Horoscope Today: సెప్టెంబర్ 30 రాశి ఫలాలు, ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి?

Horoscope Today | 12 రాశుల వారికి ఈ రోజు బుధవారం (సెప్టెంబర్‌ 30, 2020) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

news18-telugu
Updated: September 30, 2020, 5:40 AM IST
Horoscope Today: సెప్టెంబర్ 30 రాశి ఫలాలు, ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి?
Horoscope Today: సెప్టెంబర్ 30 రాశి ఫలాలు, ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి?
  • Share this:
తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు ఎంతో ఉపయోగపడుతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదు:ఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు రాశి ఫలాలు దోహదపడుతాయి. 12 రాశుల వారికి ఈ రోజు బుధవారం (సెప్టెంబర్‌ 30, 2020) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ... ముందుగు సాగవచ్చు.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. సంతానం నుంచి శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి తరఫు బంధువులు మిమ్మల్ని పకరించే అవకాశం ఉంది. విద్యార్థులు ఈజీగా పురోగతి సాధిస్తారు. ప్రమాదంలో పడే సూచనలు ఉన్నాయి. ఎవరికీ డబ్బు ఇవ్వొద్దు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగానికి సంబంధించి అనుకూమైన సమాచారం అందుతుంది. రెండో ఆదాయ మార్గం గురించి స్నేహితులతో చర్చిస్తారు. అప్పు తీరుస్తారు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. సమీప బంధువుల్లో ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. శివార్చన మంచిది.

మిధునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. తీర్థయాత్రకు ప్లాన్‌ వేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు... తమ టీచర్ల ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. తిప్పలు ఎక్కువగా ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
శుభకార్యాలు తలపెడతారు. ఏలిన నాటి శని కారణంగా ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. అవివాహితులకు పెళ్లి గంట మోగే సూచనలున్నాయి. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. డబ్బు నష్టం జరగవచ్చు. ఆరోగ్యం జాగ్రత్త.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
గ్రహగతులు అన్ని విధాలా అనుకూలంగా ఉన్నాయి. తలచిన పనులు నెరవేరుతాయి. చలాకాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. తీర్థయాత్రకు ప్రణాళికలు తయారు చేసుకుంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. శివార్చన చేయించండి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి ఉద్యోగాలకు సంబంధించి విదేశాల నుంచి అనుకూల సమాచారం అందుతుంది. భార్యా పిల్లలతో విందు వినోదాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వాదనకు దిగవద్దు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఇల్లు లేక స్థలం కొనుగోలు విషయంలో ఒప్పందం కుదర్చుకుంటారు. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. షాపింగ్‌ చేస్తారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధాలు కుదరవచ్చు. సమీప
బంధువుకు సంబంధించిన ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)
బంధుమిత్రుతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పాత స్నేహితులు పలకరిస్తారు. శుభకార్యాల విషయంలో జీవిత భాగస్వామితో చర్చిస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగం విషయంలో అనుకూల
సమాచారం అందుతుంది. కొద్దిగా అనారోగ్యం వచ్చే ప్రమాదం ఉంది.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆలయాలకు వెళ్తారు. జీవిత భాగస్వామితో వాదనకు దిగవద్దు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. డబ్బు నష్టం జరుగుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. భార్య తరపు బంధువు ఇంటికి వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రయాణ సూచనలు ఉన్నాయి. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
శుభకార్య ప్రయత్నాలు ప్రారంభిస్తారు. బంధుమిత్రులతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగం విషయంలో ఆందోళన చెందుతారు. అప్పు తీసుకోవడానికి, ఇవ్వడానికి ఇది సమయం కాదు. భార్యాపిల్లలతో కారక్షేపం చేస్తారు. ఎవరితోనూ వాదనకు దిగవద్దు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)
ఈ రోజు గ్రహస్థితి అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులు, స్నేహితులను పకరిస్తారు. దూర ప్రాంతంలోఉన్న సంతానం నుంచి
శుభవార్తలు వింటారు. విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుంది.
Published by: Krishna Kumar N
First published: September 30, 2020, 5:40 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading