Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి శుభవార్త.. అప్పుల కష్టాలు తీరుతాయి..

ప్రతీకాత్మక చిత్రం

Today Horoscope: నేడు శనివారం.. ఇవాళ పలు రాశుల వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. బంధువుల రాకపోకలు ఉంటాయి. పెళ్లి సంబంధ కుదిరే అవకాశం. కొన్ని రాశుల వారికి అప్పుల కష్టాలు తీరుతాయి. మరి మేషం నుంచి మీన రాశి వరకు.. ఇవాళ ఎవరికి ఎలా ఉందో తెలుసుకుందాం..

  • Share this:
    కాలజ్ఞానం

    అక్టోబరు 2, 2021

    దిన ఫలాలు

    మేషం (Aries): (అశ్విని, భరణి, కృత్తిక 1)
    తలపెట్టిన పనులన్నీ శ్రమ లేకుండా పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్కు అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లలు చూడటానికి వస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ప్రేమ సఫలమవుతుంది. ఆర్థిక లావాదేవీలు జరపవద్దు.

    వృషభం (Taurus): (కృత్తిక 2.3.4, రోహిణి, మృగశిర 1,2)
    ఆదాయం ఆరోగ్యం పరవాలేదు. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. బంధువుల రాకపోకలు ఉంటాయి. స్నేహితురాలికి బహుమతులు ఇస్తారు. వ్యాపారులకు అన్నివిధాలా బాగుంది. ఆరోగ్యం జాగ్రత్త. కోర్టు కేసులో విజయం సాధిస్తారు.

    మిథునం (Gemini): (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
    ఆర్థికంగా చాలా బాగుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారులు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. కోర్టు కేసు అనుకూలం అవుతుంది. ఆరోగ్యం పరవాలేదు. స్నేహితురాలితో షికార్లు చేస్తారు.

    Dreams Meaning: మీకు వచ్చే కలలో ఇలా జరిగిందా ? అయితే మీ నిర్ణయాలను మార్చుకోవాల్సిందే

    కర్కాటకం (cancer): (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
    ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. స్వల్పంగా అనారోగ్యం బాధ తప్పదు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి ఇది సమయం కాదు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. వ్యాపారులకు అనుకూలంగా ఉంది. స్నేహితురాలి మీద ఖర్చు చేస్తారు. కోర్టు కేసు వాయిదా పడుతుంది.

    సింహం (Leo): (ముఖ, పుబ్బ, ఉత్తర 1)
    ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. సమయం అనుకూలంగా ఉంది. తలచిన పనులు మిత్రుల సహాయంతో నెరవేరుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుమారుడికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం వస్తుంది. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. వ్యాపారులకు బాగుంది.

    కన్య (Virgo): (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
    ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విదేశాల నుంచి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ వస్తుంది. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం పరవాలేదు.

    మహిళలు ఈ పనిచేస్తే.. ఆ ఇల్లు లక్ష్మీనివాసమే!

    తుల (Libra): (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
    దగ్గరి బంధువులను ఆదుకుంటారు. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. లాయర్లకు, సామాజిక కార్యకర్తలకు అనుకూలంగా ఉంది. చిన్ననాటి స్నేహితులు పలకరిస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అనుకూల సమాచారం అందుతుంది. స్నేహితురాలితో సరదాగా కాలక్షేపం చేస్తారు.

    వృశ్చికం (Scorpio ) : (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
    ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. సోదరులతో ఆస్తి తగాదాలు తలెత్తే అవకాశం ఉంది. దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే సూచనలున్నాయి. వ్యాపారులు ఎంతగానో కష్టపడాల్సి ఉంటుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉండకపోవచ్చు.

    ధనుస్సు( Sagittarius ): (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
    ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి, స్వయం ఉపాధి వారికి అనుకూలంగా ఉంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. బంధువుల ఒత్తిడి అధికంగా ఉంటుంది.. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

    ఈ 5 రాశులవారు ప్రతి విషయాన్ని డీప్‌గా ఆలోచిస్తారట!

    మకరం (capricorn): (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
    ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. స్థాన చలనానికి అవకాశం ఉంది. రుణ విముక్తులయ్యే ప్రయత్నం చేస్తారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆర్థిక లావాదేవీలకు సమయం కాదు. ప్రేమ వ్యవహారాలు ముందుకు వెళ్లవు. వ్యాపారులు శ్రమ పడక తప్పదు.

    కుంభం (Aquarius): (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
    ఆదాయం బాగానే ఉంటుంది. కొంతవరకు అప్పులు తీరుస్తారు. ఎంతో శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో లక్ష్యాలు పూర్తి చేయడంలో సహోద్యోగులు సహకరిస్తారు. వ్యాపారుల లాభాలు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయండి.

    మీనం (Pisces): (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
    ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్ వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఆదాయం పెరుగుతుంది. అప్పుల వాళ్ల ఒత్తిడి తగ్గించుకుంటారు. ఉద్యోగులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. వ్యాపారులకు ఆర్థికం గా కొద్దిగా పరవాలేదు. ఎవరికీ హామీలు ఉండవద్దు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమలో ముందడుగు వేస్తారు.
    Published by:Shiva Kumar Addula
    First published: