Horoscope 3-8-2021: రాశి ఫలాలు.. కొత్త ఉత్సాహం, పనులు పూర్తి, కొన్ని సంతోషాలు

Horoscope 3-8-2021: రాశి ఫలాలు

Horoscope Telugu: ఈ రోజు (ఆగస్ట్ 3, 2021) రాశిఫలాలు ఎలా ఉన్నాయి? ఏ రాశుల వారికి మంచి ఫలితాలు వస్తున్నాయి? ఏ రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

  • Share this:
    Horoscope today: గ్రహాల కదలికలు, నక్షత్రాలు, తిథులు, కాలం వంటి అంశాల ఆధారంగా రాశి ఫలాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. గ్రహాలు ఏ రాశి క్షేత్రంలో తిరుగుతున్నాయో దాని ఆధారంగా... జ్యోతిష పండితులు ఆయా రాశులవారి జ్యోతిష్యాన్ని చెబుతున్నారు. అన్నీ మంచి శకునాలే ఉంటే... ఎలాంటి సమస్యా లేనట్లే. అదే చెడు సంకేతాలు ఉంటే... తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు దెబ్బ తినకుండా చూసుకోవాలి. కరోనా సమయం కాబట్టి ఆర్థిక అంశాల్లో, డబ్బు విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. మరి 3-8-2001 నాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో... పండితులు ఎలాంటి పంచాంగం చెబుతున్నారో తెలుసుకుందాం.

    మేష రాశి (Aries)
    అనుకూలమైన సమయం ఇది. పనులన్నీ పూర్తవుతాయి. అవరోధాలు, ఆటంకాలు తొలగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. మిమ్మల్ని చూసి అసూయపడే వారుంటారు. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో బాగా లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం కాపాడుకోవాలి. పని ఒత్తిడి ఉంటుంది.

    వృషభ రాశి (Taurus)
    సమయం అంతగా అనుకూలంగా లేదు. ప్రతి పనికీ ఆటంకాలు ఎదురవుతాయి. కొన్ని ముఖ్య కార్యాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగంలో ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. వ్యాపారంలో లాభాలు తగ్గుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది.

    ఇది కూడా చదవండి: Zodiac Signs: ఏ రాశుల వారికి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి?

    మిథున రాశి (Gemini)
    తగినంత ప్రయత్నం చేస్తే అదృష్టం మీదవుతుంది. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఎంతో అనుకూలమైన సమయం ఇది. ఉద్యోగంలో అవకాశాలు కలిసి వస్తాయి. మీ వల్ల నలుగురికీ మేలు జరుగుతుంది. ప్రశాంతత చేకూరుతుంది. ప్రేమికులు సరదాగా గడుపుతారు. వ్యాపారులకు చాలా బాగుంది.

    కర్కాటక రాశి (Cancer)
    ప్రయత్నాల్ని కొనసాగిస్తే విజయం సిద్ధిస్తుంది. జీవితంలో స్థిరత్వం ఏర్పడడానికి నాంది పలుకుతారు. ఉద్యోగంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారంలో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. కుటుంబసభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వివాదాలకు ఇది సమయం కాదు. వృత్తి నిపుణులు కష్టపడాల్సి ఉంది.

    సింహ రాశి (Leo)
    కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. కొద్దిగా సంపద పెరిగే సూచనలున్నాయి. వ్యాపారపరంగా శ్రమ ఎక్కువవుతుంది. పలుకుబడి పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. హామీలు ఉండొద్దు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది.

    కన్య రాశి (Virgo)
    ఉద్యోగంలో ఉత్సాహంతో పని చేస్తారు. అవసరాలకు ధనం లభిస్తుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడికి గురి కాకుండా నిర్ణయాలు తీసుకోండి. మిత్రుల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది.

    ఇది కూడా చదవండి: Bhakti: చీపురుకు ఇవి కడితే... లక్ష్మీదేవి మీతోనే...

    తుల రాశి (Libra)
    ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఎటు చూసినా శుభమే గోచరిస్తోంది. ఉద్యోగం సాఫీగా సాగిపోతోంది. చేస్తున్న పనులలో పురోగతి ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించి అవసరమైన ప్రణాళికలను ఆలోచిస్తారు. వ్యాపారంలో ఎంతగానో కలిసి వస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త.

    వృశ్చిక రాశి (Scorpio)
    కాలం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం పెంచుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. కొన్ని కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులకు బాగుంది.

    ధనస్సు రాశి (Sagittarius)
    గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉన్న ఊళ్లోనే మంచి ద్యోగం లభించే అవకాశం ఉంది. పలుకుబడిగల వారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యాల్లో పాల్గొంటారు.

    మకర రాశి (Capricorn)
    ముఖ్యమైన పనులను శ్రమ మీద పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

    ఇది కూడా చదవండి: Zodiac signs: ఏ రాశి వారు ఏ రంగు రాళ్లను ధరించాలి?

    కుంభ రాశి (Aquarius)
    ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఉద్యోగపరంగా మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. తల పెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూల సమయం. ఆరోగ్యం పరవాలేదు. ఎవరికీ హామీలు ఉండొద్దు.

    మీన రాశి (Pisces)
    ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం చేకూరుతుంది. సానుకూల వాతావరణం నెలకొని ఉంది. వ్యాపారంలో కూడా శుభ ఫలితాలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. రుణాలు తీరుస్తారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. కోర్టు కేసులో నెగ్గుతారు.
    Published by:Krishna Kumar N
    First published: