనష్టాలేమీ ఉండవు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్త.

  ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
  రోజు ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదరవచ్చు. ఆలయాలకు వెళతారు. వ్యాపారులు ఆశించినంతగా లాభాలు ఆర్జిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు.

  మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
  ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా మేలు జరుగుతుంది. మంచి చోట పెళ్లి సంబంధం కుదురుతుంది. మిత్రుల సహాయంలో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కొన్ని స్నేహితులు పరిచయమవుతారు. బాగా శ్రమపడితే గానీ వ్యాపారులు లాభాలు ఆర్జించే అవకాశం లేదు. ఒత్తిడి శ్రమ ఉంటాయి.

  కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
  ఆర్థిక సమస్య ఒకటి బాగా ఇబ్బంది పెడుతుంది. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు ఉంటాయి. డాక్టర్లు, లాయర్ల వంటి వృతి నిపుణులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. వ్యాపారులు మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త.

  ఇది కూడా చదవండి: Ganesh Dream: వినాయకుడు కలలోకి వస్తే ఏం జరుగుతుంది?

  మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)
  ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. కానీ ఖర్చులు అదుపు తప్పుతాయి. ఉద్యోగంలో బాద్యతలు పెరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులకు ఆఫర్ వస్తుంది.
  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac sign, Zodiac signs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు